ప్రాయోపవేశం అంటే ఏమిటి?
- పి.నరసింహారావు, వైజాగ్
నేలమీద దర్భలను పరుచుకుని తనకొచ్చిన కష్టాన్ని సకల దేవతలకీ మౌనంగా తపస్సు ద్వారా తెలియజేస్తూ, ఆహారాన్ని విడిచి దేవతల అనుకూలత కోసం (మరణం వచ్చినా సరే సిద్ధపడి) ప్రార్థించడమే ప్రాయోపవేశం. రాముడు సముద్రపు ఒడ్డున ప్రాయోపవేశం చేస్తే సముద్రుడు దిగివచ్చాడు.
మా పిల్లలు క్షేమంగా ఉన్నారు. మా మధ్య విరోధాలు లేవు. అయినా పిల్లలు అసలు ఫోన్ చేయరు. మేము పలకరిస్తే పలుకుతారు. పూర్వ ప్రేమ పుట్టడానికి లలితానామాల్లో మంత్రం ఉందా?
- కె.రామబ్రహ్మశర్మ, హైదరాబాద్
ఈ రోజుల్లో పిల్లలందరూ ముఖ్యంగా ఉద్యోగులు వాళ్లను వాళ్లే పట్టించుకోలేనంత చాకిరీ చేస్తూ దాన్నే జీవితమనీ, దాన్లోనే ఆనందం ఉందనీ భ్రమిస్తున్నారు. మీతో ఫోన్లో మాట్లాడే సమయంలో కూడ ఉద్యోగ విధులను గూర్చి ఆలోచించేటంత కార్యాలయ సేవకులు వాళ్లు. అందరూ అంతే. మీరే వాళ్లను పట్టించుకుంటూ పలకరిస్తూ ఉండండి. ఈ విషయంలో లలితమ్మకు సంబంధం లేదు.
కోపం తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఎలా?
- కె.విజయ, విద్యాసాగర్
కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులకు పుట్టుకతో కోపం వస్తుంది. గర్భధారణ కాలానికి కొంచెం ముందు స్ర్తీ, పురుషుల దేహాల్లో ఎవరికి పట్టుదల, కోపం ఉన్నా ఆ కాలంలో గర్భాన పడ్డ సంతానానికి జన్మకోపం ఉంటుంది. అందుకే వాత్స్యాయనుడు గర్భాదానాన్ని ‘తపస్సు’ అన్నాడు. నేటివారికి అది వేళాకోళంగా ఉంటుంది. సుందరకాండలో 53వ సర్గలో ‘యద్యస్తి ప్రతిశుశ్రూషా...’ అని ప్రారంభించి 4 శ్లోకాలున్నాయి. నిరంతరం చదివిస్తూ ఉండండి. కోపం తీవ్రత తగ్గుతుంది
మత్స్యయంత్రాన్ని స్థాపిస్తే కలిగే లాభాలేమిటి?
- ...
ఇంటిలోనున్న తెలియని వాస్తుదోషాలు తొలగడానికి, ధనధాన్యాలు ఉండడానికీ, కుటుంబ ఐకమత్యానికీ పెద్దలు మత్స్యయంత్రాన్ని స్థాపించమన్నారు. దీన్ని సశాస్త్రీయంగా ఇంట్లో ప్రతిష్టించినట్లయితే కచ్చితంగా సత్ఫలితాలు లభిస్తాయి.
రెండురోజూలూ వ్యాప్తి ఉన్న తిథులని నిర్ణయించుకోవడం ఎలా?
- డి. వరలక్ష్మి, హైదరాబాద్
సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటే, సూర్యోదయానంతరం మారినా సరే, ఆ రోజుకి ఆ తిథిగానే లెక్కించుకోవాలి. ఇక పూర్ణిమ, అమావాస్యల విషయానికి వస్తే రాత్రి 12 గంటలకు ఈ తిథి ఉన్నప్పుడు మాత్రమే వాటిని అమావాస్య, పున్నమిగా గుర్తించాలి.
మంత్రానికి అనుసంపుటి అంటుంటారు. దాని అర్థం ఏమిటి?
అను అంటే ఒక మంత్రాన్ని అనుసరించడం, సంపుటి అంటే ఆ మొదటి మంత్రంతో కలిపి చదువుకోవడం. రెంటినీ కలిపితే అనుసంపుటి అవుతుంది. ఉదాహరణకి లలితా సహస్రనామాలలో 7వ శ్లోకాన్ని అనుసంపుటి చేయవలసిందని చెప్పారనుకుందాం. అప్పుడు ఒకటో శ్లోకం, ఏడవ శ్లోకం, రెండ వ శ్లోకం, ఏడవ శ్లోకం, మళ్లీ మూడవ శ్లోకం, ఏడవ శ్లోకం.. ఇలా చివరి శ్లోకం వరకు ఈ ఏడవ శ్లోకాన్ని విడవకుండా చేయాలి. దానినే అనుసంపుటి చేయడమంటారు.

No comments:
Post a Comment