ఈ క్రింది వాక్యాలను స్ఫురింపజేసే సంస్కృత సూక్తులను చెప్పండి...
( క్లూ... మొదటి....చివరి అక్షరం ఇస్తున్నాను)
( క్లూ... మొదటి....చివరి అక్షరం ఇస్తున్నాను)
ఉదా...
1 .నిజం గెలిచి తీరుతుంది ... ( సత్యమేవ జయతే )
2.ఇతరులకి ఉపయోగపడటానికే ఈ దేహం సుమా
ప..............................రం
3.డబ్బే ప్రపంచమట...
ధ..............................త్
4.. ఎక్కడైనా మితిమీరి ప్రవర్తించకూడదు కదా !
అ...............................త్
5.కాలం కలిసిరానప్పుడు పనికిమాలిన ఆలోచనలే వస్తాయట..
వి...............................ద్ధిః
6.మనం మంచిగా ఉంటే ఆ మంచే మనల్ని కాపాడుతుంది
అని చెప్పిన మాట నిజమండీ...
ధ..............................తః
7.దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది అని నమ్మేవారు అనేమాట..
దం..............................త్
8.అతిగా కాకా పడ్తున్నాడంటే అర్థమవుతోంది కదా వాడు ఎటువంటివాడో...
పెద్దలు చెప్పనే చెప్పారు కదా...
అ................................మ్
9..పాలకులని అనుసరిస్తారుకదా జనం..
య....................జాః
10. ముసలితనంలో నీతులు చెప్తే ఇలా కూడా అంటారు బాబోయ్..
వృ.....................తాః
11.. బద్దకిస్తే కొన్ని పనులు చెడతాయని ఇలా అంటారు..
ఆ..........................షం
12..మీ మేధస్సు వలన మీరు ఎక్కడైనా గౌరవింపబడతారు సుమండీ..
వి.........................త్
answer:
No comments:
Post a Comment