- నిదానంగా వ్యాయమం చేయడం ద్వారా శరిరానికి ఎలా బలపడుతుందో,సహనం కూడ అలాగే మెల్లిగా అలావాటై మనోబలాన్ని ఇస్తుంది--ఏక్ నాద్ ఈశ్వరన్..గ్రంధకర్త
- నిజము అయిన ప్రేమ మొదట హ్రుదయం లొ మొదలయ్యి,ఆ తర్వాత చూపులకి చేరుతుంది.
- నిజాలు చేప్పెవాళ్ళు మోసం చేయ్యరు. మోసాలు చేసేవాళ్ళు నిజాలు చెప్పారు.
- నిజాయితిగల ధైర్యవంతులకు క్షమగుణం వుంటుంది...ఇంధిరాగాంది
- సానుకూల ద్రుక్పదంతో నీ ఆలోచనలు నిరంతరం సాగుతునే వుండాలి.
- జ్ఞానం అనంతమైనది.మనకు తెలిసినంతే జ్ఞానం అనుకొవటం మూర్ఖత్వం.
- ఛూడమ్మ...ఎప్పుడైనా తెలియని Angel కన్న, తెలిసిన Devil better...
- నిన్న నచ్చని మనిషి నేడు నచ్చొచ్చు...కాని...నిన్న నచ్చిన మనిషి నేడు నచ్చకపోతే మారింది తను కాదు " నీ ఆలోచనలు "
- తెలివితేటలు వున్న ప్రతివారు జ్ఞానవంతులుకారు.
- దూరంగా చిన్న వెలుగు రేఖ కూడా కనిపించని చీకటే భవిష్యత్తయితే, దొరికిన మినుగురుల్తో ఆడుకోవటమే మంచి పద్దతి.
- నేను చేసేది యుధ్ధం కాదు, యజ్ఞం... గెలవడం ఉండదు...సాధించడం ఉంటుంది... ఓడిపోవడం ఉండదు...విసిగిపోవడం ఉంటుంది... విసుగు అనే అంచు దాటితే...సాధిస్తాను...(pa)
- ఒకరిని చూస్తే అకారణంగా వాళ్ళతో స్నేహం చేయాలి అనిపిస్తుంది.ఆబిమానం కలుగుతుంది,వ్యక్తిత్వాలు,ఆర్దం చేసుకొవటాలు అవన్ని తరువాత వచ్చేవి.Eg:గాంధి గారి భావలు మనకు నచ్చవచ్చు.వ్యక్తిత్వం గొప్పగా కనపడవచ్చు.అందుకని ఆయన్ని వివామాడాలనుకొం!
- ఏది ఏమి అయన ప్రేమ వస్తు తెచ్చే సంతొషం కన్నావెళ్తు ఇచ్చే విషాదనికే బరువు ఎక్కువానిపిస్తుందీ!!! (21-10-09)
- డబ్బు ని కాని, ప్రేమ ని కాని మనం ఇచ్చే స్థితిలో వుండాలి. ఆశించే స్థితిలో కాదు.అడుక్కునే స్థితిలో అసలే కాదు...(15-1-10)
- సంపాదించుకోగల శక్తి ఉన్న దానికోసం చెయ్యిచాచకు.- మైజల్ సర్వెండస్,స్పెయిన్ రచయిత
- గడ్డు పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కోవడంవల్ల మనోబలం పెరుగుతుంది.- జిమ్మీ డ్యురాంట్
- ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండురోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి.- ద్వారం వెంకటస్వామినాయుడు
- ఎలా చదవాలో తెలుసుకోగలిగితే ప్రతి మనిషీ ఒక గ్రంథమే.- విలియమ్ బోలింగ్
- తప్పొప్పుల్ని లెక్కబెడుతూ కూర్చుంటే ప్రేమించడానికి మనకు సమయం మిగలదు.- మదర్ థెరెసా
- వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?...:)
- నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం,అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం...:)
- నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.- అంబేద్కర్
- తినడానికి చేపను ఇచ్చేకంటే... చేపను పట్టే నైపుణ్యాన్ని నేర్పితే మేలు...:)
- మంచి స్నేహం భగవంతుడి వరం.- తులసీదాసు
- జీవితం ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్పుతుంది. నేర్చుకోని రోజు జీవితం వృథా అయినట్లే. - రవీంద్రనాథ్ టాగోర్, విశ్వకవి
- జీవితం సైకిల్ ప్రయాణం. అదుపుతప్పకుండా ఉండాలంటే తొక్కుతూనే ఉండాలి.- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- ఫ్రతి ఒక్కరు మానవళిని మార్చలనే చూస్తారు... తమను తాము మార్చుకోవాలని చూడరు... :)
- వ్యక్తి గా ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిందే...కాని ...ఎవరిని మనం ఆరాధించకూడదు...:)
- ఏ పని అయినా తరచూ చేస్తూవుంటే అది అలవాటుగా మారుతుంది.ఆ అలవాటును కొనసాగిస్తే అది మనలో పాతుకుపోతుంది...:)
- భగవంతుడు సృష్టించిన స్ర్తీ వుండాలి...అరువు తెచ్చుకున్న ప్రవాహంలో కలిసే కాలువ కారాదు...:)
- ఎలా సంపాదించాలో తెలిసినవాడు కాదు ఎంత సక్రమంగా ఖర్చుపెట్టాలో తెలిసినవాడే ధనవంతుడు.- వాల్టర్ అన్నెన్‌బర్గ్, ధర్మదాత
No comments:
Post a Comment