Sneham



ఒక మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవటం ఒక ఎత్తైతే, ఆ స్నేహాన్ని నిలుపుకోవటం దానిని మించినది. స్నేహితులతో అన్ని సందర్భాలలోనూ సంస్కారయుత భాషణమే వాంఛనీయం. దానికి భిన్నంగా స్నేహితుని మనస్సును గాయపరచే మాటలు మాట్లాడటం, పరిహాసం పేరుతో వెకిలి మాటలతో, పదిమందిలో పరాభవం చేసే రీతిగా మాట్లాడటం మహాపాపం. స్నేహాన్ని వంచనా శిల్పంతో స్వార్థ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయటం ప్రారంభిస్తే అక్కడితో ఆ స్నేహం అంతరిస్తుంది.

No comments: