1. కాణిపాకం క్షేత్రమునకు మరొక పేరు ఏమిటి?

 2. గాయత్రి మంత్రం లో ఉండే 24 అక్షరాలు ఎలా ఏర్పడినవి?

3. నవగ్రహాలు లింగ రూపంలో ఉన్న క్షేత్రం ఏది?

4. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి?

 5. నాలుగు పుణ్యక్షేత్రాలలో 4 స్థల వృక్షాలు ఉన్నాయి ఆ క్షేత్రాలు ఆ వృక్షాల పేర్లు చెప్పండి?

 6. శ్రీరంగం లో రంగనాథ స్వామి కి సంవత్సరంలో ఎన్ని ఉత్సవాలు జరుగుతాయి? 

7. కాశీ మహా పుణ్యక్షేత్రం లో ఒక గుడి లో ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి?

8. శివాలయంలో ద్వారపాలకుల పేర్లు ఏమిటి ఆ విగ్రహాలు ఏ భంగిమలో ఉంటాయి?

9. మొత్తం రామాయణాన్ని బొమ్మలు గా చెక్కిన  అద్భుత గుడి  గోపురం ఎక్కడ ఉంది?

 10. మర మరం అంటే ఎన్ని సంవత్సరాలు?

Ans

1. కాణిపాకం క్షేత్రమునకు మరొక పేరు ఏమిటి?

A. విహార పురి.

 2. గాయత్రి మంత్రం లో ఉండే 24 అక్షరాలు ఎలా ఏర్పడినవి?

A. వాల్మీకి రామాయణం లో ఉన్న 24 వేల శ్లోకాలలో ప్రతి వేయి శ్లోకాలకు

తరువాత వచ్చే మొదటి శ్లోకంలో మొదటి అక్షరాలు అన్నీ కలిపి 24 అక్షరాల

గాయత్రి మంత్రం ఏర్పడింది.

3. నవగ్రహాలు లింగ రూపంలో ఉన్న క్షేత్రం ఏది?

A. ఉజ్జయిని

4. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి?

A. సిద్ధాశ్రమం

 5. నాలుగు పుణ్యక్షేత్రాలలో 4 స్థల వృక్షాలు ఉన్నాయి

ఆ క్షేత్రాలు ఆ వృక్షాల పేర్లు చెప్పండి?

A. కంచిలో మామిడి చెట్టు వైదీశ్వరన్ లో వేప చెట్టు

జంబుకేశ్వరం లో నేరేడు చెట్టు మధ్య అర్జున క్షేత్రం లో తెల్ల మద్ది చెట్టు

ఈ నాలుగు వృక్షాలు శివలింగం తో సమానం.

 6. శ్రీరంగం లో రంగనాథ స్వామి కి సంవత్సరంలో ఎన్ని ఉత్సవాలు జరుగుతాయి? 

A.322

7. కాశీ మహా పుణ్యక్షేత్రం లో ఒక గుడి లో ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి?

   A. కాశీలో ఇండియా మ్యాప్ కి గుడి ఉంది. ఆ గుడిలో ఇండియా

మ్యాప్ కి మాత్రమే పూజలు జరుగుతాయి.

8. శివాలయంలో ద్వారపాలకుల పేర్లు ఏమిటి ఆ విగ్రహాలు

ఏ భంగిమలో ఉంటాయి?

A . శివాలయంలో ద్వారపాలకుల పేర్లు నంది మహాకాళి.

నంది ఒక వేలు పైకి చూపిస్తూ ఉంటారు.

మహాకాళి 2 వేళ్ళు పైకి చూపిస్తూ నిలిచి ఉంటారు.

9. మొత్తం రామాయణాన్ని బొమ్మలు గా చెక్కిన  అద్భుత గుడి  గోపురం ఎక్కడ ఉంది?

 A. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ లో

శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం.

 10. మర మరం అంటే ఎన్ని సంవత్సరాలు?

A. లక్ష సంవత్సరాలు

No comments: