ఇది ఒక ప్రహేళిక సమాధానాలన్నీ వరుసగా 'క' గుణింతములోనే వుంటాయి. ప్రయత్నించండి.
1.కమ్మగా చెవికి సోకి కంచికేగినవేవి?
2.పితరుల పిండమే పిట్ట తినును?
3.వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి?
4.రథమున కెయ్యది రాణ గూర్చు?
5.జలముల నింపుగ జమజేయు పాత్రేది?
6.బాటలు నాలుగెచ్చోట గలియు?
7. విష్ణువేపేరున వెలసె ద్వాపరమున ?
8.ఆదిత్య దేవుని కనుకూల మణియేది?
9.అడవులకే రాణి యంపించె రాముని?
10.రాయంచ లెట విహార మొనర్చు?
11.కూయన కూయని కూసెడు పులుగేది?
12.చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది?
13.పద్యరాజమ్మని పదుగురందురు దేని?
విద్య నేర్చిన బాల విప్పవమ్మ.
answers
1.కమ్మగా చెవికి సోకి కంచికేగినవేవి? ... కథలు
2.పితరుల పిండమే పిట్ట తినును? ... .కాకి
3.వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి? ... కిరీటి
4.రథమున కెయ్యది రాణ గూర్చు? ... కేతనం
5.జలముల నింపుగ జమజేయు పాత్రేది? ... కుండ
6.బాటలు నాలుగెచ్చోట గలియు? ... కూడలి
7. విష్ణువేపేరున వెలసె ద్వాపరమున ? ... కృష్ణ
8.ఆదిత్య దేవుని కనుకూల మణియేది? ... కెంపు
9.అడవులకే రాణి యంపించె రాముని? ... కైకేయి
10.రాయంచ లెట విహార మొనర్చు? ... కొలను
11.కూయన కూయని కూసెడు పులుగేది? ... కోకిల
12.చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది? ... కౌముది
13.పద్యరాజమ్మని పదుగురందురు దేని? ... కందము
No comments:
Post a Comment