గృహప్రవేశంలో ముందుగా గోవును ఇంట్లోకి ఎందుకు పంపాలి?
- టి.బాల్ ముకుంద్ సింగ్, అమరచింత దేవతలు ఉండేది (తమ శక్తుల్ని అంశరూపాలతో ఉంచేది) గోవులోనే. మహర్షులతో సమానమైన శక్తి కలవి గోవులే (గోభిస్తుల్యం న పశ్యామి ధనం కించిదిహాచ్యుత!). దురదృష్టవశాత్తూ తల్లి పురిటిలోనే మరణిస్తే బిడ్డకు పాలిచ్చి జన్మను ప్రసాదించేది గోవులే. అలా గోవులు ప్రవేశించడమంటే దేవతలూ, ఋషులూ, మాతృమూర్తులూ ప్రవేశిస్తూ... మేము నీకు అండగా ముందు నడుస్తున్నామని చెప్పడం అన్నమాట!
గృహప్రవేశం చేస్తుండగా ఇంట్లో ఆవు ముందుగా ఎడమ పాదాన్ని పెట్టింది. ఇది అశుభానికి గుర్తా?
- వి.వి.సుబ్బారావు, బెంగళూరు
కుడి పాదాన్ని పెట్టి ప్రవేశించాలనే నియమం ఆ గృహానికి సంబంధించిన యజమానికి, అతడి భార్యకి మాత్రమే. మిగిలిన బంధువులూ, స్నేహితులూ ఎలా ప్రవేశించినా తప్పులేదు. అందరికంటె ముందుగా వెళ్లే గోవు ఎలా వెళ్లినా దోషం లేదు. గోవుతో పోలిక సరికాదు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

No comments:
Post a Comment