లాక్ డౌన్ స్పెషల్ తెలుగు పదవినోదం.
ఈ క్రింద ఇవ్వబడ్డ పదాలన్నీ ‘ఆ' తో మొదలయ్యి, ‘ము' తో అంతమవుతాయి.
వాటి అర్థాలు క్రింద ఇవ్వబడ్డాయి.
అంతే కాదు..
అన్ని నాలుగు అక్షరాల పదాలే.
ఆ పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం.
1. సంపాదన
2. పర్ణశాల
3. తోట
4. ధ్వని, అరుపు
5. మొదటిది
6. ఆజ్ఞ
7. రూపం
8. తద్దినము
9. గుడి
10. వాడుక, పద్ధతి
11. ఇల్లు
12. అడ్డంకి
13. రాక
14. మిన్ను
15. ఏడుపు
16. ఓ దిక్కు
17. పీట
18. వింత
19. కోపము
20. రాబడి
21. గొప్పతనము
22. తృప్తి, తనివి
23. ఒక తైలము
24. శస్త్రము
25. పరితాపము
26. అరోగ భావము
27. జాగు
28. చుట్టుకొనబడినది
29. అంటు
30. అండ
31. ఓ నెల
32. సభ
33. పిలుపు
34. అభినయ విశేషణం
35. భోజనము
36. అతిథిసత్కారము
answers
1. సంపాదన ... ఆర్జితము
2. పర్ణశాల ... ఆశ్రమము
3. తోట ... ??
4. ధ్వని, అరుపు ...ఆరువము
5. మొదటిది ... ఆరంభము
6. ఆజ్ఞ ... ఆదేశము
7. రూపం ... ఆకారము
8. తద్దినము ... ఆబ్డికము(aabDikamu)
9. గుడి ... ఆలయము(aalayamu)
10. వాడుక, పద్ధతి ... ఆచారము
12. అడ్డంకి ... ఆటంకము
13. రాక ... ఆగమనము
14. మిన్ను ... ఆకాశము
15. ఏడుపు ... ఆక్రోశము
16. ఓ దిక్కు ... ఆగ్నేయము(aagneayamu)
17. పీట ... ఆసనము
18. వింత ... ఆశ్చర్యము
20. రాబడి ... ఆదాయము(aadaayamu)
21. గొప్పతనము ... ఆర్బాటం
23. ఒక తైలము ... ఆముదము(aamudamu)
24. శస్త్రము ... ఆయుధము
25. పరితాపము ... ఆరాటము
26. అరోగ భావము ... ఆరోగ్యము
28. చుట్టుకొనబడినది ... ఆక్రమణ
30. అండ ... ఆలంబనము
31. ఓ నెల ... ఆషాడము
33. పిలుపు ... ఆహ్వానం
35. భోజనము ... ??
36. అతిథిసత్కారము ... ఆతిధ్యము(aatidhyamu)
?? / teliyanavi cheppa galaru ... :)
No comments:
Post a Comment