ముఖ చర్మపు ఆరోగ్యం:
కలుషిత వాతావరణం, ముఖ్యంగా మోటారు వాహనాల నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి, విపరీతమైన ఎండ, మనం వాడే సబ్బులు, క్రీములు, పౌడర్లు మొదలైనవి చర్మంపై ప్రభావం చూపుతాయి.
ముఖకాంతిని కాపాడుకోవాలంటే:
1)శనగపిండిలో నిమ్మరసం, పాలమీగడ, తేనెలను కలిపి ప్రతిరోజూ ఉదయం ముఖానికి రాసుకుని ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఆహారంలో తాజాఫలాలు, ఆకుకూరలు, మొలకెత్తే పప్పుధాన్యాలు తినండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ప్రతిరోజూ మేలిమిరకం కుంకుమపువ్వు 200 మి.గ్రా. పాలు, చక్కెరలో కలిపి తాగండి.
2)టొమాటోని ఉడకబెట్టి పేస్ట్ చేసుకుని దానిలో తాజా కలబంద రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలతో పాటు వాటి వల్ల ఏర్పడే మచ్చలు కూడా తగ్గుతాయి
మూడు టీస్పూన్ల టొమాటో రసంలో టీస్పూను తేనె కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటే, కొద్దిరోజుల్లోన ే కాంతివంతమైన ఛాయ మీ సొంతమవుతుంది
మందులు:
కుంకుమాది లేపము: రాత్రి పడుకునేటప్పుడు ముఖంపై మొటిమలు, మచ్చలపై పూసుకోండి.
ఆరోగ్యవర్ధిని (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1
మహామంజిష్ఠాది కాఢ (ద్రావకం): మూడు చెంచాలకు ఆరు చెంచాలు నీళ్లు కలుపుకుని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపున తాగండి.
బరువు పెరగడానికి:
పుష్టికరమైన ఆహారం తింటూ, తగినంత వ్యాయామం చెయ్యండి. ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం నియమిత వేళల్లో అలవాటు చేసుకోండి. ముఖ ఆరోగ్యం కోసం పైన చెప్పిన ఆహారం కూడా మంచిదే. అరటిపండ్లు, బొప్పాయి పండ్లు (సహజంగా పండినవి) బాగా తినండి. మీ పొడవుకు అనువైన బరువు దాటిపోకుండా చూసుకోండి. అశ్వగంధ లేహ్యాన్ని ఒక చెంచా తిని పాలు తాగాలి (రెండుపూటలా).

No comments:
Post a Comment