మెడ సౌందర్యానికి...
- బియ్యం పిండి - ఒక చెంచా
- పెరుగు - ఒక చెంచా
- నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్
- కీరా, నిమ్మరసం రెండూ కలిపి అందులో పసుపును వేసి మెడ చుట్టూతా రాసి, పావు గంట తర్వాత నీటితో శుభ్రపరిస్తే మెడ నలుపు తొలగిపోయి, వర్చస్సుగా ఉంటుంది.
- కలబంద గుజ్జులో పసుపు, శెనగపిండి కలిపి మెడ చుట్టూతా ప్యాక్‌లాగా పట్టించాలి. ఆ తర్వాత మెత్తని బట్టను వేడి నీటిలో ముంచి, ఆ ప్యాక్‌ను పూర్తిగా తీసేసి, నీటితో కడిగితే చర్మానికి వర్చస్సు ఏర్పడి, మెడ సౌందర్యం పెరుగుతుంది.
- మెడకు మాయిశ్చరైజర్‌ను పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి.
- మెడమీద మట్టి, జిడ్డు, దుమ్ము నల్లగా పేరుకోకుండా స్నానం చేసే సమయంలో క్లీనింగ్ క్రీమ్‌తో చర్మాన్ని శుభ్రపరచాలి.
- వేడినీటిలో తడిపిన చిన్న తువ్వాలును మెడ చుట్టూ చుట్టి ఓ పదినిమిషాలపాటు అలాగే ఉంచాలి. అలా చేస్తే చర్మాం శుభ్రపడటమే కాకుండా రక్తప్రసరణ మెడకు చక్కగా జరుగుతుంది.
- చలికాలంలో గాలి ప్రభావం మెడ చర్మం మీద ప్రసరించకుండా, మెడకు మాయిశ్చరైజర్ లేదా కోల్డ్‌క్రీమ్‌ను రాయాలి.
- మెంతి ఆకుల రసంలో మెత్తని పెసరపిండి లేదా సున్నిపిండిని కలిపి మెడకు పట్టించి, కొంత సేపయిన తర్వాత నీటితో శుభ్రపరిస్తే, మెడ ఎంతో కాంతిగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
- నిమ్మరసంలో ఉప్పు, పసుపు కలిపి పేస్టులా చేసి దాన్ని మెడకు పట్టించి మసాజ్ చేసినట్లయితే, అది స్క్రబ్‌లాగా పనిచేస్తుంది
- ఓట్‌మీట్ పౌడర్ - ఒక చెంచా
తేనె -ఒక చెంచా
పాలు - ఒక చెంచా
వీటన్నిటి మిశ్రమాలను కలిపి మెడచుట్టూ పట్టించి 10నిమిషాలు మసాజ్ చేసి ఆరిన తర్వాత శుభ్ర పరచుకోవాలి.
- కొందరికి ముఖం మెడ భాగం నల్లగా మారిపోతుంటుంది. అలాంటివారు పచ్చి బొప్పాయి తీసుకుని ముఖము, మెడ భాగంపై రుద్దండి. అది ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగివేయండి.
- పొట్టుశనగపిండి - ఒక చెంచా
నల్లద్రాక్షలు -ఐదు
బొప్పాయి గుజ్జు ముక్కలు కొన్ని
వీటన్నింటిని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును మెడచుట్టూ పట్టించి 10 నుంచి 15నిమిషాలు మసాజ్ చేసి తడి ఆరిన తర్వాత శుభ్రపరచు కోవాలి. ఈ ఎండాకాలంలో ఈ ప్యాక్‌లు రాసుకోవడంతో పాటు మరికొనిజాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎండలో ఎక్కువ నడిచే పని ఉన్నప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. లేకపోతే సూర్యకిరణాల ప్రభావానికి ఇంకా నల్లగా మారిపోయే అవకాశం ఉంది. - రోజుకు కనీసం రెండుసార్లు మూడు లేదా నాలుగు నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇందువల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది
- నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment