బాంధవ్యం.......51

సంగీత  కాసేపట్లో  తనే  సర్దుకుంది..
"ఏదో  కొంచెం  emotional అయ్యా ఎక్కువయ్యిందా..?" 

"చా....లా extra " అన్నాడు  హర్ష 

ప్రవల్లిక  లక్ష్మీ  ఇద్దరూ  నవ్వారు.. 

"సరి  సరి  Problem  Solved  కదా ! మరి జాతకం  ఇచ్చి  వద్దామా ? అన్నాడు హరహర్రావు  గారు. 

"అలాగే  నాన్నా ! రేపు  సాయంత్రం వెళ్ళి  ఇద్దాం..
ఈ సారి  నేను  మీతో  వస్తాను " అంది  సంగీత.. 

అందరూ  కాస్త  తేలికైన  మనసుతో  ఆ రాత్రి  పడుకున్నారు.. 
తెల్ల వారి  అనూరాధ  రాధిక కు ఫోన్  చేసి  సాయంత్రం  జాతకాలు  తెచ్చి ఇస్తున్నట్టు  చెప్పింది.. 
ప్రవల్లిక ఆఫీస్ కి వెళ్ళింది కానీ  నిన్న  అమ్మ మనసు తెలిసాక సౌమ్యని  ఏం అడగాలనిపించలేదు...

కాసేపు తరువాత సౌమ్య ప్రవల్లికకు  ఒక మెసేజ్  forward  చేసింది ..
"బావ నాకు మెసేజ్  పంపించాడు ..అదే నీకు  పంపిస్తున్నాను  అంటూ Msg  పెట్టింది.. "

"వాడు  నాకన్నా  చాలా  బాధ్యతగా , ప్రేమగా  ఉంటాడు.. వాడి మీద  బాబాయ్  కన్నా పిన్ని  ప్రభావం చాలా ఉంది.  పిన్ని  పుట్టింటి  వారిది  చాలా  పెద్ద  ఉమ్మడి  కుటుంబం, అమ్మమ్మ,తాతయ్య ఉన్నారు, So అందరూ  కలిసిమెలిసి  పండుగలు  చేసుకుంటారు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య మీద చాలా ప్రేమ, గౌరవం . అదే  అందరి  పెద్దవారి  మీద  చూపిస్తాడు.. "
"ఇక  ఇక్కడ  బామ్మ , తాతయ్య  లేకపోయినా  మేమంతా  కలిసే  ఉంటాంకదా ..Financial గా  మాకేం  ప్రాబ్లమ్స్  లేవు ... అమ్మా, నాన్న మా సంపాదన  మీద ఆధారపడిలేరు  ఏదైనా  మాకే కాకపోతే పెద్ద  వారి under  లో  ఉన్నాము ..

"ఇక  ఈ మధ్యే ఉద్యోగం  మారాడు  ఏ కంపెనీనో  తెలీదు  తెలుసుకుని  చెబుుతాను." అని  దాని  సారాంశం. 

లంచ్ లో కలిశాక అడిగింది సౌమ్య

"చదివాను" అని చెప్పిన ప్రవల్లిక  "నిన్న  అమ్మకు  చెప్పేసాను  నాకు  OK అని  ఈ రోజు  సాయంత్రం జాతకం మీ ఇంట్లో  ఇచ్చి వస్తారను కుంటాను" అన్నది.  

"ఓ అలాగా ! జాతకం  కుదిరితే  మిగతా విషయాల్లో భయపడేదేం  ఉండదు  అమ్మ  మానేజ్  చేసుకుంటుంది" అన్నది  సౌమ్య..

 "కుదరాలి కదా !"

"కదా ! కాదు ... కుదురుతుంది.."
అది కాకపోయినా మా పెద్దత్త  కొడుకును stand byలో ఉంచింది.  కాక  పోతే ఆ బావ  బెంగుళూరు లో  ఉన్నాడు. పెద్దత్త వాళ్ళ అత్తగారు కొంచం ఛాదస్తురాలు , ఆవిడకు  కొన్ని  ప్రిన్సిపుల్స్  ఉన్నాయి  అందుకే  తరవాత చూద్దాం  అనుకున్నారు .. OK  God is Great ".అంది సౌమ్య.. 

సాయంత్రం  హరిహర్రావుగారు  సంగీత  ఇద్దరూ  కలిసి  రాధిక  వాళ్ళ ఇంటికి  వెళ్ళారు  కుశల  ప్రశ్నల  అనంతరం   
"మాకు  చాలా సంతోషంగా ఉంది  బాబాయ్  గారు  ప్రవల్లిక మా కుటుంబం లోకి  రావడం..
 మా అబ్బాయి  చిన్నవాడయ్యాడు  లేక  పోతే  మా ఇంటి  కోడలిని చేసుకునే  వారం "  

 "ఇది  కుదరక  పోయినా  మా పెద్దాడపడుచు  అబ్బాయి  కూడా  ఉన్నాడు .  అప్పుడు  ఆ అబ్బాయి జాతకంతో  కూడా  చూపిస్తాం అని  ప్రవల్లిక జాతకం  తీసుకుని  అబ్బాయి  జాతకం ఇచ్చారు.. "

 వారం రోజులు  గడిచాయి  జాతకాలు కుదిరాయన్న  వార్త  అందరినీ  సంతోష  పరిచింది .. ప్రవల్లిక మాత్రం  ఏ భావం  లేకుండా  ఉంది..  ఆదివారం  అమ్మాయిని  చూడడానికి  వస్తామన్నారు. ఇంట్లో  చాలా  రోజుల  తరువాత  హాడావిడి  మొదలయ్యింది. 

సంగీత  తన ఆడపడుచులిద్దరికీ ఫోన్  చేసి  రమ్మని  పిలిచింది  " అబ్బాయి రావడం  లేదుగా  తరువాత  వస్తాంలే  ఈసారికి  వదిలెయ్ "అన్నారు.. 

ఆమాటే  సంగీత  వాళ్ళ అమ్మతో  అంటే 
"పోనీ లేమ్మా ! వాళ్ళకు కొంచం  బాధగా  ఉంటుంది  వదిలేయమ్మ ." అన్నది  అనూరాధ.. 

"నేనదే  అనుకున్నాలే  అమ్మా..!"  అంది.. 

ఆదివారం  రానే  వచ్చింది ...
సాయంత్రం  సౌమ్యతో పాటు వాళ్ళ అమ్మా  నాన్న  అబ్బాయి వాళ్ళ  అమ్మా నాన్న   వచ్చారు.  పెళ్ళి చూపులని  భయపడుతున్న  ప్రవల్లికకు  అంతా  చాలా Casualగా జరిగింది.  అత్తా వాళ్ళు  ఇంటికి  వచ్చినట్టే  అనిపించింది.. 
సరదాగా హాబీలడిగారు ఆఫీస్ విషయాలడిగారు .. ఇంక  వెళదాం అనుకుంటున్న  సమయంలో  బామ్మగారు ....

"మీకు పెద్దదానిగా  ఒక  విషయం  చెప్పాలను  కుంటున్నాను.." అన్నారు  ...

"అలాగే! తప్పకుండా  చెప్పండి " అని  ఏం  చెబుతారా అని  ఆసక్తితో , ఆత్రుతతో  వినడానికి  సిద్ధ పడ్డారు..
 
" పెళ్ళిళ్ళు  స్వర్గంలో  అవుతాయంటారు  దేవుడి ఆజ్ఞ లేకుండా ఏం జరగదంటారు... కానీ మా మనవరాలి  పెళ్ళి  అందుకు  విరుద్ధంగా  జరిగిందేమో  అనిపిస్తుంది.. " 

"ఇక్కడ  ఇంట్లో  మా అయిష్టమే  కాదు  పైన  దేవతల ఆజ్ఞ  ఆశీర్వాదం , మా పెద్దల అనుజ్ఞ కూడా  లేకుండా  కూడా  జరిగిందేమో  అనిపిస్తుంది .."

"ఎందుకంటే  బంధువులందరితో పాటు ముక్కోటి  దేవతలు  వంశంలోని పెద్దలందరినీ  పిలిచి  పెళ్ళి  చేస్తాం ... కానీ ఇందులో  ఎవరి  ఆశీర్వాదం  కూడా  మా బిడ్డమీద  పని  చేయలేదు  దాని సంసారాన్ని  కాపాడలేదు..  అంతే అంతకన్నా ఏం  జరగలేదు."

 "అందరూ  మంచి  వాళ్ళే ,  ఉన్నత కుటుంబీకులే   భర్తకు మాత్రమే భార్య నచ్చలేదు . మిగతా  అందరూ  వీళ్ళిద్దరినీ  ప్రేమగా  చూసుకుంటారు . వీరికి కూడా అక్కడ అందరితో సంబంధ బాంధవ్యాలు చాలా  బాగున్నాయి.. "

"మీ ఇంటికి  వచ్చే మా అమ్మాయి ఒక  మంచి   కుటుంబం  నుండే వస్తుంది  అందులో సందేహం ఏమాత్రంలేదు. నిన్న  మా మనవరాలు  చాలా  భయపడింది.  మనం  ఎంత  కష్టమైనా  పడతాం  కానీ  మన  పిల్లలు కష్టపడుతుంటే  చూడలేం" 

" అందుకే  భగవంతుడు  మనల్ని  శిక్షించాలను  కుంటే  మన  పిల్లలను  ముందు  ఎన్నుకుంటాడు మనం  చేసిన  తప్పులకు  మన పిల్లలు  శిక్ష  అనుభవిస్తారు.. "

"అందుకే  మన  సంతానం  బాగుండాలంటే మనం పెద్ద  వాళ్ళం  తప్పు  చేయకూడదు.. 
ఇప్పుడు  తన  తల్లిదండ్రుల తప్పు  ప్రవల్లికకు  శిక్ష  కాకూడదు.. అది  చిన్నపిల్ల , తనకు  తెలీని  వయసులో  అలా  జరిగి  పోయింది.  మా సంగీత   చాలా  ప్రయత్నించింది  కానీ  అక్కడ  పెద్దలే  వీరు  దూరమవ్వడానికి  దోహద  పడ్డారు..  ఇంత  కన్నా  ఇంకేం  చెప్పలేను.." 
"అందుకని  తొందర  పడకుండా  బాగా  ఆలోచించి  నిర్ణయం  తీసుకోండి "అని  మెల్లగా అన్నాఖచ్చితంగా చెప్పింది  బామ్మ.. 

ఒక్క నిముషం  నిశ్శబ్ధం తరువాత  అబ్బాయి తండ్రి  "అలాంటిదేం లేదండి  అమ్మాయి మీద  ప్రేమతోనే  వచ్చాం " అన్నాడు ..

 అబ్బాయి తల్లి  బామ్మ దగ్గరకొచ్చి  పక్కన  కూచుంది ప్రవల్లికను దగ్గరకు పిలిచి  భుజం  చుట్టూ  చేయివేసింది ...

"బామ్మగారు మాకే  కాదు మా కుటుంబంలో  ఎవరికీ   అమ్మాయి గతం  అక్కర లేదు. మా మరదలు  రోజూ ప్రవల్లిక గురించి  చెప్పడమే .. అమ్మాయి  గుణగణాలు, ముఖ్యంగా  మీ పెద్దలందరి  మధ్య పెరిగింది  అదే  తనకున్న  పెద్ద  ఆస్తి .."

"మీరసలు  ఎలాంటి  భయం  పెట్టుకోనక్కరలేదు . మా అబ్బాయి గురించి  మేం  చెప్పడం కాదు  కానీ   చాలా మంచివాడు,  బాధ్యత కలవాడు"  అంది 

"ఫరవాలేదమ్మా!  మీరింత  మంది  తనకే  కష్టం  రాకుండా  చూసుకుంటే  చాలు  మా సంగీత   నిశ్చింతగా  ఉంటుంది. అంతే నేను చెప్పదలుచుకున్నది " అన్న  బామ్మకు  మిగతా అందరికీ  పెళ్ళి  వాళ్ళు ధైర్యం చెప్పారు.. 

" సౌమ్య  పెళ్ళిలో  మా అబ్బాయి వస్తాడు  అప్పుడు  చూసి  నిశ్చితార్థం  పెట్టుకుందాం లేదా  అబ్బాయి  లేకుండా  చేసుకుందామన్నా మాకు  OK .మీరు  ఆలోచించి  చెప్పండి   అలాగే  చేద్దాం.."
అన్నారు.. 

"ఒకరోజు  మా తమ్ముడి వాళ్ళింటికి  అమ్మాయి  వస్తే  మా అమ్మా  నాన్నగారు చూస్తారు  అంతే.  "

"అయ్యో !అలాగేనండి మీరెప్పుడంటే  అప్పుడే...  అన్నారు.. "

కాస్త  ఎమోషనల్ అయినా అంతా  హాయిగా  జరిగింది  అందరూ  సంతోషంతో   వీడ్కోలు  తీసుకున్నారు.. 

సశేషం

బాంధవ్యం..... 52

కన్న  కూతురు  జీవితం ఒక దశ  దాటి ఇంకో దశ లోకి  అడుగు  పెట్ట బోతుంది  

"ఇన్ని రోజులు తన బాధ్యతగా ఉన్న  పిల్ల వేరే  ఇంటికి బాధ్యత కాబోతున్నది.."

ఎంత  వద్దనుకున్నా  సంగీతకు  తన  పెళ్ళి  గుర్తుకొస్తున్నది.. 

" అందరినీ  చూసింది , అందరూ  నచ్చారు , అందరికీ  తను  కూడా  నచ్చింది , కానీ ! ఏడడుగుల  బంధాన్ని ఏడేళ్ళు  కూడా  నిలుపుకోలేక పోయాను... "

"ఎవరిది తప్పు ఎక్కడ  లోపం అని  తెలిస్తే  సరిదిద్దుకునే  దాన్ని  కదూ.. ఈ రోజు అన్నీ  ఉన్నా  మేమిద్దరం  ఒంటరి  వాళ్ళమేగా.. "

"మా కూతురి  పెళ్ళి  మా చేతులతో  చేసుకోలేకపోతున్నాం కదా ! ఎంత  ఆశపడింది కూతురు  కావాలని... "  అని  అనుకుంటుంటే  కళ్ళు  నిండుకున్నాయి.. 

"ఇంకా  అబ్బాయిని  ఎవరూ చూడలేదు  Photo పెళ్ళి చూపులకు దిగినట్టుగా  ఉంది ,  త్రుప్తిగా  లేదు  కనీసం  గొంతు వింటే  ఒక అంచనాకు   రావొచ్చేమో.." అని హర్ష  అంటుంటే  

"ఇప్పుడేగా అనుకున్నది ....  చూద్దాంలే, చూడకుండానే  తాంబూలాలు  తీసుకుంటామా  ఏంటి " అంది బామ్మ..

 అందరూ  సంతోషంగా  నిశ్చింతగా  ఉన్నారు  సంగీత  ప్రవల్లిక తప్ప.. ఎవరూ  ఏం  మాట్లాడలేదు  వారి  మనోభావాలు అర్థం  చేసుకోగలరు.. 

అనూరాధే  పదండి భోంచేద్దాం  అన్నది... 
         ...................................................

పెళ్ళి వారికి  మహదానందంగా  ఉంది  ..

సహజంగా  మగపెళ్ళి వారికి  కొంచం సంతోషం  ఎక్కువగానే  ఉంటుందేమో..
 తమ  ఇంటికి  కొత్త  వ్యక్తి  వస్తుందని.. 
అందుకే ఇక్కడ  కూడా  పెళ్ళివాళ్ళు  ఆనందంగా ఉన్నారు.. "అందరూ ఎంతో  కష్టపడుతున్న ఈ రోజుల్లో ఏ మాత్రం కష్టపడకుండా  ఇంత  మంచి  సంబంధం  దొరకడం  అద్రుష్టం కాకపోతే  మరేవిటీ  అని అని " పెళ్ళికొడుకు  తల్లి అంటుంటే  

" అంతా  సౌమ్య  రాధికల వల్లే .... ఈ క్రెడిట్  అంతా   వారిదే " అన్నాడు  పెళ్ళి కొడుకు తండ్రి.. 

"సొంత ఆడపడుచును  కాకపోయినా  ఎంత  ప్రేమ అభిమానంతో  మమ్మల్ని గుర్తు పెట్టుకుని  చెప్పావు..
చాలా  Thanks"  అంటున్న  ఆవిడతో  

"అదేంటొదినా  మా సౌమ్య  మీకోడలే  కదా"... అంది.. 
"కానివ్వండి  మరి!  మీ అమ్మాయి  పెళ్ళి  ఎంత త్వరగా  చేస్తే  మాఅబ్బాయి  పెళ్ళి  అంత  త్వరగా  చేస్తాం.. " నవ్వుతూ 

"అలాగే  ప్రయత్నం  చేస్తాం.."
అలా  వారంతా  బోలెడు  ఆశలతో  భవిష్యత్తు  వైపు  చూస్తున్నారు... 

తెల్లవారాక  ఆఫీస్ కెళ్ళిన సంగీత  మధ్యాహ్నం   లలిత  వాళ్ళకు  వనితా  వాళ్ళకు  ఫోన్  చేసి  చెప్పింది... 

"చాలా  మంచి  వాళ్ళు వదినా మీ అందరి లాగే..
అత్తగారు  కాకుండా  ఇంకో  అత్త దొరికిందనే  అనుకుంటున్నాను.. " అన్న సంగీతతో  

" చాలా  సంతోషం  సంగీతా !ఈ రోజు  ప్రవల్లికను  ఇలా  చూస్తుంటే  మాకెంత  ఆనందంగా  ఉందో  అంత  కన్నా ఎక్కువగా నీ ప్రేమ, శ్రమ ,శ్రద్ధ  అన్నీ  కనబడుతున్నాయి.. "

"Thanku  వదినా !..."

"మా బంధం ఎలా  ఉన్నా రక్త సంబంధం  ఎక్కడికి పోదు  కదా ! ప్రవల్లిక మీ మేనకోడలు  అది  ఎవరూ  కాదనలేరు..   మీరందరూ  ఇది మనస్ఫూర్తిగాా అనుకుని  దాన్ని  ఆశీర్వాదించండి అదే  నేను  కోరుకునేది.. "

" తప్పకుండా  సంగీత.. "

"బావగారికి  కూడా  చెబుతారా అంది".. "తప్పకుండా.. "

ఇంకా  ఏదో  చెప్పాలని  ప్రయత్నిస్తూ చెప్ప  లేక  పోతుంది  .. అదిగ్రహించి  కూడా  ఏం తెలియనట్టే  "ఇంకా  ఏమన్నా  చెప్పాలనుకుంటున్నావా ?"

" ఏంలేదువదినా  ..... ఎలా  చెప్పాలో  తెలియక రెండు  నిముషాలు ఆగి  ' మీకు  చెప్పాలనిపిస్తే  మీ తమ్ముడికి  చెప్పండి ' అంతే " ..అని  ఫోన్  పెట్టేసింది.. 

కొంచం  ఉద్వేగంతో  ఒళ్ళు వణికింది సంగీతకు..
 
"పెళ్ళికి  వచ్చిన  వారి బంధువులందరూ  అమ్మాయి  తండ్రి  ఎక్కుడ  అంటే...చిన్న  పిల్ల అది తట్టుకుంటుందా?"  అని  మాటి మాటికి  ఆలోచిస్తుంది .. 

"ఎందుకు ఇంత  బలహీన  పడుతున్నాను..  ఎందుకు నా ఆలోచనా  విధానం  మార్చు  కుంటున్నాను.. ఒకరి కోసమా నేను  జీవించేది .... లేదు  నాకూతురి  కోసం ..నేను  దానికి  ఇప్పుడే కవచంలా ఉండాలి , నేను అధైర్య పడకూడదు  భగవంతుడా  శక్తినివ్వు ." అని  పనిలో  పడింది.. 

సాయంత్రం  ఇంటికి  వచ్చిన  ప్రవల్లికను గమనించింది  చాలా  మాములుగానే  ఉంది. సంతోషం  లేదు  అలాని  బాధ కూడా లేదు   చాలా  Casual గా  ఉంది.. 

దీనికింత  స్థితప్రజ్ఞత  ఎక్కడి  నుండి  వచ్చిందో?    దీని  ముందు  నేనే  బేలగా  మారుతున్నానేమో  No  ఇలా ఆలోచించకూడదు,  మారాలి  మార్చుకోవాలి..  అనుకుంది... 
..............................................................

రెండు  రోజులయ్యింది ..

ఒక రోజు   హరీష్  లలిత  వాళ్ళ  ఇంటికి  వచ్చాడు. అప్పటికే  లలిత  ప్రవల్లిక పెళ్ళి కుదిరిందని చెప్పింది.. 

దానికోసమే అయ్యుంటుందా?  తెలీదు , లలిత  మాములుగానే   మంచి  చెడ్డ  కుశలం  అడిగింది...

"నేను  ఊరెళ్ళి  నిన్ననే  వచ్చాను.. సతీష్  చాలా  చిక్కిపోయాడు. ఆ పేయింగ్  గెస్ట్  వెళ్ళి  పోయాడు,   ఇప్పుడు వాడు ఒక్కడే  పిచ్చివాడిలాగున్నాడు.." 

"టైమ్ కి  తిండిలేదు ,నిద్ర  కూడా  లేదు.  ఎంత  సేపూ TV లేదంటే  వాళ్ళఫ్రండ్స్  అంటాడు . వాళ్ళతో  తిరుగుతాడు  వాళ్ళు వాడి కన్నా చాలా  చిన్న వాళ్ళు, వాళ్ళతో వీడికి  స్నేహం  ఏంటో  తెలీదు.."

"రా  ! ఇంటికి  వెళదాం నాలుగు  రోజులుండి వద్దువు గానీ  అని  ఎంత చెప్పినా   వినలేదు.." 

"పోనీ అన్నయ్యా! కూతురి  పెళ్ళికుదిరింది  ఇద్దరు కలిసి  పెళ్ళి  చేస్తే  మళ్ళీ  కలుసుకుంటారేమో  దానిగురించి  ఆలోచిద్దాం ..సతీష్ ని సమదాయించి సమాధాన  పరిచి  ఒప్పిద్దాం.. "

"ముందు బాబును  ఒప్పించి  తరువాత  సంగీత  వాళ్ళ  అమ్మా  నాన్నతో  మాట్లాడదాం.. 
ప్రవల్లిక పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే  సంగీత  కూడా  ఒంటరయి  పోతుంది  ఒకరికొకరు  తోడుంటారు ..."

"ఇవన్నీ ముందు సతీష్ తో , తరువాత  సంగీతతో  మాట్లడాక  పెద్ద వాళ్ళకు  చెబుదాం" అని  నిర్ణయించుకున్న తరువాత  సతీష్ కి  ఫోన్  చేసి రమ్మని  చెప్పారు.. 

అవునూ  కాదూ అని ఎప్పటి  లాగే ఏం సమాధనం   చెప్పని  సతీష్  రేపు  వస్తాడో  రాడో  చూడాలి..

సశేషం

బాంధవ్యం.......... 53 

రెండు  రోజులు  గడిచాయి  కానీ  సతీష్  రాలేదు
ఇంక  రాడు  అనుకుంటున్న  సమయంలో వచ్చాడు  అదీ లలితా వాళ్ళ ఇంటికే ..

తనేం  మాట్లాడకుండా  అందరినీ పిలిచింది  లలిత.. అందరూ  వచ్చాక  హరీష్  మాట్లాడడం మొదలు  పెట్టాడు ...

"ఎందుకు  ఒక్కడివీ  నువ్వు  అక్కడుండడం  అవసరమా  ఇక్కడే  నీఇంట్లో  నువ్వు ఉండు..
ఎవరింట్లో  అయినా  భోంచెయ్యి  లేదా వంట మనిషిని  చూస్తాం  వండి  పెట్టి  వెళుతుంది.."  

"డాక్టర్  కూడా ఇక్కడే  ఉన్నాడు కదా!  అమ్మ  నాన్న  ఉన్నప్పుడు వేరు  ఇప్పుడుకూడా  ఉంటానంటే  ఎలా?   వయసొస్తుంది, పెద్ద వాడివి అవుతున్నావు కదా.."

ఏం  మాట్లాడలేదు.. 

"నీ కూతురు  పెళ్ళి కుదిరింది  తెలుసా.. "

"ఆహా.."

"ఆహా  కాదు  పెళ్ళి  చేయవా?"

"నా దగ్గర  డబ్బుల్లేవు.."

"డబ్బులు కాదు  పీటల మీద  కూచోవాలి , ఒక  తండ్రిగా  కన్యాదానం  చేయాలి.. "

"చూద్దాంలే ! ఇప్పటి నుండి  ఎందుకు.?" 

"అంటే  సమయం  వచ్చినప్పుడు  చేస్తావా? .."

"చూస్తా అన్నా  కదా!"  అన్నాడు ..

అక్కడికే  సంబర  పడిపోయారు వాళ్ళంతా... 
 చేస్తాడనే  నిర్ణయాని  కొచ్చారు.. ఇంక  మిగతావి  ఇప్పుడొద్దులే అని  అంతటితో  ఆపేశారు.. 
ఎవరు ఉండమన్నా  ఉండకుండా , ఎవరి  మాటా  వినకుండా  వెళ్ళి పోయాడు .
.........................................

నాలుగు  రోజుల తరువాత  రాధిక హరిహర్రావుగారింటికి ఫోన్  చేసింది. .. సంగీత మాట్లాడింది. 
 "మా వదిన  పేరు  గాయత్రి , అన్నయ్య గారి పేరు నరసింహారావు గారు.. వారికి  మీ నంబరిచ్చాను, Phone  చేస్తారు  మాట్లాడండి"  అంది.. 

"అలాగే ! "అన్న సంగీత  రాత్రి  గాయత్రి గారు ఫోన్  చేస్తే  మాట్లాడింది....

"ఎల్లుండి మా అమ్మా,నాన్న గారు  మా అన్నయ్యా  వాళ్ళింటికి  వస్తున్నారు.  వారు  పెద్దవాళ్ళు  వారికి ప్రవల్లికను  చూపించాలని  నా కోరిక  అంతే నండి.. 
ఇంక మా అబ్బాయి ప్రణయ్ ని కూడా  అక్కడే   పరిచయం  చేద్దామను  కుంటున్నాము.. 
వారు  రాగానే  ఫోన్  చేస్తాను ..
మీకు  OK  కదా.?..."

 "అలాగే మాకేం అభ్యంతరం లేదని " చెప్పి.. 
అదే  విషయం ఇంట్లో అందరకీ చెప్పింది.   ఆ రోజు కోసం ఎదురు  చూస్తున్నారందరు.  అబ్బాయిని చూడొచ్చన్న ఆనందం  అందరిలో  కనబడింది... 

మళ్ళీ  అందరూ రొటీన్ లో పడ్డారు... 
పెళ్ళి వారిదగ్గరనుండి ఫోన్ రాలేదు  కానీ లలిత  ఫోన్  చేసింది .. "వీలు  చూసుకుని  ఒకసారి  రమ్మని   పెళ్ళి కబుర్లు కూడా చెబుదువు గానీ " అంటూ.. 

ఆరోజు  శనివారం , ఆఫీస్ లో  ఎక్కువ 
పని లేదు ,అందరూ  ఇంట్లోనే  ఉన్నారు  తొందరగా ఇంటికి  వెళదాం  అని  బయలుదేరింది.. 
కాస్త  దూరం  రాగానే  లలిత  పిలవడం  గుర్తొచ్చింది  అంతే  అటు  వైపు వెళ్ళింది.. 

ఎప్పటి  లాగే  ఆప్యాయంగా  పలకరించి కాఫీ  టిఫిన్  ఇచ్చింది... కాఫీ  తాగుతూ  మెల్లిగా  పెళ్ళి వాళ్ళ సంగతులన్నీ ఏకరువు  పెట్టింది. 

" పోనీలే దాన్ని  బాగా చూసుకుంటే  అంత కన్నా కావలసిందేం ఉంది "..అంది లలిత 

కాసేపు  మౌనం...  ఏం  చెప్పాలా?  ఎలా  చెప్పాలా  అనుకుంటూ  కాసేపు  టీపాయ్  సర్దినట్టు  చేసింది. 
తరువాత 
" ఏమనుకుంటున్నారు  ఇంట్లో " అనడిగింది  

"ఏ విషయం  వదినా ?"

"అదే  పెళ్ళి గురించి"  

"అందరికీ  సంబంధం నచ్చింది. ఇక  తాంబూలాలు  అయ్యాక  పెళ్ళిగురించి  ఆలోచించాలి.. "

"అమ్మా, నాన్న  ఏమనుకుంటున్నారు..ఏం  ఆలోచించారు .?".

"అంటే నాకర్థం  కాలేదు  వదినా.!" 

"మేం చెప్పాం సరే , నువ్వు , మీ వాళ్ళు సతీష్ ని పెళ్ళికి పిలుస్తారా అని " .. 

  "ఇంకా ఏం  ఆలోచించ లేదు వదినా .". 

"మేం చెప్పాం రావాలి అని.  చూస్తా!  అన్నాడు 
నువ్వు చెప్తే వస్తాడేమో..  చెప్పి  చూడు..
బాబొస్తే  ఇద్దరి  చేతుల  మీదుగా  పెళ్ళి  చేయొచ్చు.
 నేను  అంటున్నానని  కాదు  కానీ , ఇలా  మళ్ళీ మీరు  కలుసుకుంటే పాప వెళ్ళాక   నువ్వు  ఒక్క దానివి  కాకుండా ఒకరికొకరు   తోడవుతారు..
 బాగా ఆలోచించుకుని  చెప్పు ఫరవాలేదు  ఇంకా. టైమ్  ఉంది  కదా..."

"జవాబేదైనా  పాజిటివ్  గానే  తీసుకుంటాను 
మన  రిలేషన్  కి  Problem  ఏం  లేదు  అంది.."
 
అంతా  blank  సంగీతకు, మౌనంగానే  కూచుంది. కాసేపయ్యయ్యాక లలితకు  చెప్పి జవాబు కోసం  చూడకుండా  ఇంటికి  బయలుదేరింది  ..

అనుకోకుండా  వస్తున్న  అవకాశం.  ఏం చెయ్యను,   ఒప్పుకుని ఇద్దరం కలిసి  పెళ్ళి చేయమా.?.
ఎవరికి  చెప్పను, ఎవరిని  అడగను.. అసలడిగితే బాగుంటుందా...
ఆలోచనల్లో   ఉండగానే ఇల్లొచ్చింది.. 
అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు. 

"హాలో...బాబింకా  పడుకోలేదా?  " అంటూ  వాడిని  చూస్తూ లోపలికెళ్ళింది.. 

అందరూ పెళ్ళి  ముచ్చట్లే  మాట్లాడుకుంటున్నారు.
అక్కడికి వెళ్ళగానే ప్రవల్లికకు  వంటెలా  చేయాలో  చెబుతూనే,  చిట్కాలు  నేర్పిస్తున్నారందరూ.. 

ఎవరికెలా  చెప్పాలో తెలీక  ఆ రాత్రి  గడిపింది... 
తొందరేం  ఉంది  కానీ ,  చూద్దాం . ముందు  అబ్బాయిని  చూస్తే  ఒక  అభిప్రాయం  వస్తుంది  అప్పుడాలోచ్చిద్దాం..

తెల్లవారి ఆదివారం భోంచేసి  అమ్మా  వాళ్ళింటికి   వెళ్ళారు. వెళుతూనే  ప్రవల్లిక బాబు  దగ్గరకెళ్ళింది..  

హల్లో  బామ్మ ,అనూరాధ, హరిహర్రావు గారు   మాత్రమే  ఉన్నారు.. 

బామ్మే  అడిగింది " ఏమ్మా ! ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లేక  అడగాలను  కుంటున్నావా.."

"ఏం లేదు  బామ్మా .!".

"అదికాదులే దేని గురించో  చెప్పు . నీ  సందేహాలన్నీ   తీర్చుకో.. పెళ్ళికి  హాయిగా  ఉండొచ్చు.. "

"నిన్న  వదినా వాళ్ళింటికి  వెళ్ళాను " అంటూ  జరిగింది  చెప్పింది.. అందరూ  నిశ్చేష్టులయ్యారు.. 
ఇది  ఎవరూ  ఊహించనిది.  అసలు  ఇలాంటి ఒక రోజు  వస్తుందనుకోలేదు... ఏం  చెబుతారు.. 

హరిహర్రావుగారు " నువ్వేమనుకుంటున్నావమ్మా?"
అనడిగారు ..

" నాకేం  తోచటంలేదు  నాన్నా!. "

"మనమే  షాక్  లో  ఉంటే  అది  ఏం  అనుకుంటుంది .మెల్లిగా  ఆలోచించుకో తల్లి తొందరేం  ఉంది " అనూరాధ.. 

"తొందర అని కాకపోయినా ఆలోచించి  నిర్ణయం  తీసుకోవలసిన  సమయమే..ఎక్కువ  రోజులు ఆగితే  వాళ్ళు  ఆశతో  ఉంటారు.. వద్దు  అనుకున్నప్పుడు  వెంటనే  చెప్పడం మంచిది  లేదా  ఆలోచించుకో.. "

"కానీ  ఒక్కవిషయం, ఇది  నీ వ్యక్తిగతం , ఎప్పటికైనా  నువ్వు మాత్రమే  తీసుకోవలసిన  నిర్ణయం.   నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా  మాకేం  అభ్యంతరం  ఉండదు " అంది  బామ్మ.. 

"నువ్వు  గిల్టీ  feel  అవ్వాల్సిన  అవసరం  లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా  మేము సపోర్ట్ గా ఉంటాము " అన్నారు  హరిహర్రావుగారు..

"ఏంటి  విషయం " అంటూ వచ్చాడు హర్ష  ..
విషయం విని  "నో అక్కా ! ఇప్పుడు నీకంత  అవసరమా ? నాకిష్టం లేదు "అన్న  హర్షతో 

"తప్పు  నాన్నా!  అది దాని భర్త దగ్గరికి వెళుతుంది,  అతన్ని  కలుస్తుంది.  వద్దనడానికి మూడో  వారికి  అధికారం  లేదు....అక్క  దాని  నిర్ణయం  అది  తీసుకుంటుంది , అది కావాలనుకుంటే  భార్యాభర్తలిద్దరికి  నచ్చితే  ఇద్దరూ  కలిసి   పాప పెళ్ళిచేస్తారు.. అమ్మా, నాన్నలు  కలిసి  పెళ్ళి  చేస్తే  ఏ కూతురు  సంతోషపడదు.. "

"నా జీవితం లో  నాన్నెక్కడమ్మ..?" 

అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారు.. 

ఎప్పుడొచ్చిందో తెలీదు? ప్రవల్లిక మెల్లగా అన్నది
 
సశేషం


బాంధవ్యం.......... 53 

రెండు  రోజులు  గడిచాయి  కానీ  సతీష్  రాలేదు
ఇంక  రాడు  అనుకుంటున్న  సమయంలో వచ్చాడు  అదీ లలితా వాళ్ళ ఇంటికే ..

తనేం  మాట్లాడకుండా  అందరినీ పిలిచింది  లలిత.. అందరూ  వచ్చాక  హరీష్  మాట్లాడడం మొదలు  పెట్టాడు ...

"ఎందుకు  ఒక్కడివీ  నువ్వు  అక్కడుండడం  అవసరమా  ఇక్కడే  నీఇంట్లో  నువ్వు ఉండు..
ఎవరింట్లో  అయినా  భోంచెయ్యి  లేదా వంట మనిషిని  చూస్తాం  వండి  పెట్టి  వెళుతుంది.."  

"డాక్టర్  కూడా ఇక్కడే  ఉన్నాడు కదా!  అమ్మ  నాన్న  ఉన్నప్పుడు వేరు  ఇప్పుడుకూడా  ఉంటానంటే  ఎలా?   వయసొస్తుంది, పెద్ద వాడివి అవుతున్నావు కదా.."

ఏం  మాట్లాడలేదు.. 

"నీ కూతురు  పెళ్ళి కుదిరింది  తెలుసా.. "

"ఆహా.."

"ఆహా  కాదు  పెళ్ళి  చేయవా?"

"నా దగ్గర  డబ్బుల్లేవు.."

"డబ్బులు కాదు  పీటల మీద  కూచోవాలి , ఒక  తండ్రిగా  కన్యాదానం  చేయాలి.. "

"చూద్దాంలే ! ఇప్పటి నుండి  ఎందుకు.?" 

"అంటే  సమయం  వచ్చినప్పుడు  చేస్తావా? .."

"చూస్తా అన్నా  కదా!"  అన్నాడు ..

అక్కడికే  సంబర  పడిపోయారు వాళ్ళంతా... 
 చేస్తాడనే  నిర్ణయాని  కొచ్చారు.. ఇంక  మిగతావి  ఇప్పుడొద్దులే అని  అంతటితో  ఆపేశారు.. 
ఎవరు ఉండమన్నా  ఉండకుండా , ఎవరి  మాటా  వినకుండా  వెళ్ళి పోయాడు .
.........................................

నాలుగు  రోజుల తరువాత  రాధిక హరిహర్రావుగారింటికి ఫోన్  చేసింది. .. సంగీత మాట్లాడింది. 
 "మా వదిన  పేరు  గాయత్రి , అన్నయ్య గారి పేరు నరసింహారావు గారు.. వారికి  మీ నంబరిచ్చాను, Phone  చేస్తారు  మాట్లాడండి"  అంది.. 

"అలాగే ! "అన్న సంగీత  రాత్రి  గాయత్రి గారు ఫోన్  చేస్తే  మాట్లాడింది....

"ఎల్లుండి మా అమ్మా,నాన్న గారు  మా అన్నయ్యా  వాళ్ళింటికి  వస్తున్నారు.  వారు  పెద్దవాళ్ళు  వారికి ప్రవల్లికను  చూపించాలని  నా కోరిక  అంతే నండి.. 
ఇంక మా అబ్బాయి ప్రణయ్ ని కూడా  అక్కడే   పరిచయం  చేద్దామను  కుంటున్నాము.. 
వారు  రాగానే  ఫోన్  చేస్తాను ..
మీకు  OK  కదా.?..."

 "అలాగే మాకేం అభ్యంతరం లేదని " చెప్పి.. 
అదే  విషయం ఇంట్లో అందరకీ చెప్పింది.   ఆ రోజు కోసం ఎదురు  చూస్తున్నారందరు.  అబ్బాయిని చూడొచ్చన్న ఆనందం  అందరిలో  కనబడింది... 

మళ్ళీ  అందరూ రొటీన్ లో పడ్డారు... 
పెళ్ళి వారిదగ్గరనుండి ఫోన్ రాలేదు  కానీ లలిత  ఫోన్  చేసింది .. "వీలు  చూసుకుని  ఒకసారి  రమ్మని   పెళ్ళి కబుర్లు కూడా చెబుదువు గానీ " అంటూ.. 

ఆరోజు  శనివారం , ఆఫీస్ లో  ఎక్కువ 
పని లేదు ,అందరూ  ఇంట్లోనే  ఉన్నారు  తొందరగా ఇంటికి  వెళదాం  అని  బయలుదేరింది.. 
కాస్త  దూరం  రాగానే  లలిత  పిలవడం  గుర్తొచ్చింది  అంతే  అటు  వైపు వెళ్ళింది.. 

ఎప్పటి  లాగే  ఆప్యాయంగా  పలకరించి కాఫీ  టిఫిన్  ఇచ్చింది... కాఫీ  తాగుతూ  మెల్లిగా  పెళ్ళి వాళ్ళ సంగతులన్నీ ఏకరువు  పెట్టింది. 

" పోనీలే దాన్ని  బాగా చూసుకుంటే  అంత కన్నా కావలసిందేం ఉంది "..అంది లలిత 

కాసేపు  మౌనం...  ఏం  చెప్పాలా?  ఎలా  చెప్పాలా  అనుకుంటూ  కాసేపు  టీపాయ్  సర్దినట్టు  చేసింది. 
తరువాత 
" ఏమనుకుంటున్నారు  ఇంట్లో " అనడిగింది  

"ఏ విషయం  వదినా ?"

"అదే  పెళ్ళి గురించి"  

"అందరికీ  సంబంధం నచ్చింది. ఇక  తాంబూలాలు  అయ్యాక  పెళ్ళిగురించి  ఆలోచించాలి.. "

"అమ్మా, నాన్న  ఏమనుకుంటున్నారు..ఏం  ఆలోచించారు .?".

"అంటే నాకర్థం  కాలేదు  వదినా.!" 

"మేం చెప్పాం సరే , నువ్వు , మీ వాళ్ళు సతీష్ ని పెళ్ళికి పిలుస్తారా అని " .. 

  "ఇంకా ఏం  ఆలోచించ లేదు వదినా .". 

"మేం చెప్పాం రావాలి అని.  చూస్తా!  అన్నాడు 
నువ్వు చెప్తే వస్తాడేమో..  చెప్పి  చూడు..
బాబొస్తే  ఇద్దరి  చేతుల  మీదుగా  పెళ్ళి  చేయొచ్చు.
 నేను  అంటున్నానని  కాదు  కానీ , ఇలా  మళ్ళీ మీరు  కలుసుకుంటే పాప వెళ్ళాక   నువ్వు  ఒక్క దానివి  కాకుండా ఒకరికొకరు   తోడవుతారు..
 బాగా ఆలోచించుకుని  చెప్పు ఫరవాలేదు  ఇంకా. టైమ్  ఉంది  కదా..."

"జవాబేదైనా  పాజిటివ్  గానే  తీసుకుంటాను 
మన  రిలేషన్  కి  Problem  ఏం  లేదు  అంది.."
 
అంతా  blank  సంగీతకు, మౌనంగానే  కూచుంది. కాసేపయ్యయ్యాక లలితకు  చెప్పి జవాబు కోసం  చూడకుండా  ఇంటికి  బయలుదేరింది  ..

అనుకోకుండా  వస్తున్న  అవకాశం.  ఏం చెయ్యను,   ఒప్పుకుని ఇద్దరం కలిసి  పెళ్ళి చేయమా.?.
ఎవరికి  చెప్పను, ఎవరిని  అడగను.. అసలడిగితే బాగుంటుందా...
ఆలోచనల్లో   ఉండగానే ఇల్లొచ్చింది.. 
అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు. 

"హాలో...బాబింకా  పడుకోలేదా?  " అంటూ  వాడిని  చూస్తూ లోపలికెళ్ళింది.. 

అందరూ పెళ్ళి  ముచ్చట్లే  మాట్లాడుకుంటున్నారు.
అక్కడికి వెళ్ళగానే ప్రవల్లికకు  వంటెలా  చేయాలో  చెబుతూనే,  చిట్కాలు  నేర్పిస్తున్నారందరూ.. 

ఎవరికెలా  చెప్పాలో తెలీక  ఆ రాత్రి  గడిపింది... 
తొందరేం  ఉంది  కానీ ,  చూద్దాం . ముందు  అబ్బాయిని  చూస్తే  ఒక  అభిప్రాయం  వస్తుంది  అప్పుడాలోచ్చిద్దాం..

తెల్లవారి ఆదివారం భోంచేసి  అమ్మా  వాళ్ళింటికి   వెళ్ళారు. వెళుతూనే  ప్రవల్లిక బాబు  దగ్గరకెళ్ళింది..  

హల్లో  బామ్మ ,అనూరాధ, హరిహర్రావు గారు   మాత్రమే  ఉన్నారు.. 

బామ్మే  అడిగింది " ఏమ్మా ! ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లేక  అడగాలను  కుంటున్నావా.."

"ఏం లేదు  బామ్మా .!".

"అదికాదులే దేని గురించో  చెప్పు . నీ  సందేహాలన్నీ   తీర్చుకో.. పెళ్ళికి  హాయిగా  ఉండొచ్చు.. "

"నిన్న  వదినా వాళ్ళింటికి  వెళ్ళాను " అంటూ  జరిగింది  చెప్పింది.. అందరూ  నిశ్చేష్టులయ్యారు.. 
ఇది  ఎవరూ  ఊహించనిది.  అసలు  ఇలాంటి ఒక రోజు  వస్తుందనుకోలేదు... ఏం  చెబుతారు.. 

హరిహర్రావుగారు " నువ్వేమనుకుంటున్నావమ్మా?"
అనడిగారు ..

" నాకేం  తోచటంలేదు  నాన్నా!. "

"మనమే  షాక్  లో  ఉంటే  అది  ఏం  అనుకుంటుంది .మెల్లిగా  ఆలోచించుకో తల్లి తొందరేం  ఉంది " అనూరాధ.. 

"తొందర అని కాకపోయినా ఆలోచించి  నిర్ణయం  తీసుకోవలసిన  సమయమే..ఎక్కువ  రోజులు ఆగితే  వాళ్ళు  ఆశతో  ఉంటారు.. వద్దు  అనుకున్నప్పుడు  వెంటనే  చెప్పడం మంచిది  లేదా  ఆలోచించుకో.. "

"కానీ  ఒక్కవిషయం, ఇది  నీ వ్యక్తిగతం , ఎప్పటికైనా  నువ్వు మాత్రమే  తీసుకోవలసిన  నిర్ణయం.   నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా  మాకేం  అభ్యంతరం  ఉండదు " అంది  బామ్మ.. 

"నువ్వు  గిల్టీ  feel  అవ్వాల్సిన  అవసరం  లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా  మేము సపోర్ట్ గా ఉంటాము " అన్నారు  హరిహర్రావుగారు..

"ఏంటి  విషయం " అంటూ వచ్చాడు హర్ష  ..
విషయం విని  "నో అక్కా ! ఇప్పుడు నీకంత  అవసరమా ? నాకిష్టం లేదు "అన్న  హర్షతో 

"తప్పు  నాన్నా!  అది దాని భర్త దగ్గరికి వెళుతుంది,  అతన్ని  కలుస్తుంది.  వద్దనడానికి మూడో  వారికి  అధికారం  లేదు....అక్క  దాని  నిర్ణయం  అది  తీసుకుంటుంది , అది కావాలనుకుంటే  భార్యాభర్తలిద్దరికి  నచ్చితే  ఇద్దరూ  కలిసి   పాప పెళ్ళిచేస్తారు.. అమ్మా, నాన్నలు  కలిసి  పెళ్ళి  చేస్తే  ఏ కూతురు  సంతోషపడదు.. "

"నా జీవితం లో  నాన్నెక్కడమ్మ..?" 

అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారు.. 

