జూన్:
ఈ నెలలో పుట్టిన వాళ్లు సృజనాత్మక వృత్తులను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమస్య తలెత్తినప్పుడు ఆందోళన పడకుండా కూల్‌గా పరిష్కారం గురించి ఆలోచిస్తారు. ‘ఫలానా పని చేస్తే నాకు లాభం ఏమిటి?’ అనే కోణంలో ఆలోచించకుండా పరులకు చేతనైన సహాయం చేస్తారు. విజయాన్ని పలుసార్లు ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఉదా: జూన్ మూడో తేదిన జన్మించిన థామస్ డార్నీ ప్రపంచంలోనే బెస్ట్ స్విమ్మర్‌గా పేరు తెచ్చుకున్నాడు.


జూలై:
సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఎంత ఉత్సాహం చూపుతారో జూనియర్ల నుంచి నేర్చుకోవడానికీ అంతే ఉత్సాహం చూపుతారు. జ్ఞాపకాలను చాలా ఇష్టపడతారు. అలా అని గతంలో ఉండడానికి ఇష్టపడరు. భవిష్యత్ వైపు చూస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటారు. వాటిని నిజం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. తమ తప్పులను ఇతరుల మీద వేసి తప్పించుకోవాలని చూడరు. ప్రతిభావంతులను ప్రొత్సహించడానికి ఇష్టపడతారు.


ఆగస్ట్ :
చాలా విషయాల్లో నిర్మొహమాటంగా మాట్లాడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా సబ్జెక్ట్‌ను అభిమానిస్తే అది అర్థం కాకపోయినా నిరాశపడరు. అర్థం అయ్యే వరకు భీకరంగా కష్టపడుతూనే ఉంటారు. తమలో ఏదైనా దురలవాటు ఉంటే దాన్ని మానేయడానికి గట్టిగా ప్రయత్నించి విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలకే బెదిరిపోతారు. మరికొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఎదురైనా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తారు.


సెప్టెంబర్:
శత్రువులను ద్వేషించడం కంటే వారిని మిత్రులుగా చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. స్వయంప్రతిపత్తిని ఎక్కువగా ఇష్టపడతారు. ‘నేను ఎవరినీ కష్టపెట్టనప్పుడు, నన్ను ఎవరూ కష్టపెట్టరు’ అని సిద్ధాంతాన్ని నమ్ముతారు.
విషయాలను తాత్వికంగా విశ్లేషించే సామర్థ్యం ఉంటుంది. నడవడికలో పెద్దరికం కనిపిస్తుంది. బోధనారంగాన్ని ఎంచుకున్న వాళ్లు అత్యుత్తమ విజయాలు సాధిస్తారు.



అక్టోబర్:
ఊహించని సమయంలో కష్టాలు ఎదురువుతుంటాయి. అలాంటి సందర్భాల్లో సన్నిహితులు అండదండగా నిలుస్తారు. కొన్ని పనుల్లో ఉత్సాహంగా దూరిపోతారు. ఆ పని తమకు అచ్చిరాదని తెలుసుకొని వీలైనంత త్వరగా బయటపడతారు. ఇంట్లో ఉండడానికి ఎంతగా ఇష్టపడతారో ప్రయాణాలు అంటే కూడా అంతగా ఇష్టపడతారు. అప్పుడప్పుడు బద్దకంగా ఉంటారు. ఏది చేయాలనిపించదు. ఏ విషయం మీదా ఆసక్తి చూపరు. 


నవంబర్:
సెంటిమెంట్ ఎక్కువ. తమ కుటుంబసభ్యుల గురించి ఎప్పుడూ చెబుతుంటారు. కొన్నిసార్లు జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఇతరులతో చేసే సరదా కొన్నిసార్లు తలనొప్పులను తెస్తుంది. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారుగానీ ఆ కోరిక ఎంతో సేపు నిలవదు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. ఏవో అపార్థాలతో స్నేహితులు దూరమవుతుంటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతుంటారు.


