చిగుళ్ళనుంచి రక్తస్రావం...?
నోటి పరిశుభ్రత చక్కగా పాటించని వారిలో గార, పాచి చిగుళ్ల మీద చేరి వాపు, నొప్పి వస్తాయి. ఈ పాచి, గారలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే చిగురు క్రమంగా తగ్గిపోయి పళ్లు కదిలి, పడిపోయే ప్రమాదం ఉంటుంది.
చిగుళ్ల నుంచి రక్తస్రావానికి అనేక కారణాలు ఉంటాయి. బ్రషింగ్ సరిగా చేయకపోవడం, గార తొలగించుకోవడానికి అవసరమైన ఫ్లాసింగ్ (ఫ్లాస్ అనే దారం ద్వారా పంటి మధ్య భాగాలను శుభ్రపరచుకోవడం) చేయకపోవడం వంటివి చిగుళ్ల నుంచి రక్తస్రావానికి దారితీయవచ్చు. పంటిపై పేరుకునే పాచిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే అది క్రమంగా గారగా మారుతుంది. అప్పుడు చిగుళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలకు పాకవచ్చు. దీనివల్ల నోటి దుర్వాసన కూడా వస్తుంది.
ఈ జాగ్రత్తలు కూడా పాటించండి...
1. పొడుగాటి బ్రిజిల్స్ ఉన్న బ్రష్ కంటే చిన్న బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌తో బ్రషింగ్ చేసుకోండి.
2. బ్రషింగ్‌కు ముందు వేడినీరు ధారగా పడేలా చేస్తూ బ్రిజిల్స్ మెత్తబడేలా బ్రష్‌ను శుభ్రపరచుకోండి.
3. క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేసుకుంటూ ఉండండి.
4. పొగాకు నమిలే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి.
5. వేళకు అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి.
6. బ్రషింగ్ తర్వాత వేలితో చిగుళ్లను మసాజ్ చేసినట్లుగా రుద్దండి. ఈ జాగ్రత్తల వల్ల చాలావరకు దంతాలలో రక్తస్రావం ఆగుతుంది.
పతిరోజూ ఉదయం, రాత్రి... రెండుమార్లు పళ్లు తోముకోండి.
బషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి.

No comments:
Post a Comment