ఎప్పుడొచ్చిందో తెలీదు? ప్రవల్లిక మెల్లగా అన్నది
 
సశేషం

బాంధవ్యం........ 54 అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగారు.. ఎప్పుడొచ్చిందో తెలీదు,ఏం విన్నదో , ఎంత వరకు విన్నదో కూడా తెలీదు. అసలెందుకు ఆ మాట అన్నదో కూడా తెలీదు. మందుగా తేరుకున్న హర్ష .. "ఏంటమ్మా! ఇప్పుడెందుకు అలా అడుగుతున్నావ్ , లక్ష్మీ ఇలారా ! పాపను లోపలికి తీసుకెళ్ళు.." అన్నాడు .. "చెప్పమ్మా నా జీవితంలో నాన్నెక్కడ .." లక్ష్మి లోపలినుండి వచ్చింది ప్రవల్లికను తీసుకుని వెళ్ళడానికి..చేతితో ఆగమని చెబుతూ .. " మావయ్యా! నేను అమ్మతో మాట్లాడాలి. ఇప్పుడే మీ అందరి ముందే.." అంటూ తల్లి దగ్గరకు పోతున్న ప్రవల్లికను అనూరాధ దగ్గరకు తీసుకుంది... "రా తల్లీ ! కూచో.. ఇక్కడినుండే అడుగు అంటూ పక్కన కూచో పెట్టుకుంది.... "మీరు చెప్పండి నా జీవితంలో నాన్న ఉన్నాడా..?" 'నాన్న'.వాళ్ళ అమ్మా నాన్న దగ్గరనున్నాడు 'అమ్మ ' వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుంది.. " "మరి నేను ? ....ఎప్పుడైనా మ్మిమ్మల్ని అడిగానా నాన్న ఏడని?. రోజూ లంచ్ టైమ్ లో వచ్చి అన్నం పెట్టే నాన్న సడన్ గా రాకపోతే ఊరెళ్ళాడనుకున్నాను .. " "అమ్మ మాటి మాటికీ ఏడుస్తుంటే హాస్పిటల్ లో ఉన్నాడనుకున్నాను..దేవుడా!నాన్నకేం కావద్దు, నాన్న మంచిగా ఇంటికి రావాలి, మేం ముగ్గురం కలిసుండాలి అని దండం పెట్టుకున్నాను.. " "కానీ అమ్మ ఏరోజూ హాస్పిటల్ కి వెళుతున్నాని చెప్పలేదు.. వెళ్ళలేదు .. నాన్నకూడా ఇంటికి రాలేదు ..ఎందుకో తెలీదు.. అంతా బాగుంటే మరి అమ్మ ఎందుకు ఏడుస్తుంది?." " School లో Parent Teacher meeting కి నాన్నతో లేదా వాళ్ళిద్దరితో వెళ్ళేదాన్ని.. కానీ అమ్మ ఒక్కతే ఎందుకు వస్తుంది.. నేను ఇంటికి రాగానే నాన్న ఎందుకు కనబడటం లేదు.." "ఇవన్నీ నాకు జవాబు దొరకని ప్రశ్నలు.. ఇప్పటికి కూడా.. అయినా అమ్మను నేనేం అడగలేదు. అమ్మ రాత్రిపూట ఏడవడం చాలా సార్లు చూసాను ఎందుకు ఏడుస్తుందో తెలీదు...నాన్న బాగానే ఉన్నాడని నా నమ్మకం .." "ఎందుకంటే నాన్నను ఇంట్లో కింద పడుకో పెట్టి పూజచేసి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళలేదు.. మరి అమ్మ ఎందుకేడుస్తుందో తెలీదు?.." "మనం వేరే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే నాకు తెలిసింది నాన్న ఇక రాడని.." "అప్పుడప్పుడూ వేరే వాళ్ళు వాళ్ళ నాన్నలతో వస్తుంటే బాధపడేదాన్ని , అది కూడా కాసేపే.. అందరి Progress Cards మీద వాళ్ళ Father's signatures ఉండేవి. మీ నాన్న ఊరెళ్ళాడా ? అని మొదటి సారి అడిగింది టీచర్. తరువాత ఇంక అడగలేదు..తనకేం అర్థమయ్యిందో.." "అత్తా వాళ్ళ ఇంటికి వెళితే నాన్నను చూడొచ్చనుకునే దాన్ని .కానీ నాన్న అక్కడికెప్పుడూ రాలేదు . పెద్దవుతున్న కొద్దీ తెలిసింది ఇంక నాన్న రాడని నాన్నను మరిచి పోవాలని.. ఇంకా పెద్దయి కాలేజీకి వచ్చాక తెలిసింది" "నా జీవితంలో నాన్నే లేడని. అలాగే Fix అయ్యా.". అమ్మా ,నేను అంతే! .. మేం ఇద్దరమే!.. " "ఇన్నాళ్ళూ అమ్మ నన్ను చూసుకుంది... ఇప్పుడు అమ్మను నేను చూసుకోవాలనుకున్నాను. అసలు పెళ్ళి చేసుకోవడం కూడా నాకిష్టం లేదు నన్ను , అమ్మను వేరుచేసే పెళ్ళి నా కొద్దు. .." " పెళ్ళికి నాన్న ప్రసక్తి కూడా వస్తుందని నాకు తెలుసు.. అప్పుడు మనం చేయని తప్పుకు సంజాయిషీ ఇచ్చుకోవడమే కాదు, అమ్మ నలుగురి ముందూ తల వంచుకోవడం నేను భరించలేను.." " అమ్మ ఏంటో నాకు తెలుసు , మీకు తెలుసు. తెలియని వారికి, అడిగిన వారికందరికీ నేను చెప్పను.. అసలు నాన్న episode నాకొద్దు, నా జీవితమనే పుస్తకంలో ఆ పేజ్ లేదు.. " "ప్రతి సారీ డాటర్ ఆఫ్ అని రాయడానికి ఎంత ఏడుస్తానో మీకు తెలుసా?" అంటూ ధారగా కారుతున్న కన్నీటిని కడుచుకుంది. ఏదో చెప్పబోతున్న మావయ్యను చేతి సంజ్ఞతోనే ఆపింది.. "ఈ సంబంధం కూడా సౌమ్య వల్ల కుదిరింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని ప్రశ్నలకో మనం పిచ్చి వాళ్ళలా జవాబు చెప్పాల్సి వచ్చేది.. ముందు మనం సౌమ్యకు, వాళ్ళ అమ్మకు Thanks చెప్పుకోవాలి.." "సౌమ్య వాళ్ళ బావ కూడా అబ్బాయి గురించి నాకు చెప్పాడు.. సౌమ్య నాగురించి చెప్పింది. మేం చూసుకోక పోయినా మా గురించి మేం కొంత అవగాహన కొచ్చాం. " "అలా అని మేం డైరెక్ట్ గా ఏం మాట్లాడు కోలేదు, చూసుకోలేదు .. మా నలుగురికీ పెద్దలంటే గౌరవం ఉంది...అందుకే ఇక్కడి దాకా వచ్చాను.." "వాళ్ళందరికీ నాన్న మన దగ్గరుండడని తెలుసు.. అలాగే ఒప్పుకున్నారు కదా!..... మరెందుకు ఇప్పుడు మధ్యలో ఆయన ప్రసక్తి.. బామ్మ చెప్పినట్టు, మీరిద్దరూ భార్యాభర్తలు మీఇష్టం మిమ్మల్ని వేరు చేయడానికి నేనెవర్ని?..." "కానీ ,నా జీవితంలో నాకు 'నాన్న' లేడు , ఆ ప్రసక్తి రానివ్వను, నాన్న వస్తేనే పెళ్ళంటే నాకు పెళ్ళికూడా వద్దు" ...ఏడుస్తూ అయినా గట్టిగా ఖచ్చితమైన స్వరంతో ప్రవల్లిక.. "అయ్యో" అంటూ పెద్దగా ఏడుస్తున్న సంగీత దగ్గరకు పరుగున వచ్చాడు హర్ష. "ఏంటక్కా !ఇదంతా ఎందుకు చెప్పు.. నీ విషయంలో ఎంత Strong ఉన్నావు, ఇప్పుడెందుకింత ఆలోచిస్తున్నావు.. అయినా వాళ్ళడిగితే మాత్రం అక్కడే వద్దని చెప్పకుండా ఇంత ఆలోచించడం అవసరమా?. లేక నీక్కూడా మనసులో ఏదైనా ఆలోచన ఉందా?". అంటున్న హర్షను "హర్షా ఏంటా మాటలు" అన్నారు హరి హర్రావు గారు.. "లేదురా లేదు, నేనెప్పుడూ నా గురించి ఆలోచించ లేదు .. పాపకు నాన్నను దూరంచేసి ఏదైనా లోటు చేసానా ? అని ఇన్నాళ్ళు అనుకునే దాన్ని".... " పెళ్ళి అని అనుకున్నప్పటి నుండీ ఒకటే భయం తండ్రి పేరెత్తి దాన్ని ఎవరైనా అవమానిస్తారేమోనని.. ఇన్నేళ్ళు పువ్వులా పెంచి ఇప్పుడు ఏ ముళ్ళ కంపలోకో తోసేయను కదా! అని ఒకటే భయం. ఆ ఆలోచనలన్నీ ఎటూ నిర్ణయించుకోనివ్వడం లేదురా ..అదే నా బలహీనత.. " అంటూ రాతల్లీ అని ప్రవల్లికను దగ్గరకు తీసుకుంది.. "ప్రపంచంలో నీ కన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదమ్మా.....అమ్మనయిన రోజే భార్య పదం మరుగునపడి పోయింది.. నీ పెళ్ళి మనల్ని ఎలా వేరుచేయకూడదని అనుకుంటున్నావో .. నేను కూడా ఏశక్తి ఏ వ్యక్తి మనల్ని వేరుచేయడని మాటిస్తున్నాను... సరేనా !" .. "నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు" అంటూ ప్రవల్లికను ముద్దు పెట్టుకుంది.. "నేను నీ మాటకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా అమ్మా ?" "లేదు తల్లి " .. "కానీ ఇది మటుకు వద్దమ్మా! " "సరే అలాగే ! నీ కోసమే ఆలోచించాను తల్లీ! అంతే, ఇక దాని గురించి మాట్లాడుకోవద్దు సరేనా? " .. అందరూ అచేతనావస్థలో ఉన్నారు. అందరి కళ్ళూ వర్షిస్తున్నాయి.. తుడుచుకేవాలనే ప్రయత్నమే చేయటం లేదు ఎక్కడి వారక్కడ కూలబడి పోయారు. బామ్మ నిస్సత్తువుగా గోడకి చేరగిలబడింది.. అసలు ఇన్నిరోజులు దీని గురించి ఆలోచించలేదేం ? చిన్నపిల్లే అనుకున్నాం, కానీ దీని చిన్ని మనసులో ఇంత సంఘర్షణా అని అనుకుంటున్నది.. ఇంతలో Phone మోగింది సశేషం...

బాంధవ్యం........ 55

ఒకరి నొకరు  చూసుకున్నారు  లక్ష్మి వెళ్ళి ఫోన్  రిసీవ్  చేసుకుంది.. 
ఒకే  అలాగే చెబుతానండి  One minute  అన్న లక్ష్మి  "గాయత్రి  గారు ఇవాళ  సాయంత్రం  వీలవుతుందా  అంటున్నారు.."
హరిహర్రావు  గారు  వెళ్ళి  మాట్లాడారు  అలాగే  ఇబ్బంది  ఏం  లేదు  వస్తామండి  అని  ఫోన్  పెట్టేసారు... 

"అబ్బాయి  వాళ్ళ  అమ్మ గారు , family అంతా  రండి  మా నాన్నగారు  చూస్తానంటున్నారు.. 
అని  చెప్పారు..సమయం  ఏం   చెప్పలేదు  సాయంత్రం  రమ్మన్నారు.. ఆ ఏర్పాట్లు  చూడండి మరి  .."

నెమ్మదిగా  అనూరాధ గారు  లేచారు  ..
బామ్మ  ఇంకా తేరుకోలేదు.. ఆవిడకు  ఇది  పెద్ద షాక్  గానే  ఉంది.. 

సంగీత లక్ష్మి కూడా లోపలికి  వెళ్ళారు.

హరిహర్రావుగారు  ప్రవల్లికను తన దగ్గర  కూచోపెట్టుకున్నారు.. 

" ఇప్పుడు  OK నా ..మనసులో  ఏమున్నా  బయటకు  చెప్పాలి  నీలో  నువ్వు  కుమిలిపోతే ఎలా...? "

"రేపు  పెళ్ళి అయ్యాక  కూడా  ఇష్టాయిష్టాలు  చెప్పకుండా,  మంచి చెడూ మాట్లాడకుండా , నీ అభిప్రాయాలు చెప్పకుండా  ఉంటే  నువ్వింతే  అని నిన్నెవరూ  పట్టించుకోరు ..నలుగురిలో  మాట్లాడడం  అంటే  అక్కడ మన Participation ఉండడం..అలాగని  అతిగా  మాట్లాడడం కాదు..." 

"నిన్నేదైనా  అడిగితే  చెప్పాలి .. నీకు సంబంధించిన విషయం  అయినప్పుడు  అడగక  పోయినా  చెప్పాలి.. అందులో  తప్పులేదు..  తెలిసిందా?" 

"వాళ్ళింటికి  వెళుతున్నాం  అడిగిన  వాటికి  సమాధానాలు  చెప్పు  సరేనా   వెళ్ళు వెళ్ళి  రెడీ అవ్వు"  అన్నారు   హరి హర్రావుగారు... 

"అమ్మా  వస్తావా  నువ్వు  "..

"నేను  రాలేనురా "అన్నారు  బామ్మ.. 

పెద్ద వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం అని  ముందే  తీసుకొచ్చి ఉంచిన  బట్టలు  పెట్టుకున్నారు .
హర్ష  వెళ్ళి  పళ్ళు  పూలూ స్వీట్స్ తెచ్చాడు.
కాఫీ టిఫిన్లయ్యాక  అందరూ  బయలు దేరారు.. 
.........................................................