డిసెంబర్:
‘ఏ స్థితిలో పుట్టామనేది ముఖ్యం కాదు ఏ స్థితికి వెళ్లామనేది ముఖ్యం’ అనుకుంటారు, విజేతల గురించి వినడమన్నా, చదవడమన్నా చాలా ఇష్టం. విజేతల నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా విజేత కావడానికి నిర్మాణాత్మక ప్రయత్నాలు చేస్తారు. దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటారు. పదిమందిలో ఉన్నా తమ ఆలోచనల్లోనే ఉంటారు.



జనవరి:
తమ జీవితంలోని ప్రతి విషయం అందరికీ తెలియాలని అనుకోరు. అభిమానించే వాళ్లతో ఎంత సన్నిహితంగా ఉంటారో అంతే గౌరవంగా ఉంటారు. ‘సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉండు. కారణం కోసం వెదుక్కోకు’లాంటి వాక్యాలను ఇష్టపడతారు. రెండు మూడు రోజుల క్రితం జరిగిన ముఖ్యమైన విషయాలను మరచిపోతుంటారుగానీ ఎప్పుడో చిన్నప్పటి ప్రాముఖ్యం లేని విషయాలు మాత్రం బాగా గుర్తుంటాయి.

ఫిబ్రవరి:
ఎవరినీ నొప్పించని సునిశిత హాస్యం మాటల్లో తొంగి చూస్తుంటుంది. పొరపాటున తమ మాటలను ఎవరైనా అపార్థం చేసుకుంటే తెలివైన వివరణ ఇచ్చి అపోహలను వెంటనే తొలగించే సామర్థ్యం ఉంటుంది. పరుల సలహాలతో కాకుండా సొంత నిర్ణయాలతో విజేతలు కావడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో అతి జాగ్రత్త ఉంటుంది. కొన్ని విషయాల్లో అతి నిర్లక్ష్యం ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన మనస్తత్వం ఉండటం వల్ల దానిని అవలీలగా అధిగమించగలరు.


మార్చి:
సాధించినదానితో సంతృప్తి చెందరు. అదే విజయం అనుకోరు. ఎవరినీ నిర్లక్ష్యం చేయరు. ప్రతి వారిలో ఏదో ప్రతిభ ఉంటుందని నమ్ముతారు. సంతోషంగా ఉండడానికి, నవ్వుతూ కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. గత విషయాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఇష్టపడరు. కష్టపడకుండా సాధించే విజయాల కంటే కష్టపడి సాధించే విజయాలను ఇష్టపడతారు. పనిలో సంతోషం వెదుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అది దొరకనప్పుడు వేరే పని వేపు వెళ్లడానికి సంకోచించరు



ఏప్రిల్:
కామెడి అంటే మహా ఇష్టం. సాహసకృత్యాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పరాజయాలను అంతగా పట్టించుకోరు. కొన్ని విషయాల్లో తొందరగా సహనం కోల్పోతుంటారు. కొన్ని పనులను అత్యంత వేగంగా చేస్తారు. మరికొన్ని పనులను చేయడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. చివరికి ఏదీ తేల్చుకోరు. పట్టుదల అనేది రావాలి గాని సాధించే వరకు విడవరు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కాకుండా స్నేహితులతో, సన్నిహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు.


మే:
వయసు గురించిన స్థిర అభిప్రాయాలను తిరస్కరిస్తారు. మంచి పని చేయడానికి వయసు అడ్డంకి కాదు అని నమ్ముతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చూడాల్సిందిగా భగవంతుడిని సదా వేడుకుంటారు. తమను తాము ఎప్పుడూ పిల్లలుగానే భావిస్తారు. కొన్ని తప్పులను తప్పులుగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ‘పని చెయ్యి... ఫలితం ఆశించకు’లాంటి వాక్యాలను ఇష్టపడతారు. 



courtesy by sakshi... :)

No comments: