చవితి గణపతి


ప్రతి నెలా బహుళ చవితి రోజు పూజా...నైవేద్యం...ఉండ్రాలు...వడపప్పు...పానకం

పూజా కి కావలిసినవి

కుంకం-కొద్దిగా
గంధము-కొద్దిగా
పసుపు-కొద్దిగా
అక్షతలు-కొద్దిగా
గ్లాసులు -2
గంటా-1
చెయ్యి తుడుచుకొవాడనికి గుడ్డ-1
బియ్యం-కొద్దిగా
తమలాపాకులు-కొన్ని
వక్కలు లేదా వక్క పొడి-కొద్దిగా
పంచామృతం(ఆవుపాలు,ఆవు పెరుగు,ఆవు నెయ్యి,తేనె,పటిక బెల్లం)-కొద్దిగా
తేనె-కొద్దిగా
పత్తి తో చేసిన వస్త్రం -2
పత్తి తో చేసిన యజ్ఞోపవితం-1
గరిక-కొద్దిగా
పుష్పాలు-కొన్ని
బెల్లం/అరటి పండు-కొద్దిగా/1
అగరవత్తులు;-కొన్ని
హారతి కర్పూరం-కొన్ని
దేవుడి ముందు ఒక చిన్న గిన్నే పెట్టి దానిలొ దేవుడి కి చేసే ఆచమనియం నీరు,పాద్యం నీరు,అర్ఘ్యం నీరు మొదులు అయినవి చేసి ఆ నీటి ని చివరి లొ కొద్దిగ తీర్దము గా తీసుకొవాలి


శ్రీ గురుభ్యోనమ:

కుడి చేతిలో నీరు తీసుకొని...

అపసర్పంతు యే భూతాః  -భూతాయే భూమిసంస్థితాః|
యే భూతాః విఘ్నకర్తారః -స్తే నశ్యంతు శివాజ్ఞయా||

అని చేప్పి,నీళ్ళు చల్లి పీట లేక ఆసనం వేసుకొని కూర్చొవాలి.

దేహ శుద్ది
ఉద్దరిణ తో కుడి చేతి లోకి  కొద్దిగా నీళ్ళు తీసుకోని క్రింద మంత్రము చదవవలను

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా 
య:స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః 
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః 
అని తలపై నీళ్ళు చల్లుకొవాలి

దీపారాధన చేసి ఈ క్రింద మంత్రము చదవవలను
ఓం ఉద్దీప్యస్వ జాతవేదో -పఘ్నం నిరృతిం మమ|
పశూగ్‌శ్చ మహ్య మావహం -జీవనం చ దిశోదిశ||

ఘంటారావం
ఓం ఆగమార్థం తు దేవానాం -గమనార్థం తు రక్షసామ్‌|
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌|| 
అని ఘంటా మ్రోగించాలి

ఆచమనం

గ్లాస్ లో కొద్దిగా నీరు తీసుకొని,ఆచమనం చెయ్యాలి కుడి చేతి చూపుడు వ్రేలుకు, నడిమి వ్రేలుకు మధ్యన బొటన వ్రేలు పైకి మడిచి తక్కిన మూడు వ్రేళ్లూ చాపి, అరచేతిని దోనెలా మలచి ఉద్ధరిణడు వుదకాన్ని యెడమచేతితో తీసుకుని కుడిచేతిలో పోసుకుని, ముందుగా
1. ''ఓం కేశవాయ స్వాహా'' అని చెప్పుకుని నీరు లోనికి తీసుకోవాలి, ఆ నీరు కడుపులో బొడ్డు వరకు దిగిన తరువాత మరల పైవిధంగానే.
2. ''ఓం నారాయణాయ స్వాహా'' అనుకుని ఒకసారీ జలం పుచ్చుకోవలెను
3. ''ఓం మాధవాయ స్వాహా'' అనుకుని ఒకసారీ జలం పుచ్చుకోవలెను. అట్లు చేసి
4. ''ఓం గోవిందాయ నమః'' అని చేతులు కడుగుకోవాలి. పిదప
5. ''ఓం విష్ణవే నమః'' అనుకుంటూ నీళ్లు తాకి, మధ్యవ్రేలు, బొటనవ్రేళ్లతో కళ్లు తుడుచుకోవాలి. పిదవ
6. ''ఓం మధుసూదనాయ నమః'' పై పెదవిని కుడి నించి ఎడమకి నిమురుకోవాలి.
7. ''ఓం త్రివిక్రమాయ నమః'' క్రింద పెదవిని కుడి నించి ఎడమకి నిమురుకోవాలి.
8, 9. ''ఓం వామనాయ నమః'' ''ఓం శ్రీధరాయ నమః'', ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
10. ''ఓం హృషీకేశాయ నమః'' ఎడమచేతితో నీళ్లు చల్లాలి.
11. ''ఓం పద్మనాభాయ నమః'' పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12. ''ఓం దామోదరాయ నమః'' శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
13. ''ఓం సంకర్షణాయ నమః'' చేతివ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14. ''ఓం వాసుదేవాయ నమః'' వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15, 16. ''ఓం ప్రద్యుమ్నాయ నమః'' ''ఓం అనిరుద్ధాయ నమః'' నేత్రాలు తాకవలెను.
17, 18. ''ఓం పురుషోత్తమాయ నమః'' ''ఓం అధోక్షజాయనమః'' రెండు చెవులూ తాకవలెను.
19, 20. ''ఓం నారసింహాయ నమః'', ''ఓం అచ్యుతాయ నమః'' బొడ్డును స్పృశించుకోవలెను.
21. ''ఓం జనార్దనాయ నమః'' చేతి వ్రేళ్లతో వక్షస్థలం, హృదయం తాకవలెను.
22. ''ఓం ఉపేంద్రాయ నమః''చేతికొనతో శిరస్సు తాకవలెను.
23. ''ఓం హరయే నమః'' ''ఓం శ్రీకృష్ణాయ నమః'' కుడి మూపురమును(భుజమును) ఎడమ చేతితోను, ఎడమ మూపురమును కుడి చేతితోను తాకవలెను.
ఆచనం గ్లాస్ ను ఇక పక్కన పెట్టి వెయ్యాలి.(ఇక ఈ నీరు ఎంగిలి అయ్యింది .అందుకు ఇక ఉపయోగపడదు)


భూతోచ్చాటనము
అక్షతలు కొన్ని వాసన చూస్తు శ్లోకము చదివి
ఉత్తిష్టంతు భూతపిశాచాః- ఏతే భూమి భారకాః 
ఏతేషా మవిరోధేన- బ్రహ్మకర్మ సమారభేత్ అని
అక్షతలు ఎడమచేతి ప్రక్కనుండి   వెనుకకు వేసుకోవాలి.

తదేవ లగ్నం సుదినం తదేవ తారబలం
తదేవ విద్యాబలం దైవబలం 
తదేవ లక్ష్మి పతేతేఘ్రీ యుగం స్మరామి

అక్షతలు తీసుకొని

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః 
ఓం వాణీహిరణ్యగర్భాభ్యా నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం శ్రీఅరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం శ్రీ మాతాపితృభ్యోనమః
ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః
ఓం సర్వేభ్యో మహాజనేభ్యోనమః
ఓం కులదేవతాభ్యాం నమ: 
ఓం ఇష్ట దేవత భ్యాం నమ: 
ఓం సర్వే భ్యో బ్రాహ్మణభ్యాం నమ:
ఓం భరాద్వజ ౠషిభ్యో నమ: 
ఓం సువాసినొ భ్యో నమ:
అక్షతలు దేవుడి ముందు వేయ్యాలి

ప్రాణాయామము

(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః- ఓం భువః- ఓగ్ం సువః- ఓం మహః-ఓం జనః -ఓం తపః- ఓగ్ం సత్యం- ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి -ధియో యోనః ప్రచోదయాత్- ఓమాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం  (మూడు సార్లు జపించవలెను)

అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను

 ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, ఆంధ్రప్రదేశ్-కృష్ణా-కావేరి మధ్యప్రదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి/ఈ రెందు నదుల మధ్యన వుందో ఆ నదుల పేర్లు చెప్పుకొవాలి ) 
స్వగృహే(స్వంత ఇల్లు)/శొభన గృహే(మామాగారి ఇల్లు)/వసతి గృహే(అద్దే ఇల్లు)/పితృ గృహే(నాన్న గారి ఇల్లు ) (మీది ఏది అయితే అది చెప్పుకొవాలి)
సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదే అస్మిన్ వర్తమానన/వ్యావహారిక చంద్రమానేన 
...(ప్రస్తుత సంవత్సరం) నామసంవత్సరే 
...(ఉత్తర/దక్షిణ) ఆయనే
 (ఉత్తరాయనే-జూలై 16 నుంచి జనవరి 15/దక్షిణాయనే-జనవరి 16 నుంచి- జూలై  15)
...(ప్రస్తుత ఋతువు) ఋతౌ(మార్చి 20 నుండి మే 20 వరకు వసంతఋతువు/మే 20 నుండి జూలై 20     వరకు గ్రీష్మఋతువు/జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరకు వర్షఋతువు/సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 20 వరకు శరదృతువు/నవంబర్ 20 నుండి జనవరి 20 వరకు హేమంతఋతువు/జనవరి 20 నుండి మార్చి 20 వరకు శిశిరఋతువు)
 ...(ప్రస్తుత మాసము) మాసే (చైత్రమాసము,వైశాఖమాసము,జ్యేష్ఠమాసము,ఆషాఢమాసము,శ్రావణమాసము,భాద్రపదమాసము,ఆశ్వయుజమాసము,కార్తీకమాసము,మార్గశిరమాసము,పుష్యమాసము,మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. )
...(ప్రస్తుత పక్షము) పక్షే 
(అమావాస్య కు ముందు రోజులైతే బహుళ పక్షము/పౌర్ణమి కు ముందు రోజులైతే శుక్ల పక్షము)
...( రోజు తిథి) తిథౌ
(ఆ రోజు తిధి చూసుకొవాలి)
... ( రోజు వారము) వాసరే 
( రోజు నక్షత్రము చూసుకొవాలి) 
శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ
పురుషులు ఐతే:శ్రీమాన్ (మీ గోత్రము) ...గోత్రస్య ...(మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య 
స్త్రీలు ఐతే:శ్రీమత: (మీ గోత్రము) ...గోత్రస్య (మీ పూర్తి పేరు) ...నామధేయస్య,భర్తానం
భర్త లేని స్త్రీలు ఐతే :పుణ్యవతి,తీర్దవతి

అస్మాకం సహకుటుంబానాం -క్షేమ స్థైర్య ధైర్య -విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం,ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , ఇష్టకామ్యార్ధ ఫల సిద్ధ్యర్ధం,[మన కొరిక కొరుకొని]/సకల విధ మనొ  వాంఛా ఫల సిద్ద్యర్దం|| మమోపాత్త, దురిత క్షయద్వారా,   శ్రీ పరమేశ్వర ప్రీత్యర్త్తమ్...శ్రీ...(మనం పూజ చేసే దేవుడు/దేవత పేరు చెప్పుకొవాలి)పర దేవతాను గ్రహ ప్రసాద సిద్ద్యర్దం...శ్రీ...(మనం పూజ చేసే దేవుడు/దేవత పేరు చెప్పుకొవాలి) ముద్దిశ్య-శ్రీ...(మనం పూజ చేసే దేవుడు/దేవత పేరు చెప్పుకొవాలి)దేవతా ప్రీత్యర్దం ...శ్రీ...(మనం పూజ చేసే దేవుడు/దేవత పేరు చెప్పుకొవాలి)పూజం కరిష్యే  ...అని కుడి చేతి మధ్య వేలి తో నీరు తాకలి మరియు అక్షతలు ,నీరు కలిపి పళ్ళెం లో వదలవలెను.

కలశ పూజ:
సంకల్ప ఆచమనాదులకు వాడిన పాత్రను ఉదకమును కలశారాధనముకు వినియోగించరాదు...స్వామికికుడివైపు కలశమును ఉంచవలను... కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, తులసిదళమును గాని, పుష్పమును గాని, తమలపాకు గాని యుంచి  వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని తదంగ కలశ పూజాం కరిష్యే //
ఒక సారి కలశ పూజ చేసిన తరువాత కలిశం ను కదిలించకూడదు

శ్లో : కలశస్య ముఖే విష్ణుః కంఠే  రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః //

కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః //
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ //
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

 కావేరి తుంగభద్రా చ - కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీ చ విఖ్హ్యాతాః - పంచగంగా ప్రకీర్తితా

ఆయాంతు ... (దేవుని పేరు చేర్చి) పూజార్థం దురితక్షయ కారకాః (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)...పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం ...(తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య //

ధీపారాదన పూజా 

భోదిపత్వం బ్రహ్మ రూపహ్యంధకార నివారక:
ఇమాం మయాకృతాం పూజాం గృహ్లంతేజ: ప్రవర్ధయ
భక్త్వా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
ఇమాం మయాకృతాం దీపజ్యోతిర్నమోస్తుతే
ఇమాం మయాకృతాం పూజాం గృహ్లన్ తేజ: ప్రవర్ధయ
సూర్య జ్యొతి స్వరూపన్ త్వం ఆత్మ జ్యోతి: ప్రకాశయ 
ఇతి దీపం సంప్రార్ధ్య-గంధ పుష్పాక్షతైరభ్యర్చ నమస్కారాన్ కరిష్యే 
(గంధం, పుష్పం,అక్షతలు దీపం వద్ద వేసి నమస్కారం చేయ్యాలి)

శ్రీ  హరిద్ర  గణాధిపతి పూజా

అదౌ - నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ హరిద్ర గణాధిపతి పూజాం కరిష్యే(ఉదకం తాకాలి)

( పళ్ళెం లో బియ్యం పోసి తమలపాకు పెట్టి ఆ ఆకు లో పసుపు గణపతి ని పెట్టి పూజించాలి(తొడిమ కట్ చేసి ఆకు ని తూర్పు వైపు పెట్టాలి)
శ్లో :  శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే...
శ్లో : వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ 
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా //
 హరిద్ర గణాధిపతి సుప్రీతో వరదో భవతు
మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు // 

ప్రాణప్రతిష్ఠ:
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం|
జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||
 స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...ప్రాణప్రతిష్టాపన ముహుర్త: సుముహుర్త: అస్తు

ధ్యానం
ఓం గణానాంత్వ గణపతిగ్ ం హవామహే
కవిం కవీనాం ముపమశ్ర స్తవమ్ జ్యేష్ఠరాజం
బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత అనశృణ్య న్నూతిభీ స్సీదసాధనమ్
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...ధ్యాయామి - ధ్యానం సమర్పయామి . 
(ఒక పుష్పమును/అక్షతలు  దేవుడి వద్ద వుంచవలెను )

ఆవాహనమ్:(గంట కొడుతు క్రింద వి చదవ వలను)
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః | 
అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ || 
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...ఆవాహయామి - ఆసనం సమర్పయామి  (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి  వద్ద వుంచవలెను)

సింహసనం:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మౌక్తికై పుష్యరాగైశ్చ నానరత్త్నే ర్విరాజితం
రత్న సింహసనం చారు  ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం
 ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః - రత్న సింహాసనం సమర్పయామి ( కొన్ని అక్షతలు సమర్పించవలెను)

పాద్యం : (కలశం లో నీరు తీసుకోని గణపతి కి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక, 
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
  ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః- పాదయోః పాద్యం సమర్పయామి ( ఆ నీరు తో దేవుడి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )

అర్ఘ్యం: (కలశం లో నీరు తీసుకోని గణపతి కి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
గౌరీపుత్ర నమస్తేస్తు, శంకరప్రియనందన 
గృహాణార్ఘ్యం మయాదత్తం, గంధపుష్పాక్ష తైర్యుతం 
  ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ( ఆ నీరు తో దేవుడి కి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి ).

ఆచమనం:(కలశం లొ నీరు తీసుకోని గణపతి కి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
అనాధ నాధ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత, గృహాణాచమనందేవ, తుభ్యం దత్తంమయాప్రభో
 ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః-ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి  కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

పంచామృత స్నానం:(ఆవుపాలు+ఆవు పెరుగు+ఆవు నెయ్యి+తేనె+పటిక బెల్లం కలిపి గణపతికి అభిషేకము చేయ్యాలి)
స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
అనాధ నాధ సర్వజ్ఞ గిర్వాణ గణపూజిత
 ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః -పంచామృత   స్నానం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

మధుపర్కం:(తేనె)
దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే
 ఓం   శ్రీ హరిద్ర గణపతయే నమః- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి కి మధుపర్క స్నానానికి సమర్పించాలి)(కొద్దిగా తేనే ను చూపించ వలను)

గంధం నీరు:

ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః-సుగంధ జల అభిషేక ఉద్వర్తనం(గంధం నీరు స్వామి పై చల్లాలి) సమర్పయామి

ఫలోదకం:(కొబ్బరి నీరు తీసుకోని )
యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ం హనః
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః-ఫలోదక స్తానం సమర్పయామి (కొబ్బరికాయ నీరు/కలశం లో నీటిని తీసుకోని గణపతి పై చల్లాలి)

శుద్ధోదకం (మంచినీరు) స్నానం:
గంగాది సర్వతీర్ధేభ్య: అమృతైరమలైర్జలై: 
స్నానం కురుష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే :
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి.)

వస్త్ర యుగ్మం:( (యుగ్మమనగా రెండు ) వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొని...క్రింది మంత్రం చదివి...
ఓం అభివస్త్రాయ సువసనాన్య పాభి ధేనూ స్పుదుఘా: పూయమానా: 
అభిచంద్రో భర్త వేనో హిరణ్యాభ్యం శ్వానధినో దేవ సోమ: 
 ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ... వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి)

 ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ... ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).

యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః
 ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...యజ్ఞోపవీతం సమర్పయామి - యజ్ఞోపవీతం రూపేణ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి)

గంధం:(గంధం తీసుకోని...క్రింది మంత్రం చదివి)
చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం,
విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతాం
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ... దివ్యశ్రీ చందనం సమర్పయామి.(వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.) 


అక్షతలు:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్!
గృహాణ పరమానంద ఈశ పుత్రనమోస్తుతే
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...గంధస్యొపరి అలంకరణార్దం  అక్షతాన్ సమర్పయామి(అక్షతలు సమర్పించాలి)

ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...హరిద్రా చూర్ణం సమర్పయామి(పసుపు వేయాలి)
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...కుంకమ విలేపనం సమర్పయామి(కుంకం వేయాలి)
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...దుర్వాం కురాన్ సమర్పయామి(గరిక వేయాలి)
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ... సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).

పుష్పం: (పుష్పం/పుష్పాలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ 
ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే 
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...(యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.)

అధాంగ పూజ

ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...పాదౌ పూజయామి.

ఓం ఏకదంతాయనమః...గల్ఫౌ పూజయామి.

ఓం శూర్పకర్ణాయనమః...జానునీ పూజయామి.

ఓం విఘ్నరాజాయ నమః...జంఘే పూజయామి.

ఓం అఖవాహనాయనమః...ఊరుం పూజయామి.

ఓం హేరంబాయనమః...కటిం పూజయామి.

ఓం లంబోదరాయనమః...ఉదరం పూజయామి.

ఓం గణనాధాయనమః...నాభిం పూజయామి.

ఓం గణేశాయనమః...హృదయం పూజయామి.

ఓం స్థూలకంఠాయనమః...కంఠం పూజయామి.

ఓం స్కంద గ్రజాయ నమః...స్కందే పూజయామి.

ఓం పాశహస్తాయ  నమః...హస్తౌ పూజయామి

ఓం గజవక్త్రాయనమః...వక్త్రం పూజయామి.

ఓం విఘ్నహంత్రేనమః...నేత్రం పూజయామి.

ఓం శూర్పకర్ణాయ నమః...కర్ణౌ పూజయామి

ఓం ఫాలచంద్రాయనమః...లలాటం పూజయామి.

ఓం సర్వేశ్వరాయనమః...శిరః పూజయామి.

ఓం విఘ్నరాజాయనమః...సర్వాంగణ్యాని పూజయామి.

