దేవుడు అడగని ప్రశ్నలు



# మీ ఇంటి గదులెంత విశాలమైనవో దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు !


# నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు. నీ సంపాదనలో ఎంత నిజాయితో వుందో అడుగుతాడు !


# నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు. నీ విధ్యుక్త ధర్మాన్నీ నీ శక్తి కొద్దో నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు!


# నీదెంత పెద్ద కారో దేవుడు అడగడు. నడిచి వెళ్ళే వాళ్లను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చావని అడుగుతాడు!


# నీకెంతమంది స్నేహితులున్నారని దేవుడు అడగడు. నువ్వెంతమందికి స్నేహితుడివని అడుగుతాడు! 


# నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు. నీలో ఎంత సౌశీల్యత ఉందని అడుగుతాడు!


# నువ్వు ఏ ఘనమైన పిండివంటలతో భోజనం చేస్తావని దేవుడు అడగడు. నువ్వెంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు!


# నీ అలమరలో నీకెన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు. నువ్వెంతమంది నిర్భాగ్యులకు నీ బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు!


# నువ్వెంతమందికి న్యాయం చేశావని దేవుడు అడగడు. ఎంతమందికి అన్యాయం కాకుండా చూశావని అడుగుతాడు!


# నువ్వెందరికి గుణాలు పంచి ఇచ్చావని దేవుడు అడగడు. ఎందరి కష్టాల్లో పాలు పంచుకున్నావని అడుగుతాడు!


# నువ్వెన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చదివానని దేవుడు అడగడు. చదివిన పుస్తకాల్లో నువ్వెంత సారాన్ని గ్రహించావని అడుగుతాడు!


# నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు. నువ్వెంత మానవసేవ చేశావని అడుగుతాడు!


# నువ్వెలాంటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు. ఇంకొకరికి సాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించమంటాడు!


# ముక్తిపథం చేరటానికి ఇంత ఆలస్యం చేశావేమని దేవుడు అడగడు. నువ్వురాగానే నీ చెయ్యి పట్టుకుని స్వర్గ ధామం వైపు తానే తీసుకువెడతాడు.

No comments: