ఎన్నెమ్మ కథ !
అనగనగా ఒక ఊరిలో సోమయాజులు అని బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కూతురు పుట్టింది .ఆ పిల్లకు రోజూ నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారు. ఆ పాప పెరిగి పెద్దదయింది .ఆమెకు ఎన్నెమ్మ అని పేరు పెట్టారు .వాళ్ళ పెరటి దొడ్లలో ఒక మొక్క మొలిచింది. ఆ మొక్క కూడా పెరిగి పెద్దదయింది. వాళ్ళకు పని చేస్తూ ఒక జీతగాడు ఉండేవాడు .ఒక రోజు బ్రాహ్మణుడు తన పిల్లకు పెళ్లి చేయాలని ఉద్దేశించి తన పెరటిలో పెరిగిన మొక్క ఏమొకో , పేరు చెప్పిన వారికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించాడు. అది విని వచ్చిన అందరూ ఆ మొక్క ఏమిటో చెప్పలేకపోయారు. వాళ్ళింట్లో పని చేసే జీతగాడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ మొక్క పేరు చెబుతాడు. అది పాపకు నలుగు పెట్టినప్పుడు మొక్క అని నలుగు పిండి లో నుంచి వచ్చిన పెసర మొక్క అని చెబుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు మెచ్చుకొని వారికి వివాహం జరిపించాడు. వారికి ఇద్దరు పిల్లలు .ప్రతి రోజు అతను రాత్రి లేచి బయటకు వెళుతుంటే ఎన్నెమ్మ ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆలోచించేది. అతను వెళ్లి చెప్పులు కుట్టి వస్తున్నాడు అని అర్థమైంది ఎన్నెమ్మ కు. అయ్యో ఎంత పొరపాటు జరిగింది .ఇతని నా నేను పెళ్లి చేసుకున్నది ,మాదిగ వాడిన అని ఎన్నెమ్మ చాలా బాధపడింది.
,
మరుసటి రోజు తండ్రిని నాన్నా ,కుక్క ముట్టుకున్న విస్తరి ఎంగిలి ఎలా శుద్ధి అవుతుంది అని అడిగింది. తండ్రి అగ్నితో కానీ శుద్ధి అవ్వదని చెబుతాడు. అప్పుడు ఎన్నెమ్మ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటికి నిప్పు అంటించింది. ఆ మంటలకు బాధపడుతూ తట్టుకోలేక ఆ ఆ..... ఆకలి అనే అరిచి కేకలు పెడుతుంది. నీకు పురిటి పిల్లలు ఆహారం అవుతారు అని చెబుతారు. ఎవరైతే పురిటిలో నీ కథ చెప్పుకొని ,బ్రాహ్మణుడు కూతురు ;మాదిగ వాడి పెళ్ళాం అనుకుంటూ ఉంటారో వాళ్ళ జోలికి నువ్వు పోకు అని చెబుతారు. సరే పోను అంటుంది ఎన్నెమ్మ. ఇంతటితో కథ సమాప్తం.
No comments:
Post a Comment