నాన విధ పరిమళ పత్ర పుష్ప  పూజా సమర్పయామి

అధశ్రీ షొడశ నామ పూజా/నామావాళి పూజా

ఓం సుముఖాయ నమః-పత్రం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమః-పుష్పం సమర్పయామి
ఓం కపిలాయ నమః-అక్షితాన్ సమర్పయామి
ఓం గజకర్ణాయ నమః-గంధం సమర్పయామి
ఓం లంబోదరాయ నమః-పత్రం సమర్పయామి
ఓం వికటాయ నమః-పుష్పం సమర్పయామి
ఓం విఘ్నరాజాయ నమః-అక్షితాన్ సమర్పయామి
ఓం ధూమకేతవే నమః-గంధం సమర్పయామి
ఓం గణాధ్యక్షాయ నమః-పత్రం సమర్పయామి
ఓం ఫాలచం ద్రాయ నమః-పుష్పం సమర్పయామి
ఓం గజాననాయ నమః-అక్షితాన్ సమర్పయామి
ఓం వక్రతుండాయ నమః-గంధం సమర్పయామి
ఓం శూర్పక ర్ణాయ నమః-పత్రం సమర్పయామి
ఓం హేరంభాయ నమః-పుష్పం సమర్పయామి
ఓం స్కందపూర్వజాయ నమః-అక్షితాన్ సమర్పయామి
ఓం సర్వ సిద్ది ప్రదాయ కాయ నమః-గంధం సమర్పయామి
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః  ...నాన విధ పరిమళ పుత్ర పుష్ప శ్రీ గంధాక్షత పూజా సమర్పయామి

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా


1)ఓం గజాననాయ నమః 37)ఓం బలోద్దతాయ నమః 69
2)ఓం గణాధ్యక్షాయ నమః 38)ఓం భక్తనిధయే నమః 80
3)ఓం విఘ్నరాజాయ నమః 39)ఓం భావగమ్యాయ నమః 50
4)ఓం వినాయకాయ నమః 40)ఓం భావాత్మజాయ నమః 94
5)ఓం ద్వైమాతురాయ నమః 41)ఓం అగ్రగామినే నమః 80
6)ఓం ద్విముఖాయ నమః 42)ఓం మంత్రకృతే నమః 50
7)ఓం ప్రముఖాయ నమః 43)ఓం చామీకర ప్రభాయ నమః 94
8)ఓం సుముఖాయ నమః 44)ఓం సర్వాయ నమః 80
9)ఓం కృతినే నమః 45)ఓం సర్వోపాస్యాయ నమః 50
10)ఓం సుప్రదీప్తాయ నమః Jackson 94
11)ఓం సుఖనిధయే నమః 46)ఓం సర్వకర్త్రే నమః 80
12)ఓం సురాధ్యక్షాయ నమః 47)ఓం సర్వ నేత్రే నమః 50
13)ఓం సురారిఘ్నాయ నమః 48)ఓం నర్వసిద్దిప్రదాయ నమః 94
14)ఓం మహాగణపతయే నమః; 49)ఓం పంచహస్తాయ నమః 80
15)ఓం మాన్యాయ నమః 50)ఓం పార్వతీనందనాయ నమః 50
16)ఓం మహాకాలాయ నమః 51)ఓం ప్రభవే నమః 94
17)ఓం మహాబలాయ నమః 52)ఓం కుమార గురవే నమః 80
18)ఓం హేరంబాయ నమః 53)ఓం కుంజరాసురభంజనాయ నమః 50
19)ఓం లంబజఠరాయ నమః 54)ఓం కాంతిమతే నమః 94
20)ఓం హయగ్రీవాయ నమః Doe 80
21)ఓం ప్రథమాయ నమః Jackson 94
22)ఓం ప్రాజ్ఞాయ నమః Doe 80
23)ఓం ప్రమోదాయ నమః Smith 50
24)ఓం మోదకప్రియాయ నమః Jackson 94
25)ఓం విఘ్నకర్త్రే నమః Doe 80
26)ఓం విఘ్నహంత్రే నమః Smith 50
27)ఓం విశ్వనేత్రే నమః Jackson 94
28)ఓం విరాట్పతయే నమః Doe 80
29)ఓం శ్రీపతయే నమః Smith 50
30)ఓం వాక్పతయే నమః Jackson 94
31)ఓం శృంగారిణే నమః Doe 80
32)ఓం ఆశ్రితవత్సలాయ నమః Smith 50
33)ఓం శివప్రియాయ నమః Jackson 94
34)ఓం శీఘ్రకారిణే నమః Jackson 94
35)ఓం శాశ్వతాయ నమః Jackson 94
36)ఓం బల్వాన్వితాయ నమః Jackson 94

ఓం గం గం గణపతయే నమ:


1)ఓం శ్రీ గణంజయాయ నమః
2) ఓం గణపతి యే నమః
3) ఓం హేరంభాయ నమః   
4) ఓం ధరణీ ధరాయ నమః
5) ఓం మహ గణపతి యే నమః
6) ఓం లక్ష ప్రదాయ నమః
7)ఓం క్షి ప్ర ప్రసాదాయ నమః
8)ఓం అమోఘ సిద్దయై నమః
9)ఓం అమితాయ నమః
10)ఓం మంత్రాయ నమః
11)ఓం చింతామణియై నమః
12)ఓం నిధయే నమః
13)ఓం సుమంగళాయ నమః
14)ఓం బీజాయై నమః
15)ఓం ఆశా పూర్వకాయ నమః
16)ఓం వరదాయ నమః
17)ఓం శివాయ నమః
18)ఓం కాశ్యపాయ నమః
19)ఓం నందా నాయ నమః
20)ఓం నాచ సిద్దాయ నమః
21)ఓం ధుండి వినాయకాయ నమః

శ్రీం హ్రీం క్లీం గ్లౌ గ్లం గణపతే వర వరద సర్వజనవసమానయ స్వాహ...గం గణాధిపతయే నమ:

వినాయక 12 నామాలు: 

(చవితి రోజు 11 లేదా 21 సార్లు వినాయక 12 నామాలు చదివి తుమ్మి లేక గరిక,తెల్ల జిల్లేడు వేస్తే మంచిది)

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకమ్ | భక్తావాసం సంస్మరేన్నిత్య, మాయ: కామార్ధసిద్ధయే | 1 |

ప్రధమం వక్రతుండం చ, ద్వితీయకం ఏకదంతం | తృతీయం కృష్ణపింగాక్షం, చతుర్ధకం  గజవక్త్రం| 2 |

పంచమం చ లంబోదరం , షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టకమ్ | 3 |

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయమ్ | ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ | 4 |

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |

విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం | పుత్రార్ధీ లభతే పుత్రాం ,మోక్షార్ధీ లభతే గతమ్ | 6 |

జపేత్ గణపతిస్తోత్రం, పద్మిర్మాసై: ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |


|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం |

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం - ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః ...ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి  చూపించాలి).

దీపం:
సాజ్యం త్రివర్తి సంయుక్తంవహ్ని నాయోజితం ప్రియం, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః ... దీపం దర్శయామి (దీపం చూపించాలి).


ఆచమనం:
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి

ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

నైవేద్యం:
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః ... నైవేద్యం సమర్పయామి(గుడోపహర(బెల్లం)/ కదళీ ఫలం నివేదనం) 
(నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ)
ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (క్లోక్ వైస్ ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.)
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- 
ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః...మధ్యే మధ్యే పానియం సమర్పయామి(అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)
అమృతాపి ధానమసి   శ్రీ హరిద్ర గణాధిపతయే నమః ఉత్తరాపోశనం సమర్పయామి(అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః...హస్తే ప్రక్షాళయామి (అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః...పాదం ప్రక్షాళయామి(అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః...శుద్ద ఆచమనియం సమర్పయామి(అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)

తాంబూలము:
(5తమలపాకులు, 2వక్కలు వినాయకుని వద్ద ఉంచి నమస్కరించవలెను.) 

పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం  
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః ... తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).

నీరాజనం:
 ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా 
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ
ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః... కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).

ఓం శ్రీ హరిద్ర గణాధిపతయే నమః నిరాజానానంతరం  శుద్ద ఆచమనియం సమర్పయామి(అని కలశం లో నీరు ఉద్దరిణే తో స్వామికి చూపిస్తు ఒక చుక్క  హరతి పళ్ళేం చివర వేసి మిగతా నీరు కలశం పక్కన గిన్నే లో వెయ్యాలి)

"నమస్కోరోమి" అని అందరూ హరతి ని కళ్ళకు అద్దుకొవాలి

మంత్రపుష్పం :(పూలు,అక్షతలు తీసుకోని లేచి నుంచొవాలి)

