నవరాత్రులు
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.
నైవేద్యము | |||
మొదటి రోజు | పాడ్యమి | శ్రీ బాలా త్రిపుర సుందరి | కట్టుపొంగలి |
రెండవ రోజు | విదియ | శ్రీ గాయత్రి | పులిహోర |
మూడవ రోజు | తదియ | శ్రీ మహాలక్ష్మి | కొబ్బరి అన్నం |
నాలుగో రోజు | చవితి | శ్రీ అన్నపూర్ణ | గారెలు |
ఐదవ రోజు | పంచమి | శ్రీ లలితాదేవి | పెరుగు అన్నం |
ఆరవ రోజు | సప్తమి | శ్రీ సరస్వతి | కేసరి బాత్ |
ఏడవ రోజు | అష్టమి | శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) | శాకాన్నము |
ఎనిమిదవ రోజు | నవమి | శ్రీ మహిషాసురమర్ధిని | చక్కెర పొంగలి |
తొమ్మిదవ రోజు | దశమి | శ్రీ రాజరాజేశ్వరి | పాయసం |
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
No comments:
Post a Comment