ప్రార్ధన - విశ్వాసం - సహాయం


సేకరణ...


🌹🌿🌹ఒక మంచి మాట 🌹🌿🌹


ఒక చిన్న కథ మీ కోసం.. కాదు కాదు....మన కోసం🙂🙂🌷


ప్రార్ధన - విశ్వాసం - సహాయం                                    


ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు.....

ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది.


ఆ కర్ఫ్యూ వల్ల ఇంటితలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి

ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తుంది.

            

ప్రార్థనలో ఆవిడ దేవునితో 

" దేవా....ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు.అలాగే నా మనవడి

ఆకలి తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను"అన్నది.


ఆ మాటవిన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి ,కాకి లోపలికి రావాలంటే తలుపులు

తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.                

కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు

.లోపల ఆ పసిపిల్లవాడు బిక్కమోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే..

ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ?"అన్నాడు.


ఆ పిల్లవాడు "మా మామ్మ దేవునికి ప్రార్థన చేసింది.దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది"

అన్నాడు.


అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో

"ఆకలివేస్తుందా "అని అడిగి..


"మీ మామ్మ చెప్పిన కాకిని నేనే..నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు.

నేను మళ్ళీ వచ్చి తలుపుకొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.


అతను ఒక మూసిఉన్న పచారికొట్టు తీయించి పప్పులు,ఉప్పులు,బియ్యం అన్నీ తీసుకుని

ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటికిటికీ దగ్గరికి వెళ్ళి

తలుపుకొట్టి అందించాడు.


ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు "ఖాకీ" ద్వారా ఆకలి తీర్చాడు. 


ఒకరిది ప్రార్థన..

ఇంకొకరిది విశ్వాసం..

మరొకరిది ప్రేమ పూరిత సహాయం..


ప్రార్థన :-- ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను

గుర్తుచేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన.


విశ్వాసం:-- ఆ చిన్నపిల్లవాడు తన మామ్మచేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ

తెరిచిమరీ వెతకడం.


సహాయం:--  ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు

ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తనవంతు సహాయంచేయడం....


మన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు అని చెప్పడానికి 

ఈ చిన్న సంఘటన చాలేమో



No comments: