మెదడుకి మేత
తెలుగు పజిల్
*ఈ రాజు లెవరో పేరులు రాయండి*
1. పది తలల రాజు ఎవరు?
2. దిన రాజు ఎవరు?
3. రేరాజు ఎవరు?
4. వలరాజు ఎవరు?
5. నగరాజు ఎవరు?
6. ఖగరాజు ఎవరు?
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు?
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?
9. నెలరాజు ఎవరు?
10. మృగరాజు ఎవరు?
11. దేవతల రాజు ఎవరు?
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?
18. అష్టదిగ్గజాలనేలిన
రాజు ఎవరు?
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?
*ఈ రాజు లెవరో పేరులు రాయండి*
1. పది తలల రాజు ఎవరు? ... రావణుడు
2. దిన రాజు ఎవరు? ... సూర్యుడు
3. రేరాజు ఎవరు? ... సుయోధనుడు
4. వలరాజు ఎవరు? ... మన్మధుడు
5. నగరాజు ఎవరు? ... హిమవంతుడు
6. ఖగరాజు ఎవరు? ... గరత్మంతుడు
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? ... దిలీపుడు
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు? ... దశరధుడు
9. నెలరాజు ఎవరు? ... చంద్రుడు
10. మృగరాజు ఎవరు? ... సింహము
11. దేవతల రాజు ఎవరు? ... ఇంద్రుడు
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు? ... విశ్వామిత్రుడు
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు? ... హరిశ్చంద్రుడు
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు? ... ధర్మరాజు
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు? ... ధృతరాష్ట్రుడు
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు? ... పరీక్షిత్మహారాజు
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు? ... శంతనమహారాజు
18. అష్టదిగ్గజాలనేలిన రాజు ఎవరు? ... కృష్ణదేవరాయలు
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు? ... )రాజరాజ నరేంద్రుడు
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు? ...
No comments:
Post a Comment