Software World......... Absolutely Hilarious!!!...
రాంబాబు ఈ మధ్యనే ఒక కాలేజీ నుండి తన బీ . టెక్ ( మెకానికల్లో అండోయ్ !) పూర్తి చేసుకుని ఒక కంసల్టెన్సీ ద్వారా బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు . అప్పటిదాకా ఏదో సాదాసీదాగా , మామూల మనిషిలాగా గడిపేసిన రాంబాబు ఈ సఫ్ట్వేర్ కంపెనీలో ఎలాటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అన్నదే ఈవేళ్టి నా కథాంశం .
రాంబాబు వెళ్తూనే వాళ్ళ కాలేజీ సీనియర్ అయిన చందుని కలిశాడు . తన హెచ్ . ఆర్ ఓరియంటేషన్ అయ్యాక మళ్ళి కలుద్దమని అనుకున్నారు . రాంబాబు హెచ్ . ఆర్ ఓరియంటేషన్ పూర్తి చేసుకుని వచ్చాడు . చందు రాంబాబును చూస్తూనే " పద బాస్ , ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము ", అన్నాడు . ఇద్దరూ కలిసి కెఫెటీరియాకి వెళ్ళారు . అక్కడ వాళ్ళ మధ్యన సంభాషణ :
రా : ఏంటి , ఇది మెస్సా ?
చ : మెస్సు లాంటిదే , కెఫిటీరియా అంటారు
రా : ఓహో , ఫుల్ మీల్స్ ఎంత , ప్లేట్ మీల్స్ ఎంత ?
చ : ( ఒక్క నిముషం ఖంగు తిని ) ఒరేయ్ బాబు , ఇక్కడ మీల్స్ ఫ్రీరా , నువ్వెంతైనా తినొచ్చు .
రా : ఆహా , మరి పార్సెల్ కూడా చేసుకోవచ్చా ?
చ : లేదు . అది కుదరదు .
రా : ఓహో , కాఫీ ఆర్డర్ ఇచ్చావా ?
చ : ఇక్కడ మనలాంటి వాళ్ళకు ఆర్డర్ చేసేవాళ్ళే కానీ , తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు . పద , కాఫీ మిషన్ చూపిస్తాను .
( రాంబాబు , చందు ఇద్దరూ కాఫీ తెచ్చుకుంటారు )
రా : ప్చ్ ... ఏమైనా ఫిల్టర్ కాఫీ రుచి లేదురా .
చ : అదీ దొరుకుతుంది . యాభై రూపాయలే .
రా : అబ్బే , నాకు ఫిల్టర్ కాఫీ ఇష్టం ఉండదు . ఊరికెనే పోల్చి చెప్పాను అంతే .
చ : ( వీడికి ఇంకా కుర్రదనం పోలేదు . కాలేజీకి ఎక్కువ , కార్పొరేట్ కి తక్కువ ) ఓహో .
ఇంతలో హెచ్ . ఆర్ అమ్మాయి ఒకామె వచ్చి రాంబాబుని , "How are you doing Rambabu? Do you know PCK already?" అంది . రాంబాబు ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఊరుకున్నాడు . చందు ఆమెతో , "Yes, he is from my alma mater.", అన్నాడు . దానికి ఆ అమ్మాయి , "Oh, that's fantastic. So, you are his buddy then. Do you mind taking him around the office until his manager is available to meet him?", అంది . దానికి చందు , "Oh - sure!", అన్నాడు . ఆమె నవ్వేసి , "See you around Rambabu. Have a great day!", అంది .
ఇది వింటూ పావలాకే పావుకిలో బంగారం దొరికినట్టు రాంబాబు ఒక తన్మయత్వం నిండిన ఎక్స్ప్రెషన్ పెట్టాడు . అది గమనించిన చందు , ఇలాగన్నాడు :
చ : హెల్లో బాసు . ఏమిటి సంగతి ?
రా : అబ్బే , ఏమీ లేదు .
చ : ఏదో ఉండే ఉంటుంది , చెప్పులే !
రా : ఈ అమ్మాయి నాకు పడిపోయింది .
చ : ( ఇది విని పొలమారగా తాగుతున్న కాఫీ మళ్ళి కప్పులోకే ఒంపేసి ) నీకా ఫీలింగ్ ఎందుకు వచ్చింది బాబు ?
రా : చందు , నీకు జీకే తక్కువ అనుకుంటాను . ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసు పదే పదే నవ్వుతూంటే , షేక్ హ్యాండులు ఇచ్చేస్తూ ఉంటే , " మళ్ళీ కలుద్దామని పబ్లిక్ గా " చెప్తూ ఉంటే దాని అర్థం ఏమిటి ?
చ : ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఉంటే , ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటే , ఆమె అందరినీ అలాగే పలకరిస్తుంటే దానికర్థం ఏమిటి ?
రా : ఆ ?
చ : బాబు , ఇక్కడ అమ్మాయిలు దాదాపు అందరూ ఇలాగే ఉంటూ ఉంటారు . అలాగని వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని అనుకోకు . దెబ్బైపోతావు .
రా : హా ? హయ్యారే ? ఏమి ఈ పరాభవము . దీని గొంతు పిసకాలి . అవును . ఇంతకీ , ఏదో పిసికే అంటోంది ?
చ : పిసకడమా ?
రా : అదే , " హలో పిసికే " అంది ?
చ : ఓ , ఓహొ , ఓహోహో . పీ . సీ . కే , అవి నా ఇనీషియల్స్ , పి . చంద్రశేఖర కుమార్ .
రా : అలాగా . అదేదో బడ్డీ అంది . అక్కడేమైనా మిరపకాయ బజ్జీలూ అవీ అమ్ముతారా ?
చ : దేవుడా ! బడ్డీ అంటే " స్నేహితుడు " అని అర్థం .
రా : బుడ్డీ అంటే స్నేహితురాలా ?
చ : ఒరేయ్ , నన్ను ఒదిలెయ్యరా బాబు . పద నీకు ఆఫీసు చూపిస్తాను .
రా : ప్లీస్ చెప్పరా ! నువ్వు అదేదో " మటర్ " అన్నావు . ఆలూ మటర్ లాగా అదేమైనా తినుబండారమా ?
చ : వామ్మో , వాయ్యో . నీ వొకాబులరీనీ చింపెయ్య , నీ వోకల్ కార్డ్స్నీ తెంపెయ్య ! " అల్మా మటర్ " అంటే " నేను చదివి కాలేజీ ", అని అర్థం .
రా : పదా ! నిన్ను కాదు , ఆ వెంకటేశ్వర్రావుని తిట్టాలి .
చ : వాడెవడు ?
రా : మా ఇంగ్లీషు లెక్చరర్ . ఏంటొ మామూలుగా నేను చదివిన ఇంగ్లీషులో ఇవన్నీ నేర్పలేదు .
No comments:
Post a Comment