-:  పూజ-పరమార్థాలు :-


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


           - పూజ  - 

          ***********

పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.


          -  అర్చన -

          **********

 అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


           -  జపం -

           *********

అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.


            - స్తోత్రం -

            **********

నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


           - ధ్యానం -

          ***********

ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.


                - దీక్ష -

              *********

దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.


         - అభిషేకం -

         ************

 అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.


              - మంత్రం -

             ***********

తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.


             - ఆసనం -

            ***********

 ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


             - తర్పణం -

            ************

 పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


              - గంధం -

              *********

అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.


           - అక్షతలు -

            **********

కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.


            - పుష్పం -

           ***********

 పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.


              - ధూపం -

             ***********

చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.


               - దీపం -

               *********

సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.


              - నైవేద్యం -

              *********

ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.


               - ప్రసాదం -

               ***********

 ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.


           - ఆచమనీయం -

           ****************

 లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .


              - ఆవాహనం -

             **************

పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.


               - స్వాగతం -

               ************

దేవతను కుశలప్రశ్నవేయుట.


               - పాద్యం -

              **********

చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.


        -  మధుపర్కం -

          **************

 తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.


             - స్నానం -

            ***********

గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.


             - వందనం -

             ***********

అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).


            - ఉద్వాసన -

             ************

 దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


ఓం శ్రీ గురుదేవాయ నమః 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


No comments: