మనసును శాంతంగా ఉంచుతున్నారా?
ప్రశాంతమైన మనసు, చక్కటి ఆలోచనలు మానసిక, శారీరిక ఆరోగ్యానికి చాలా అవసరం.
జీవనశైలి ఉరుకులు పరుగులుగా మారి ఊపిరి తీసుకోవటానికి కూడా టైమ్ లేని
ఈ రోజుల్లో శారీరక ఒత్తిడితో పాటు మానసిక సమస్యలు కూడా దరి చేరుతున్నాయి.
అయితే కొన్ని చిన్న విషయాలు పాటించటం వలన మనసుకు స్వాంతన చేకూర్చవచ్చు.
ఈ విషయంలో మీ అవగాహన చెక్ చేసుకోండి....

1. తెలుపు రంగు వస్ర్తాలు ధరిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఎ. అవును 
బి. కాదు 

2. పసిపిల్లల నవ్వు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.
ఎ. అవును 
బి. కాదు 

3. విరబూసిన పూలు ఉల్లాసాన్ని, ఆనందాన్ని పంచుతాయి.
ఎ. అవును 
బి. కాదు 

4. సాత్వికాహారంతో మనసు కుదుట పడుతుంది.
ఎ. అవును 
బి. కాదు 

5. స్నేహితులతో ఆనందంగా గడిపిన సమయం కూడా మనసుకు ఉల్లాసానిస్తుంది.
ఎ. అవును 
బి. కాదు 

6. కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా చూసినా మూడ్ చక్కబడుతుంది.
ఎ. అవును 
బి. కాదు 

7.క్లాసికల్ మ్యూజిక్, మంచి సాహిత్యం, సంగీతం ఉన్న చక్కటి పాటలు విన్నా
ప్రశాంతంగా ఉంటుంది.
ఎ. అవును 
బి. కాదు 

8. తోటపని, కుట్లు, అల్లికలు లాంటి నచ్చిన హాబీలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.
ఎ. అవును 
బి. కాదు

పై ప్రశ్నలకు మీ జవాబులు ఆరు కంటే ఎక్కువ అవును అయితే మీరు జీవితంలో 

చిన్న చిన్న విషయాలలో ఆనందం వెతుక్కుంటారని అర్థం. మనసు 
అల్లకల్లోలంగా మారినప్పుడు ఆ చికాకుని ఇతరులపై చూపించకుండా 
మీరుగా ప్రశాంతత పొందటానికి ప్రయత్నిస్తారు.

No comments: