స్కిప్పింగ్
శరీర బరువును తగ్గించాలన్నా, ఊబకాయాన్ని నివారించాలన్నా, శరీరం మరింత దృఢత్వంగా ఉండాలంటే చాలామంది డైట్ కంట్రోల్ చేసినంత మాత్రాన బరువు తగ్గడం లేదా ఊబకాయం తగ్గడం లాంటివి కొద్ది రోజుల వరకే తగ్గినట్టుగా అనిపిస్తుంది.
కాని మళ్ళీ యధస్థితికి చేరుకుంటుంది. తీరా డైట్ కంట్రోల్లో పెట్టలేకపోతే అంతే మరి. కాబట్టి చిన్నపðడు ఆడుకున్న ఆట తాడాట అంటే స్కిప్పింగ్ ఆడితే తప్పనిసరిగా బరువును నియంత్రించవచ్చు.
స్కిప్పింగ్ చేస్తే శరీరం బరువు దానంతట అదే తగ్గి చాలా నాజుగ్గా తయారవుతుంది. దీనికి ఎపðడు పడితే అపðడు స్కిప్పింగ్ చేయాల్సిన పనిలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయంలో చేస్తుంటే బరువు తగ్గి చలాకీగా తయారవుతారు.
ముందుగా రెండు నిమిషాలపాటు తాడాట ఆడండి. అది కూడా మెల-మెల్లగా దుమికేందుకు ప్రయత్నించండి. రెండు నిముషాల ఆడిన తరువాత మీ శరీరం కాస్త వేడెక్కుతుంది.
తరువాత వేగాన్ని పెంచండి. స్కిప్పింగ్ చేసిన తరువాత ఐదు నిముషాలు విశ్రాంతి తీసుకోండి. లేదా శవాసనం వేయండి. దీంతో శరీరంలోనున్న అలసట కాస్త తగ్గుతుంది.
అరగంట తరువాత తేలికపాటి ఆహారం తీసుకోండి. ఉదాహరణకు మొలకెత్తిన గింజలు లేదా ఉడకబెట్టిన పెసలు, యాపిల్‌పండు. అరటిపండు, పాలు, నిమ్మకాయ రసం వీటిలో ఏదైనా తీసుకోండి.
స్కిప్పింగ్ వల్ల లాభాలు:
స్కిప్పింగ్ చేసిన తరువాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతుంది.
స్కిప్పింగ్ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది
.
స్కిప్పింగ్ చేయడంతో తరుచూ భుజాలు తిపðతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
చేతి మడమలు తిపðతుడటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
చిన్న వయసువారు స్కిపింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.
స్కిప్పింగ్ ఎవరెవరు చేయకూడదంటే:
అధిక రక్తపోటు వారు ఈ వ్యాయామం చేయకూడదు. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు ఏ మాత్రం చేయకూడదు. పూర్తిగా కొలుకున్నాము అనుకున్న తరువాత మాత్రమే స్కిపింగ్ చేయాలి. లేదా
మూడు నెలలు తరువాత వైద్యుల సలహా మేరకు స్కిప్పింగ్ చేయవచ్చు. హెర్నియా రోగులు స్కిప్పింగ్ చేయకూడదు.
గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకూడదు.
No comments:
Post a Comment