తలస్నానం తెలుసా?

వారానికి ఒకటిరెండుసార్లు తలంటి స్నానం చేయడం మంచిదని తెలుసు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు తలంటి పోసుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రం దృష్టిలో తలంటుకోవడం అంటే నువ్వులనూనెను తలకు, ఒంటికి పట్టించి, ఆ తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడురసంతో తలస్నానం చేయడం. అసలు ఈ విషయంలో ధర్మశాస్త్రం ఏమి చెబుతోందో, చెక్ చేసుకుందాం. 

1.ఆదివారం తలంటిపోసుకుంటే శరీరానికి తాపం కలుగుతుందని తెలుసు. ఎందుకంటే ఆదివారానికి, సూర్యునికి సంబంధం ఉంటుంది కాబట్టి ఆరోజు తలంటిస్నానం వల్ల ఒంటికి వేడి ఎక్కువవుతుంది.

2.సోమవారం అభ్యంగస్నానం చేయడం శుభప్రదం. ఈరోజు తలంటుకుంటే సౌందర్యం వృద్ధి అవుతుంది.
3.మంగళవారం తలంటి స్నానం అమంగళకరం, అశుభం. ఎందుకంటే మంగళవారం తాపగ్రహమైన అంగారకునితో ముడిపడి ఉన్నది కాబట్టి ఒంట్లో రక్తప్రసరణ వేగం ఎక్కువవుతుంది.
4.బుధునితో సంబంధమున్న బుధవారం నాడు తలస్నానం చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది.  
5. గురువారం తలస్నానం శరీరహాని కలిగిస్తుంది. కాబట్టి ఈ వేళ విద్యాసంబంధమైన విషయాలపైన దృష్టి పెట్టడం మంచిది. 
6.రాక్షసగురువైన శుక్రునితో సంబంధం కలిగిన శుక్రవారం నాడు తలస్నానం చేస్తే కోపం అధికమవుతుంది. దానివలన వివిధ రకాల కష్టనష్టాలు కలుగుతాయి. అయితే స్త్రీలు శుక్రవారం నాడు చేయవచ్చు.
7.శనైశ్చరునికి ప్రీతికరమైన నువ్వులనూనెను తలకు, ఒంటికి పట్టించి శనివారం నాడు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.

No comments: