పెద్ద అష్ట చెమ్మ
ఎంతమంది ఆడవచ్చు :
ఇద్దరు లేదా నలుగురు లేదా రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.
ఇది ఆడడానికి 1 1/2 గంట సమయము పడుతుంది.ఈ ఆట మంచి కాలక్షేపము...
దీనికి 8 చింతగింజలు,8 చిపిరి పుల్లలు లేక చాక్ పిస్ ముక్కలు,8 గవ్వలు కావలి.
పైన వున్న photo లాగ గీసుకొవాలి
ఇక్కడ A అనే వారు ఒక ఆట గాడు, B అనే వారు ఇంకొక ఆట గాడు.A,B లు ఎదురు ఎదురు గా కూర్చొని ఆడుకొవాలి...
ఇక్కడ ఒక box వచ్చి ఒక గడి...
గవ్వలు 1 తెల్లగా పడితే 11 గా పెట్టుకొవలి(మరల పందెం వుంటుది) దీని అర్దము Coin 11 గడులు జరుగుతుంది
గవ్వలు 2 తెల్లగా పడితే 2 గడులు జరుగుతుంది
గవ్వలు 3 తెల్లగా పడితే 3గడులు జరుగుతుంది
గవ్వలు 4 తెల్లగా పడితే 4 గడులు జరుగుతుంది (మరల పందెం వుంటుది)
గవ్వలు 5 తెల్లగా పడితే 5 గడులు జరుగుతుంది
గవ్వలు 6 తెల్లగా పడితే 6 గడులు జరుగుతుంది(మరల పందెం వుంటుది)
గవ్వలు 7 తెల్లగా పడితే 7 గడులు జరుగుతుంది
గవ్వలు 8 తెల్లగా పడితే 8 గడులు జరుగుతుంది (మరల పందెం వుంటుది)
గవ్వలు 8 బొర్లా పడితే 16 గడులు జరుగుతుంది (మరల పందెం వుంటుది)
చంపుడు పందెం చిక్కితే కాని లొపలకి వెల్లడనికి విలు లేదు...
దీనిలొ పెద్ద జువ్వ,చిన్న జువ్వ,ఒక ఒక్క coin పంట అవుతాయి
4 coins ని కలిపి పెద్ద జువ్వ అని అంటారు
2 coins ని కలిపి చిన్నజువ్వ అని అంటారు
పెద్ద జువ్వ పంట అయితే కాని చిన్న జువ్వ జరపకూడదు.
చిన్న జువ్వ పంట అయితే కాని ,ఒక ఒక్క coin పంట అవ్వ కూడదు.
పెద్ద జువ్వ ని అవతల side పెద్ద జువ్వ చంపవచ్చు.
పెద్ద జువ్వ అవతల side చిన్న జువ్వ ని చంపవచ్చు.
ఒకే పందే లో 2 coins ని చంప కూడదు.
coin ని చంపితే పుట్టింటి కి (ఆట మొదలు పెట్టిన స్థలం కి )వస్తుంది
ఇక్కడ 4 coins (పెద్ద జువ్వ)ని ఒక set గా తయారు చేసుకొవాలి...పెద్ద జువ్వ(4 coins) ఒకేసారి కదులుతాయి అంటే పందెం 4,6+2,8,11+5,16...(4 పడితే ఒక గడి జరుగుతుంది).
2 coins (చిన్న జువ్వ)ని ఒక set గా తయారు చేసుకొవాలి...2 coins ఒకేసారి కదులుతాయి అంటే 2,4,6,8,16,5+3,11+5 ...ఇలా అన్నమాట...(2 పడితే ఒక గడి జరుగుతుంది).
ఇక మిగిలేది 2 coins నే ఒక్క ఒక్క టి పంట వేసుకొవచు...
B అనేది Orange color(నారింజ రంగు).B తన కుడి వైపు ఆట కొనాసాగించాలి...
1(A),4 (B) అంటే చంపుడు పందెం చిక్కితే కాని లోపల కి రాకుడదు.
2(A),5(B) అంటే పెద్ద జువ్వ ,చిన్న జువ్వ చేసుకునే గడి
3(A),6(B) అది లొపలకి వెల్లడానికి దారి
నీలం రంగు ఇద్దరికి పంట అయ్యే గడి...చూసింది చాలు ఇక ఆట మొదలు పెట్టండి...:p
No comments:
Post a Comment