*రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.,*
1) ........... తింటే ఆరోగ్యంగా ....... తాము.
2)లతా! నా ........ ఎక్కడుందో ........
3) అమ్మ ఆ ....... లోని గవ్వలు ..........
4)ఆ చెట్టు ......... ఈ చెట్టువేరు ......... గా ఉన్నాయి
5)........... ని అడగనిదే నా స్కూటర్ .........ను
6)............ బడిన ఇంట్లో పాటలు ..........తున్నారేంటి
7) ............ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ...........
8) ఈ ........ తీసుకెళ్లి .......... దిక్కు ఇంట్లో ఇవ్వు
9)............ గా ఉన్నచోట ఈ వేప ......... వేయండి
10)ఆ ........... గిన్నెలోనే ........ సంకటి తీసుకురా
Answer
1) పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము.
2)లతా! నా చెప్పు ఎక్కడుందో చెప్పు
3) అమ్మ ఆ ఏరు లోని గవ్వలు ఏరు
4)ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా ఉన్నాయి
5)అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను
6) పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారేంటి
7) నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు
8) ఈ ఉత్తరం తీసుకెళ్లి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు
9) పొడి గా ఉన్నచోట ఈ వేప పొడి వేయండి
10)ఆ రాగి గిన్నెలోనే రాగి సంకటి తీసుకురా
No comments:
Post a Comment