మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి

*******************


       భోజనం చేసిన 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీపమై ఉంటుంది. 



      భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే ,

కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు. భోజనం మగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకల నీరు త్రాగవచ్చును. 


  భోజనం తరువాత తీసుకోతగిన ఉత్తమమైన పదార్థాలు, పండ్లరసాలు , మజ్జిగ , పాలు. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను ( ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు మాత్రమే) ఉదయం భోజనాంతరము, మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరము , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది.  


      నీటిని ఎప్పుడు నిలబడి త్రాగరాదు. 


💦 రిఫ్రిజరేటర్ నీళ్ళు చాలా హానికరం.


💧గట గటా నీరుత్రాగే విధానం  మంచిది కాదు. 


💧ఒక్కొక గుటక గుటకగా నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి. 


      ఎందుకంటే  నోటిలో లాలజలం తయారవుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. మనం నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగితే నోటిలో లాలజలంతో కలసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలోని ఆమ్లాలతో కలసి న్యూ ట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలజలం తయారయ్యేది పొట్టలోనికి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికే. 


      ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కోక్క గుటగా త్రాగుతుంది.


No comments: