పంచకర్మ ఫలాలు
ప్రతిజీవుడూ చనిపోయాక ఏమీ పట్టుకువెళ్లలేడనడం వింటూనే ఉంటాం. భౌతికంగా ఏమీ పట్టుకువెళ్లడు. నిజమే. అయితే తన వెంట అదృశ్యరూపంగా ఐదుఫలితాలు మాత్రం వెళ్లితీరతాయట. అవే తన తర్వాత జన్మకి బీజాలు. ఏ విత్తనాలు నాటితే అదే పంట ఎలా వస్తుందో, ఏ కర్మబీజాల్ని మనం జీవితాంతం సంపాదించుకొంటామో అవే విత్తనాల వల్ల మనకి మరో జన్మ కల్గి ఆ దేహం వల్ల మనం సంపాదించుకొన్నది అనుభవిస్తాం. ఆ విత్తనాలు ఎవ్వరికీ ఆఖరుకి సంపాదించుకున్నవాడికి కూడా కనిపించవు. పార్థివదేహం నశించిన వెంటనే ఈ విత్తనాలు వెనకాలే బయలుదేరి వస్తాయి. ఈ విషయాన్ని వ్యాసుడు, శంకరభగవత్పాదులూ అంగీకరించారు. ఇంచుమించుగా ఆ తత్త్వాన్నే పంచతంత్రం ఇలా చెబుతోంది.
దారిద్య్ర రోగ దుఃఖాని బంధన వ్యసనాని చ
ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినామ్॥
మనం చేసే మంచి పనులైనా, చెడ్డ పనులైనా... అవి బీజాలుగా మారి మన వెంట వస్తూనే ఉంటాయి. అందులో మనం చేసిన అపరాధం అనే చెట్టుకి ఐదు ఫలాలు కాస్తాయట. అవి బీదతనం, రోగాలు, దుఃఖాలు, బంధనాలు, కష్టాలు... అనేవి. ఈ జన్మలో మనం లేమి అనుభవిస్తుంటే దానికి కారణం క్రితం జన్మలో మనం ఎవ్వరికీ ఏమీ ఇవ్వకపోవడమనే దుష్కర్మే కారణం. పైగా ఇప్పుడు బీదవారం కనుక ఎలాగూ ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేని స్థితే కనుక రాబోయే జన్మలో కూడా మనకు దారిద్య్రం అనే బీజం వెన్నంటే వస్తుంది.
ఈ వేళ మందులకి అంతుబట్టని రోగాలు వస్తే అదీ పూర్వజన్మ ఆర్జితమే. చిన్నచిన్న నెప్పులూ, కాళ్లు లాగడం, దగ్గు మొదలైన వానికి మనం తిన్న ఆహారమే కారణం కావచ్చు. కానీ అవయవాలు లేకపోవడం, చచ్చుబడి జీవితాంతం యథాస్థితికి రాకపోవడం మొదలైన రోగాలకు మన పూర్వ దుష్కర్మే కారణమని వేదాంతుల బోధ.
ఇంక మనం ఎన్ని మంచిపనులు చేస్తున్నా మనకి ఈ దుఃఖం ఏమిటి? అని అందరూ అనుకొంటారు. మహాత్ములైనవారికి కూడా ఈ దుఃఖానుభవాలు తప్పవు. రాముడు, కృష్ణుడూ లేదా ఏ ఇతర మతాల వారి దైవాలకైనా దుఃఖాలు కలిగినట్లుగా మనం చరిత్రలో వింటున్నాం. కనుక కర్మ అనేది దైవానికీ పక్షపాతం లేదు.
మనం ఎంత పైకి వద్దామన్నా ఏవో బంధనాలు మనని వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటిని విడిచిపెట్టి మనం భోగభాగ్యాలు అనుభవింపలేకపోవడం కూడా పూర్వకర్మ ఫలితమే.
‘‘కష్టాలు కూడా మన అపరాధ వృక్షానికి అధికంగా కాసిన పళ్లే. మన ఇంట్లో కాసిన పళ్లు ఎవరికైనా పంచిపెట్టుకొంటాం. కానీ కర్మ ఫలాలను మనం తిని తీరవలసిందే. ఈ కష్టాలు అనేక రకాలు. కొందరికి దారిద్య్రం కష్టమైతే కొంతమందికి ఎక్కువ డబ్బు ఉండడమే కష్టం. ఇలా అన్ని రంగాల్లోనూ కష్టాలు తప్పవు. ఈ ఐదు కర్మఫలాలూ తినకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ దాటలేరు. కనుక ప్రారబ్ధకర్మ తప్పదు. అయితే ఈ జన్మలోని అనుభవాలతో వచ్చే జన్మలో ఇవి కలగకుండా ప్రయత్నించాలి.

No comments:
Post a Comment