కాశిపుర నివాసాయ కామితార్ద ప్రదాయన్
విశాలాక్షి తనుజాయ శ్రీ హరిద్ర గణాధిపతయే నమః
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః...సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
  
ఆత్మ ప్రదక్షిణ ...( అక్షతలు తీసుకోని 5 ప్రదక్షిణలు చేస్తు )
శ్లో : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా
 త్రాహిమాం కృపయో దేవ శరణాగత వత్సలా
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరిద్ర గణాధిపతయే నమః //
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...ఆత్మ ప్రదక్షిణ నమస్కారన్ సమర్పయామి అని అక్షతలు స్వామి వారి పై వేయ్యాలి

పునరఘ్యం

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ..ప్రార్దనా పూర్వక  నమస్కారన్ సమర్పయామి అని అక్షతలు స్వామి వారి పై వేయ్యాలి

పున: పూజా

యామి అన్నప్పుడు అల్లా గణపతి వద్ద కొద్ది కొద్దిగా అక్షతలు స్వామి వారి పై వేయ్యాలి
ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః ...
చత్రం దారయామి,
చామరం విచయామి,
నృత్యం దర్శయామి,
గీతం శ్రావయామి,
దర్పణం దర్శయామి
ఆందోళిక నారోహమావహయామి ,
అశ్వా నారోహమావహయామి,
 గజనారోహమావాహయామి ,
సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ పూజాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).

సమర్పణం

అక్షతలు,నీరు తీసుకోని   కుడి చేతిలో  పోసుకోని (నీరు జారిపొకుండా)ఈ క్రింది మంత్రములు చదివిన తరువాత కుడి అర చేతి నాలుగు వేళ్ళు చాచి పళ్ళెంలో విడవాలి...అక్షతలు దేవుని దగ్గర వేయ్యాలి
యస్య స్మృత్యా  చనమోక్త్యా తప: పూజాక్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
 మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక 
యత్పూజితం మయాదేవపరిపూర్ణం తదస్తుతే.

అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజాయచ,భగవాన్ సర్వాత్మక శ్రీ హరిద్ర గణపతయే నమః సుప్రసన్నో వరదో భవతు.

ఉద్వాసన (మంగళ మరియు శుక్ర వారం ఉద్వాసన చెప్ప కూడదు)
'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి , ప్రధ మాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః
 శ్రీ హరిద్ర గణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి...శోభనార్దే పునరాగమనాయచ...

అర్పణం

నీరు తీసుకోని ,కుడి అర చేతి నాలుగు వేళ్ళు చాచి  "సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు",(అర చేతి వేళ్ళ మీదుగా) అని నీటిని  పళ్ళెంలోకి వదలవలను...

కధ లోపము అయినా,వ్రత లోపము కాకుడదు వాక్కు తప్పిన,వరం తప్పకూడదు భక్తి తప్పిన ,ఫలం తప్ప కూడదు అక్షతలు తప్పిన ,లక్ష వేల ఐదోతనం తప్పకూండా వుండాలి తండ్రి

ప్రసాద స్వీకారం


శ్రీ హరిద్ర గణాధిపతి ప్రసాదం శిరసాగృహమి అని అందరు గణపతి కి నమస్కారం చేసి గణపతి వద్ద అక్షతలు తీసుకొని శిరస్సున వేసుకొవాలి...(కొరిక కొరుకొవలను)

శ్రీ హరిద్ర గణాధిపతి పూజ సంపూర్ణం


హరిః ఓం తత్సత్...


శ్రీ మంగళగౌరి  పంచ పూజా
సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం 
సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం
అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం 
జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం

శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.(ఒక పుష్పమును దేవి వద్ద వుంచవలెను)
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః...పుష్పము సమర్పయామి.(ఒక పుష్పమును దేవి వద్ద వుంచవలెను)
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః...ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవికి చూపించాలి)
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ...సాక్ష్యత్ దీపం దర్శయామి (దీపం చూపించాలి).
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ...నైవేద్యం సమర్పయామి
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః... ధూప దీపానంతరం శుద్ద ఆచమనియం సమర్పయామి
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ...కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి

శ్రీ మంగళగౌరి పంచ పూజా సంపూర్ణం

No comments: