ఎనిమిదో రోజు: మహిషాసుర మర్ధిని
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం (పులి¬ర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ద్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాసుధాయై నమః
ఓం మహానిద్రాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం మహోదయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగ్యాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహాలజ్జాయై నమః
ఓం మహాదృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంత్యై నమః
ఓం మహా స్మృత్యై నమః
ఓం మహాపద్మాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహాభోదాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాస్థానాయై నమః
ఓం మహారావాయై నమః
ఓం మహారోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాభందనసంహర్త్ర్యై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరూహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాచాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయ్యై నమః
ఓం మాత్రే / మహాసారాయై నమః
ఓం మహాసురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహామాకృత్యై నమః
ఓం మహాకులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాస్త్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షకప్రదాయై నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహారోగవినాశిన్యై నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమంకర్యై నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం మహావిషఘ్మ్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాద్ర్గవినాశిన్యై నమః
ఓం మహావ్ర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభద్రాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యై నమః
ఓం మహాప్రత్యంగిరాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహామంగళకారిణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం మహాపుత్రాయై నమః
ఓం మహాసురవిమర్ధిన్యై నమః
No comments:
Post a Comment