ఏడో రోజు: దుర్గాదేవి

దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత ”మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. ”ఓం దుం దుర్గాయైనమ్ణ” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం ”ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.

అలాగే నవరాత్రులలో ప్రతీ దినం ”సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ

 అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి

 ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం  మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం  చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం  సర్వలోకోశ్యై నమ:
ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం  సర్వ తీర్థమయాయై నమ:
ఓం  పుణ్యాయైనమ:
ఓం  దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం  అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం  నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:  
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం  వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం  వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై  నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం  కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం  కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం  నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

No comments: