జుట్టు

జుట్టు రాలడం ఈ రోజులలో మనం అందరిలో చూస్తున్న సమస్యే. వైద్య పరిభాషలో జుట్టు రాలడాన్ని ''ఆలోపెశియా'' అని అంటారు. 

జుత్తులో చుండ్రు రాకుండా జాగ్రత్తపడండి. చుండ్రు వంటి ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల జుట్టు రాలడం జరుగుతుంది.

 జుట్టును ఇష్టం వచ్చినట్టు ముడులు వేయడం, గట్టిగా ముడి వేయడం చేయకూడదు. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కురులకు గాలి ఎంతో అవసరం.


* కలబంద నూనె తయారీకి కావలసిన పదార్ధాలు కలబంద గుజ్జు పావు కేజీ, కొబ్బరి నూనె పావు కేజీ, కలబంద మట్టను తీసుకుని దానిని చీల్చి లోప ఉండే గుజ్జునంతటినీ తీసుకోవాలి. అయితే ఈ గుజ్జు ముద్దలుగా లేకుండా చూసుకోవాలి.


* జుట్టు నల్లబడాలనుకుంటే కలబందను పేస్ట్‌ చేసి కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి రెండ గంటల తరువాత తలస్నానం చేస్తే వేడి తగ్గుతుంది. జుట్టు నిగనిగలాడుతుంది. కలబందను ఉపయోగించడం వలన ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స వుండవు, అంతేకాక చుండ్రు తగ్గుతుంది.


వారానికి ఒకరోజు జుట్టు కుదుళ్లకు ఆముదం పట్టించి పదినిమిషాలు మసాజ్ చేసి ఆ తరవాత తలస్నానం చేయాలి.

వారానికి ఒకరోజు తలస్నానం చేసిన జుట్టుకు టీ డికాషన్ పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే జుట్టు పట్టులా మెరుస్తుంది.


గోరువెచ్చటి కొబ్బరినూనెను జుట్టుకు పట్టించి పదినిమిషాల సేపు మసాజ్ చేయాలి. ఆ తర్వాత వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి పదినిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో లేదా శీకాకాయ్‌తో తలస్నానం చేయాలి.

No comments: