ప్రియమణి
మనిషి చక్రం కనిపెట్టాడు. ఎందుకంటే ఒకేచోట ఉండటం ఇష్టం లేక.
మనిషి వలస వెళ్లాడు. ఎందుకంటే అవకాశాలు లేనిచోట ఉండటం ఇష్టం లేక.
మనిషి దుఃఖపడ్డాడు. ఎందుకంటే సంతోషాన్ని కోల్పోవడం ఇష్టం లేక.
మనిషి గెలవడం నేర్చాడు. ఎందుకంటే ఓడిపోవడం ఇష్టం లేక.
గెలుపును ప్లస్‌గా ఓటమిని మైనస్‌గా సంతోషాన్ని ప్లస్‌గా దుఃఖాన్ని మైనస్‌గా
తూకం వేసుకుంటూ నిత్యం ఘర్షణను అనుభవిస్తూనే ఉన్నాడు.
కాని- రెంటినీ సమానంగా చూడొచ్చు కదా అంటారు ప్రియమణి.
ఆమె తన జీవితంలో ఒక్కరోజు కూడా డిప్రెషన్‌ను ఫీల్ కాలేదు.
ఒక్కరోజు కూడా ఏడుస్తూ దుప్పటి ముసుగుతన్ని పడుకోలేదు.
కళ్ల కింద చారలు, ఒంటరి గదిలో ఆలోచనలు ఎరగరు.
‘ఇట్స్ ఓకే’ అనుకోవడం ఆమె ధోరణి. ఈజీగా తీసుకోవడం ఆమె తత్త్వం.
పాదరసంలా ఏ ఉద్వేగానికీ అంటకుండా జీవించడంలోని సులువు ప్రియమణి కథలో తెలుస్తుంది.
ప్రతి సంఘటన నుంచి మనిషి రీచార్జ్ కావచ్చు... కాకపోతే ఎవరికి వారే
ఆ శక్తిని సమకూర్చుకోవాలని కూడా ఈ కథ చదివితే అర్థమవుతుంది.
ప్రియమణికి చిన్నప్పుడు చాలా పొడవైన జుట్టు ఉండేది. రోజూ ఆ జుట్టును అద్దంలో చూసుకొని, ముందుకూ వెనక్కూ తిరిగి పరికించుకొని, మురిసి, వాళ్లమ్మ బుగ్గచుక్క పెట్టబోతుంటే బుగ్గ మీద వద్దని- జుట్టుకు దిష్టి తగలకుండా పాపిట మధ్యన పెట్టమని- అలా ఆ జుట్టును చూసుకునేది. వెర్రిగా తాపత్రయపడేది.
కాని- ఒకరోజు- తనతో ఆటలో గొడవపడిందని- తన ఈడుదే- మేనత్త కూతురు- ఒకరోజు రాత్రి ప్రియమణి నిద్రపోతుండగా జుట్టంతా బబుల్‌గమ్ అంటించేసింది.
తెల్లారితే స్కూల్లో ఫంక్షన్.
ప్రియమణి నిద్రలేచింది. ఇల్లంతా భయంభయంగా ఆవలించింది. ప్రియమణి అద్దంలో చూసుకుంది. జుట్టు వైపు చూసుకుంది. బబుల్‌గమ్ నుంచి జుట్టును విడిపించడానికి ప్రయత్నించింది. ఇక అది సాధ్యం కాదని అర్థమయ్యాక- ఎంత ప్రయత్నించినా జుట్టు బాగుపడదని అర్థమయ్యాక- మారుమాట్లాడకుండా- ఒక్క ఏడుపైనా ఏడవకుండా- నేరుగా బార్బర్ షాపుకు వెళ్లి- బాబ్‌కట్ చేయించుకుని- ఇంటికి వచ్చి అద్దం ముందు చూసుకొని- ముందుకూ వెనక్కూ తిరిగి పరికించుకొని- మురిసి- ఎప్పట్లాగే తల్లి చేత పాపిట మధ్యన దిష్టిచుక్క పెట్టించుకొని స్కూలుకు వెళ్లిపోయింది.
అంతే.
అంతకు మించి ఒక్క ఎక్కువ లేదు. ఒక్క తక్కువా లేదు.
బహుశా ప్రియమణికి ఆ వయసుకే ఏమని అర్థమై ఉండాలి.
జీవితం అంటే ఇంతే. అది నీకు పొడవైన జుట్టునిస్తుంది. ఆ వెంటనే దానికో బబుల్‌గమ్ కూడా అంటిస్తుంది. రెంటినీ సమానంగా చూస్తేనే హాయి. లేదూ పొడవైన జుట్టు దగ్గరే ఆగిపోతాను, అది పోయినందుకు ఏడుస్తాను, నెత్తి పగలకొట్టుకుంటాను అని అంటే ఏడు. అది నీ ఫెయిల్యూర్.
బాబ్‌కట్‌కి షిఫ్ట్ అయ్యావా అది నీ సక్సెస్.
ఇంకోమాటలో చెప్పాలంటే అది నీ రీచార్జ్.
************************************
‘మళ్లీ మనం బయలుదేరాలి. వలస’ అన్నారు వాసుదేవమణి.
‘ఎక్కడికి?’ అంది భార్య.
‘బెంగుళూరు’ అన్నారాయన.
‘ఎందుకు?’ అని ఆమె అడగలేదు.
వరండాలో నిశ్శబ్దంగా, మంచం మీద నిద్రపోతున్నట్టుగా, అయోమయంగా పడి ఉన్న మామగారిని చూసింది. ఆయనకు పార్కిన్‌సన్ వ్యాధి. ముదిరిపోయింది. పాల్‌ఘాట్‌లో చేయవలసిన వైద్యమంతా చేశారు. బెంగుళూరుకు పోయి సాధించేది కూడా ఏమీ లేదు. అలాగని కన్నతండ్రిని వదిలేస్తామా? మంచి వైద్యం చేయించకుండా మానేస్తామా?
‘పాల్‌ఘాట్‌తో మనం ఇంతగా పెనవేసుకొని పోయాం. మనవాళ్లంతా ఇక్కడే ఉన్నారు. బెంగుళూరుకు పోయి ఎలా బతకడం. ఉద్యోగాలు కూడా వదిలేయాలే’
‘తప్పదు’
‘ప్రియ దిగులు పెట్టుకుంటుందేమోనండీ’ అందామె.
ఆయనేం మాట్లాడలేదు. వాకిలిలో, పెరడులో వెతికి, పిల్లలతో ఆడుకుంటున్న ఆ పిల్ల చేతిని పట్టుకొని, ఆర్తిగా దగ్గర కూచోబెట్టుకొని- ‘ఏమ్మా. మనం ఈ ఊరు వదిలేసి బెంగుళూరు వెళ్లిపోతే నువ్వేమైనా దిగులు పెట్టుకుంటావా?’ అని అడిగారు.
ప్రియమణి ఒక నిమిషం ఆలోచించింది.
‘దిగులు ఎందుకు నాన్నా?’
‘నీ ఫ్రెండ్స్ బంధువులు అంతా ఇక్కడే ఉన్నారు కదా’
‘వాళ్లంతా ఎక్కడికి పోతారు నాన్నా? ప్రతి సమ్మర్‌కు వచ్చి కలవ్వొచ్చు. బెంగుళూరుకు వెళదాం. సిటీ. మోడ్రన్‌గా ఉంటుంది. సినిమా హీరోలను చూడొచ్చు. కన్నడ నేర్చుకోవచ్చు.’
తండ్రి ప్రియమణివైపు విస్మయంగా చూశారు. తల్లి ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
‘అదేమిటే... నీకు చీమకుట్టినట్టయినా లేదా?’
ప్రియమణి తల్లివైపు చూసింది. ఆ తర్వాత తండ్రివైపు తిరిగి, ఆయన కాలర్ సవరిస్తున్నట్టుగా నటిస్తూ రహస్యాన్ని అభినయిస్తూ అంది- ‘పాపం అమ్మకు మనసొప్పుతున్నట్టులేదు నాన్నా. ఆమెను ఇక్కడే వదిలేసి మనం వెళ్లిపోదామా?’
**************************************
వెడల్పు ముక్కు. కనుక ముక్కుపిల్ల అని పేరు. బక్కగా ఉంటుంది. కనుక బక్కపిల్ల అని పేరు. నల్లగా ఉంటుంది. కనుక నల్లపిల్ల అని పేరు. అబ్బాయిలతో ఆడుతుంది. కనుక మగపిల్ల అని పేరు. బెంగుళూరు బనశంకరి ఏరియా సెకండ్ స్ట్రీట్‌లో ప్రియ పేరు చెప్తే చాలు నొటోరియస్. చదువు మీదా? శ్రద్ధ లేదు. అట్టలు తండ్రి వేయాలి. హోమ్‌వర్క్ అన్న చేయాలి. స్కూల్ బ్యాగ్ తల్లి మోయాలి. ముప్పయి ఐదు మార్కులు వస్తే పాస్ కనుక అంతకు చదివితే చాలు. అలాగని తెలివైనది కాదా అంటే చాలా తెలివైనదే. కాని ఒక్క సబ్జెక్టూ చదవదు. ఇంగ్లిష్ తప్ప.
ప్రియమణి చిన్నప్పటి నుంచి టివిలో ఇంగ్లిష్ వార్తలు చూసేది. తండ్రి తెప్పించే హిందూ పేపర్‌ని ఈ మూల నుంచి ఆ మూల దాకా క్షణ్ణంగా చదివేది. స్కూల్లో ఇంగ్లిష్ టెక్స్ట్‌బుక్‌ను మొదటి మూడు నెలల్లోనే పూర్తి చేసేది. రాత్రి పూట డిక్షనరీ పక్కన పెట్టుకొని నిద్రపోయేది.
ప్రియమణితో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే టీచర్లు కూడా కొంచెం జంకేవారు.
తల్లికి ఇది ఆశ్చర్యం.
‘ఎందుకే ప్రియా. అన్ని సబ్జెక్ట్‌లూ వదిలేసి ఒక్క ఇంగ్లిష్‌ని పట్టుకొని ఊగులాడుతున్నావు?’ అని అడిగేది.
ప్రియ నవ్వేది.
‘నీకు తెలియదులే అమ్మా. దానినే జనరేషన్ గ్యాప్ అంటారు’ అనేది.
‘ఏడ్చావులే. ఎచ్చులు ఆపి సమాధానం చెప్పు’ అని తల్లి వెంటపడేది.
అప్పుడు ప్రియ సమాధానం చెప్పేది- ‘అమ్మా. మలయాళం వస్తే కేరళలో బతుకుతావు. కన్నడ వస్తే కర్నాటకలో బతుకుతావు. తమిళం వస్తే తమిళనాడులో మేనేజ్ చేస్తావు. ఇవన్నీ సింగిల్ పాకెట్‌లు. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే గ్లోబ్‌లో ఎక్కడైనా బతకొచ్చమ్మా. ఆరు పాకెట్‌ల ప్యాంట్ వేసుకొని తిరిగినట్టే’
తల్లి విస్మయంతో నోరు వెళ్లబెట్టేది.
ప్రియ తర్వాతి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యేది.
*****************************************
బృందావన్ గార్డెన్స్‌లో కావేరీ నీళ్లు ఎగుడు దిగుడుగా ప్రవహిస్తున్నాయి. బెంగుళూరు స్టూడెంట్స్ పిక్‌నిక్‌కు వచ్చారంటే బృందావన్ గార్డెన్స్‌లోని వాచ్‌మెన్‌లు వేయి కళ్లతో కాపలా కాస్తారు. స్టూడెంట్స్ వస్తే పూలకు గ్యారంటీ లేదు. నీళ్లకూ గ్యారంటీ లేదు.
‘సో... వాట్ నెక్ట్స్’ అడిగిందో స్నేహితురాలు చున్నీని ఎద మీదకు లాక్కుంటూ.
వాళ్లంతా దాదాపు పదిహేనుమంది ఉన్నారు. ఇంటర్ స్టూడెంట్స్. ఫైనల్ ఎగ్జామ్స్ బండ టెన్షన్‌కు ముందు కాస్తంత ఆటవిడుపుగా ఉంటుందని మైసూరుకు వచ్చారు. ఇంటర్ అయిపోతే ఎవరి దారి వారిది. ఇప్పుడే మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకున్నా.
‘నాకు క్లారిటీ ఉంది’ అంది ప్రియమణి.
‘ఏం క్లారిటీ?’
‘ఏముంది. డిగ్రీ చేస్తా. బిఇడి. ఇంగ్లిష్ టీచర్ అయిపోతా. లేదంటే నా ఇంగ్లిష్‌కు ఎయిర్ హోస్టెస్ జాబ్ వస్తుంది. చేస్తా. కాదంటే హోటల్ రంగం ఎలాగూ ఉంది. అది నాలాంటి వాళ్లను రారా అని పిలుస్తుంటుంది’
స్నేహితురాళ్లంతా ఏమీ మాట్లాడలేదు. బృందావన్ గార్డెన్స్ నీళ్లతో రంగులతో రంగురంగుల నీళ్లతో కళకళలాడిపోతోంది. కొన్ని వందల సినిమాలు తీసుంటారక్కడ. కొన్ని వందల పాటలు.
‘ఏం చేసినా నీ మీద ఈ బృందావన్‌గార్డెన్స్‌లో ఒక పాటైతే తీయరు కదా. అలాంటి జీవితం దొరకాలే. అదృష్టం అంటే అదీ’ అందో స్నేహితురాలు.
ప్రియ ఆ స్నేహితురాలివైపు చూసింది. నిజమే. ఈ ఆలోచన తనకు తట్టనే లేదు. టీచర్‌గా చేసినా, ఎయిర్ హోస్టెస్‌గా చేసినా, హోటల్ రిసెప్షనిస్ట్‌గా చేసినా చిల్లర డబ్బులు. డబ్బుకు డబ్బు గుర్తింపుకు గుర్తింపు రావాలంటే గ్లామర్ ఫీల్డుకు వెళ్లాలి.
‘మంచి ఐడియా. మనం ఎందుకు ట్రై చేయకూడదు. సినిమా కాకపోతే మోడలింగ్’ అంది ప్రియ.
ఫ్రెండ్స్ అందరూ నవ్వారు.
ప్రియ వాళ్లవైపు అయోమయంగా చూసింది.
‘ఎందుకు నవ్వుతున్నారు?’
‘నువ్వు మోడలింగ్ ఏమిటే ప్రియా. నీ ముక్కు చూసుకున్నావా అద్దంలో. నిన్నెవరు తీసుకుంటారు మోడల్‌గా?’
ప్రియ ఏమీ మాట్లాడలేదు. ఆ మాట అన్న ఫ్రెండ్‌వైపు జాలిగా చూసి ‘నువ్వు త్వరలోనే చస్తావ్’ అంది.
ఈసారి ఆ ఫ్రెండ్ అయోమయంగా చూసింది. ‘నేను చావడమేమిటి?’ దిమ్మెరపోతూ అడిగింది.
‘జీవితాన్ని ఇలా చూసేవాళ్లెవరైనా త్వరలోనే చస్తారు’ అంది ప్రియ.
ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ప్రియవైపు చాలా ఆసక్తిగా కుతూహలంగా చూశారు.
ప్రియ అంది- ‘వినండి. మీరు మైనస్‌ని చూడకండి. మీలో అయినా నాలో అయినా. ప్లస్‌ని చూడండి. నా ముక్కు బాగోదు. ఒప్పుకుంటాను. కాని నా కళ్లు బాగుంటాయి. కనుక కాటుకకు మోడల్‌గా చేస్తాను. చెవులు బాగుంటాయి. కనుక కమ్మలకు మోడలింగ్ చేస్తాను. పెదాలు బాగుంటాయి. కనుక లిప్‌స్టిక్‌కి మోడలింగ్ చేస్తాను. పళ్లు బాగుంటాయి. కనుక పేస్ట్‌కు మోడలింగ్‌గా చేస్తాను. నా నడుము బాగుంటుంది. ఏం చీరలకు మోడలింగ్ చేయలేనా?’
బృందావన్ గార్డెన్స్‌లో నీళ్లు ఇక్కడ ఒక రంగు లేకపోయినా అక్కడ ఒక రంగుగా ప్రవహిస్తూనే ఉన్నాయి.
******
బయట చెప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయంటే లోపల డెరైక్టర్ భారతీరాజా ఉన్నట్టు గుర్తు. ఆయన ఉన్న దరిదాపుల్లో ఎవరూ చెప్పులతో నడవరు. ఆయన ఉన్న చోట పెద్దగా మాట్లాడరు. ఆయన ఉన్న చోట ఎవరికైనా నవ్వు వస్తుందో రాదో తెలియదు.
ఆయన చాలాసేపుగా తన కేబిన్‌లో ప్రియ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో కన్నడ పేపర్‌లో ఆయన ప్రియ ఫొటో చూశారు మోడల్‌గా. బాగుంది నేను తీయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటాను రమ్మనండి అని కబురు చేశారు బెంగుళూరు ఏజెన్సీకి. వాళ్లు ప్రియను పంపుతామన్నారు. టైమయ్యింది. ప్రియ రావాలి. భారతీరాజా వెయిట్ చేస్తున్నారు. తన సర్వీస్‌లో ఆయన ఎంతోమంది కొత్త హీరోయిన్‌లను పరిచయం చేశారు. ఎంతోమందికి తొలిసారి స్క్రీన్‌టెస్ట్ నిర్వహించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి హీరోయిన్ వినయ విధేయతలతో ఒంగి నడిచేది. తానేమంటానో అని భయపడిపోయేది. ఆ భయం నుంచి బయటకు తేవడానికే తనకు చాలా సమయం పట్టేది. ఇప్పుడు మళ్లీ అలాంటి తతంగం అంతా తప్పదు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు.
కాసేపటికి కాబిన్ డోర్ నాక్ అయ్యింది. ఒక ముఖం లోపలికి తొంగి చూస్తూ, భారతీరాజావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ‘మిస్టర్ భారతీరాజా?’ అని ప్రశ్నించింది.
భారతీరాజా అదిరిపోయారు. పై నుంచి కింద దాకా చూశారు. ప్రియమణి. పాదాలకు చెప్పులతో నిలుచుని ఉంది.
‘రా ప్రియా రా’ అని సర్దుకుంటూ లేచి నిలబడ్డారు. సాధారణంగా ఆయన నిలబడినప్పుడు కొత్తవాళ్లు టక్కున పాదాలకు నమస్కారం చేస్తారు. ప్రియమణికి ఆ అవకాశం ఇవ్వడానికే ఆయన లేచి నిలబడ్డారు.
ప్రియమణి కూచుంది. కనుక భారతీరాజా కూచోవాల్సి వచ్చింది.
‘ఊ. చెప్పు. హీరోయిన్‌గా చేయడానికి నీకున్న అర్హత ఏమిటి?’
‘మీరు కబురు చేశారు కదా. అదే అర్హత’
భారతీరాజా తల పంకించారు.
‘యాక్టింగ్ నేర్చుకున్నావా?’
‘లేదండీ. కాని మీకేం కావాలో గ్రహించి చేయగలను. మీరు చెప్పింది చెప్పినట్టు చేయగలను’
‘ఏం చేయగలవు? నా వంటి డెరైక్టర్ కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని కూడా తెలియదు నీకు. ఇక నేను చెప్పింది ఏం వింటావ్’ భారతీరాజా ఛాన్స్ తీసుకున్నారు. ఆయనకు తెలుసు. తన ఎదురుగా నిలుచుంది ఆఫ్ట్రాల్ ఒక కొత్త హీరోయిన్.
ప్రియ లేచి నిలుచుంది.
‘బై సార్’
‘ఏంటి వెళ్లిపోతున్నావ్?’
‘సార్. మీరు టాలెంట్ చూడాలి. అంతే తప్ప మీ కాళ్లు పట్టుకున్నానా లేదా అనేది కాదు. ఇంకో సంగతి. నేను మీకు అవసరం అనుకోండి. అప్పుడు మీ పాదాలను పట్టుకోకపోయినా నన్ను పెట్టుకుంటారు. నేను మీకు అనవసరం, పనికిరాను అనుకోండి. అప్పుడు మీ కాళ్లు పట్టుకున్నా ఒళ్లో కూచున్నా చాన్స్ ఇవ్వరు’
భారతీరాజా ప్రియమణివైపు దీర్ఘంగా చూశారు. అగ్గిరవ్వ. ఆ తర్వాత నవ్వుతూ అన్నారు- ‘నాకు నీ ఆటిట్యూడ్ నచ్చింది. నిన్ను సెలెక్ట్ చేస్తున్నా’
‘బట్ ఒన్ కండీషన్ సార్’
భారతీరాజా ముఖంలో నవ్వు మాయమైంది. తనకే కండీషన్లా?
‘ఏమిటో చెప్పు’
‘మీరు కొత్త హీరోయిన్లకు ‘ఆర్’ అక్షరం మీద కొత్త పేర్లు పెడుతుంటారు. ‘పి’ కూడా ఏం తక్కువ అక్షరం కాదు సార్. సాక్షాత్తు పరమేశ్వర శబ్దమే ‘పి’ మీద మొదలవుతుంది. నన్ను ‘ప్రియమణి’గానే ఇంట్రడ్యూస్ చేయండి’.
నిప్పురవ్వ!
భారతీరాజా తన బెదురుపాటును, అదురుపాటును ఒళ్లు విరుచుకోవడంలో కలిపేసి ‘సరే’ అన్నారు సంతోషంగా!
*********************************

No comments:
Post a Comment