తంజావూరుజిల్లాలో పాపనాశనం అను ఊరి సమీపంలో " గర్భరక్షాంబిక " ఆలయం ఉంది. స్త్రీల , గర్భస్థ శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భము నిల్చి సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ దేవతను ఆరాధిస్తారు. 1960వ సంవత్సరంలో శ్రీ స్వామిశాస్త్రిగారు "తిరుకడగావూరు " లో వేంచేసివున్న ఈ అమ్మవారి మీద స్తోత్రము వ్రాసి దానిని పారాయణ చేస్తే గర్భిణీ స్త్రీలకు రక్షణ కల్గి గర్భము నిల్చి మంచి ఆరోగ్యమైన సంతానప్రాప్తి కలుగుతుంది అనిచెప్పేరు.

1. శ్రీమత్కల్పక విఘ్నరాజమమలం, శ్రీ గర్భరక్షాంబికాసూనుం వృత్తకవేరజావర నదీకూలేస్థితం దక్షిణే|
భక్తానాం అభయప్రదాన నిపుణం శ్రీమాధవీ కానన క్షేత్రస్థం హృదిభావయే గజముఖం విఘ్నోపశాంత్యై సదా||

2. కావేరిజాత తటదక్షదిశాస్థి తాలయస్తాం కరుణాసుపూర్ణం| స్వపాద పద్మాశ్రితభక్తధారా గర్భావనే దక్షతరా నమామి||

3. శ్రీమల్లికారణ్యపతే హృదిస్థితాం శ్రీమల్లికాపుష్ప లసత్కచాఢ్యాం| శ్రీ మల్లికాపుష్ప సుపూజితాంఘ్రిం| శ్రీ మల్లికారణ్యగతాం నమామి|

4. భక్తావలీనాం అభయప్రదాత్రీం రిక్తావలీనాం అతివిద్యదాత్రీం| శాక్తావలీనాం సుఖమోక్షదాత్రీం శ్రీ గర్భరక్షాం అక్షమాశ్రయేంబాం|

5. భక్తిప్రదాన వరభక్తదీక్షా స్త్రీగర్భరక్షాకరణేతి దక్షా| భక్తావనార్థం జితశతృబక్షా భిభర్తి భర్త్రాసహ గర్భరక్షా||

6. కవేరజాతావరతీరరాజత్ ప్రసిద్ధ దేవాలయకా ఫలాని| శ్రీ మల్లికేశానననాథపత్నీ సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా||

7. శ్రీ మల్లికారణ్యపతిప్రియం తాం విద్యుల్లతాభ స్వశరీర కాంత్యాం| ఉత్ఫుల్ల పద్మాభ పదాబ్జయుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే||

8. యా గర్భరక్షాకరణే ప్రసిద్ధా సుపుత్రదానేపి మహాప్రసిద్ధా| సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

9. స్వల్పం గృహీత్వా నిజభక్తవర్గాత్ అనల్పవిత్తం ప్రదదాతియాంబా| లక్ష్మీపతే: సుప్రియసోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

10. కవేరికాసేచిత పాదపద్మాం కవేరణే కార్తద వాక్ప్రదాత్రీం| కుబేరమిత్రాంగనాం తా భవానీం శ్రీ గర్భరక్షాం ప్రణమామి నిత్యం||

11. శ్రీ గర్భరక్షాపుర సంస్థితానాం భక్తోత్తమానాం ధన ధాన్య దాత్రీం| దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రీం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

12. అనంతకళ్యాణగుణస్వరూపాం శ్రీమద్ సచ్చిదానంద రసస్వరూపాం| ప్రాణ్యంతరంగ సద్గుహాంతరస్థాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

No comments: