కాళ్ళ పగుళ్ళు తగ్గాడానికి
1) అరటి పండు తొక్కను పగుళ్ళకు రాసుకొని 10 నిమిషాలు ఆరనించి, కాళ్ళు కడుగు కుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
2)Koddiga perugu,Nimmarasam,vepa podi,pasupu podi anni mix chesi padaluku pattistey kalu mruduvuga avutai...(3 days ki 1 ce ila cheastey chala manchidi)
3)పావు బకెట్ గోరువెచ్చని నీటికి కప్పు నిమ్మరసం, రెండు చెంచాల దాల్చిన చెక్కపొడి, ఆలివ్ నూనె, పాలు అరకప్పు చొప్పున కలిపి ఇప్పుడు రెండుపాదాలను బకెట్‌లో అరగంటసేపు ఉంచి టూత్‌బ్రష్‌తో (లేకపొతే )ఫ్యూమిన్ రాయి బాగా రుద్దాలి.
4)నాలుగు మగ్గుల నీళ్లలో చారెడు ఉప్పు, కొద్దిగా షాంపూ వేసి పాదాలను నానబెట్టాలి. పగుళ్లున్న చోట టూత్‌బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. పావుగంటయ్యాక కాళ్లను చల్లటినీళ్లతో కడిగి తువాలుతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా రాత్రిపూట చేస్తే ఫలితం ఉంటుంది.
5)వంట నూనెలలో తేమశాతం ఎక్కువ. పడుకునే ముందు పాదాలను సున్నిపిండితో రుద్ది శుభ్రంగా కడిగి వంటనూనెతో మర్దన చేయాలి. నూలు సాక్సులు ధరించి పడుకుంటే మర్నాటికి మెత్తబడతాయి.
6)కొందరికి పగుళ్లు ఎక్కువై నొప్పి బాధిస్తుంటుంది. అలాంటి వారు అరటి పండు గుజ్జుకు చిటికెడు పసుపు జోడించి పాదాలకు రాయాలి. అరగంటయ్యాక కడిగేయాలి. అరటిపండు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పసుపు పగుళ్లలో చేరిన ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తుంది.
7)పావు బకెట్ నీళ్లలో నిమ్మరసం కలిపి అందులో పాదాలను నానబెట్టాలి. దీనివల్ల పగుళ్లలో చేరిన మట్టి తొలగిపోతుంది. అయితే బాగా గాయాలయిన వారు ఈ నియమాన్ని పాటించకపోవడం మంచిది.
8)పొడి చర్మం తత్వం వారయితే రాత్రిపడుకునే ముందు కాళ్లు కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
9)వ్యాసలీన్‌లో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పగుళ్లు దూరమవుతాయి.
10)గులాబీ నీళ్లు, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మర్దన చేయాలి. దీనివల్ల చర్మం సున్నితంగా మారుతుంది.
11)చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి
12)
నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిపాలు... ఒక్కొక్కటి రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుని సగం బకెట్ గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటిలో పాదాలను 20 నిమిషాలపాటు ఉంచి, సబ్బు లేదా ఉడకపెట్టిన నిమ్మచెక్కలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే పాదాలు పగుళ్లు తగ్గి అందంగా ఉంటాయి.
No comments:
Post a Comment