ఇంట్లో  వాళ్ళందరూ ఎంతో  ఆప్యాయంగా  ఆదరంగా  ఆహ్వానించారు ...
 పరిచయాలయ్యాక అందరూ అమ్మమ్మ  తాతయ్యగారికి  పాదాభివందనం చేసి  తెచ్చినవి ఇచ్చి  కూర్చున్నారు ..

 ఇంట్లో  వాళ్ళంతా  కుతూహలంగా  ప్రవల్లికనే  చూస్తున్నారు...

"ఈ రోజు  మంచిరోజు  పిల్లలిద్దరూ  చూసుకోవడానికని ఇవాళ రమ్మన్నాం"  అని  చెప్పారు గాయత్రి  గారు. 

అమ్మమ్మ  ప్రవల్లికను  తన పక్కన కూచో పెట్టుకున్నారు ..

పేరు  చదువు  ఉద్యోగం గురించి అడిగారు.. 
"ఫోటో  చూసావా ?" 

"లేదంది" ..

"సరే  కాసేపేయ్యాక చూపిస్తాం లే"  అంటూ  నవ్వింది.. 

"పెళ్ళంటే నువ్వు  అబ్బాయి  మాత్రమే  కాదు   మేమంతా  కూడా నీ  వాళ్ళమే ""

"మీ అమ్మమ్మ, తాతయ్య.. ప్రణవ్  వాళ్ళ  అమ్మమ్మ తాతయ్య మనమంతా  ఒక  పరివారం. 
రేపు  పెళ్ళవగానే  వీళ్ళిద్దరూ  నీకు  అమ్మా  నాన్న  తెలిసిందా.. ప్రణవ్  ఏదైనా అన్నా  మొహమాట  పడకుండా  వీరితో  చెప్పాలి... అమ్మా  నాన్నల  దగ్గర  భయపడకూడదు .... "

"అలాగే మీ అమ్మ  కూడా ప్రణవ్ కి అమ్మే..అమ్మమ్మ , తాతయ్య,  మావయ్య,  అత్త  అందరూ   వాడికి  కూడా  కుటుంబం  లో భాగమే.."

"మా  మూడో కోడలు వాళ్ళ అమ్మానాన్నకు  ఒక్కతే  అమ్మాయి  ..  వాళ్ళ  నాన్నగారు పోయాక  ఆవిడ  ఒంటరిదయిపోయింది , ఇప్పుడావిడ వాళ్ళ  అమ్మాయితోనే ఉంటుంది.." 

"అర్థమయ్యిందా  తల్లీ  నేనేం  చెప్పానో.. 
అందుకని నీకు  అమ్మ  మీద  బెంగ అమ్మగురించిన  భయం  అక్కరలేదు.."  

తాతయ్య హరిహర్రావుగారు కూడా  పరిచయాలయ్యాక మాట్లాడుకున్నారు.

"అమ్మాయి పెళ్ళయ్యి  వెళ్ళిపోయినా  మన రాకపోకలు  ఇక్కడుంటాయి.. మీరసలు  బెంగ  పెట్టుకోవద్దు  మా అమ్మాయి  వాళ్ళ అత్తింటి వేపు కూడా  అందరూ మంచి వాళ్ళు  మా అల్లుడు
 బంగారం .. మీకసలు బెంగక్కరలేదు " అని  చెప్పారు..  

" అబ్బాయికి కూడా అందరినీ  చూపిద్దామని  పిలిపించాం , అని  టైమ్  అయ్యిందా  చూడండి  అబ్బాయికి  మెసేజ్  పెట్టండి  లేచాడా లేదా?"  అని  పిల్లలను  అడిగారు. 

అలాగే  నాన్నా  msg  పెడుతున్నాం  అని  జవాబిచ్చారు.. హరి హర్రావుగారు వాళ్ళందరూ  ఊపిరి  బిగబట్టి చూస్తున్నారు ..
తమ  బంగారుతల్లికి  కాబోయే  జీవిత  భాగస్వామి ఎలా  ఉంటాడా అని...

Skype open చేసారు  Computer ముందర  అమ్మమ్మ  తాతయ్య  మధ్యలో  ప్రవల్లికను  కూచో  పెట్టుకున్నారు ..

On అయ్యింది  అబ్బాయి కనిపించాడు . ప్రవల్లిక  డైరెక్ట్  గా చూడలేక  పోతుంది  హలో  అమ్మమ్మా తాతయ్యా అని  పలకరించాడు.తరువాత అమ్మాయి  వైపు  చూసాడు  కానీ పక్కనుండి  కనబడింది  అమ్మాయి ...
తరువాత  వీళ్ళు  ముగ్గురూ వెనక్కి  వెళ్ళాక  ఒక్కొక్కరిని  పరిచయం చేసాడు  ప్రణవ్  వాళ్ళ  నాన్నగారు.. 

మెల్లిగా  వెనక్కి  వెళ్ళిన  ప్రవల్లిక కంప్యూటర్  వైపు  చూసింది.. గొంతు  బాగుంది  చాలా  బలంగా  గంభీరంగా.. మహేష్  బాబంత  అందంగా లేక  పోయినా  బాగున్నాడను  కుంది...  

ప్రవల్లికను సరిగ్గా  చూడని  ప్రణవ్  కూడా  అప్పుడే  తన  చూపులతో  వెతుకుతూ  ప్రవల్లిక కంట  పడిపోయాడు.  ఇద్దరి చూపులు  కలుసుకున్నాయి  కాసేపు తరువాత   ప్రవల్లికే  మెల్లిగా  పక్కకు  జరిగింది.. 

ఆ కళ్ళలో   ఒక మెరుపు  చూసింది.. 
తన  మనసు  కూడా  కనెక్ట్  అయ్యింది   అందరూ  తమ ఇంట్లో  ఉన్నట్టే  ఉన్నారు..  ప్రేమగా  ఆప్యాయంగా  మాట్లాడుతూ.. 

ఇంతలో  ఎవరో  ప్రవల్లికను నువ్వు  మాట్లాడతావా   అమ్మా ! అని అడిగారు  లేదంది.. 
కాసేపుండి ప్రణవ్ వెళ్ళి  పోయాడు.. 

వీరందరూ కూడా బయలుదేరారు... 

దార్లో  లక్ష్మి , హరిహర్రావు గారు మాత్రమే  మాట్లాడారు నిశ్చితార్థం  గురించి.. 

ఇంటికొచ్చాక  ప్రవల్లిక సంగీత  మామూలుగానే  ఉన్నారు.. కబుర్లన్నీ లక్ష్మే  చెప్పింది..  

బామ్మ కి  చాలా  సంతోషం  వేసింది.. 
ప్రవల్లికను  అడిగింది  'నచ్చాడా 'అని  తలూపింది  అంతే ..

 సంగీతకు  ఆనందమో,  ఉద్వేగమో,  తెలీదు  ఒక  పక్క భయం కూడా  తనను మూగదాన్ని చేస్తున్నది. 
ఇదంతా  నిజమేనా  లోకంలో  ఇంత  మంచి  వాళ్ళుంటారా.  నాటకాలు  కాదు కదా ? 
పెళ్ళి అయ్యాక  ఏం బాధ పెట్టరు  కదా  ..
అబ్బాయి పెళ్ళి  చేసుకున్నాక  మారిపోడు  కదా  అని  పిచ్చి  పిచ్చి  ఆలోచనలతో  అబ్బాయిని  చూసిన  ఆనందాన్ని   ఆస్వాదించలేక  పోయింది... 

 తెల్ల  వారి  ఆఫీస్ కెళ్ళాక అన్ని  విషయాలు  సౌమ్యకు  చెప్పింది  ప్రవల్లిక..

"నచ్చాడా  మరి " అడిగింది  

'ఊ 'అంది.. 

"అవును  బావ  చెప్పాడు  వాళ్ళ  తమ్ముడికి  కూడా  నువ్వు  నచ్చావట  .ఎక్కువ  ఆటిట్యూడ్  లేకుండా  సింపుల్ గా  ఉంది  సంథింగ్  డిఫరెంట్  అన్నాడట.." 

"Cool  Baby  Cool " అంది  ప్రవల్లిక.. 

"Happy Dear..  నాకు  చాలా  సంతోషంగా ఉంది 
 Future  గురించి  ఆలోచిస్తుంటే  అందంగా  కనబడుతుంది" అంది  సౌమ్య ..

' తథాస్తు '
అలాగే  వారి  భవిష్యత్తు అందంగా ఉండి , వారు  ఆనందంగా  ఉండాలని  కోరుకుందాం..

సశేషం

బాంధవ్యం...... 56

హరిహర్రావు  గారింట్లో  అందరూ   రొటీన్ లో  పడ్డారు.. 
కానీ  సందడి  మగ పెళ్ళి  వాళ్ళింటిలో  మొగలయ్యింది.. 'ప్రణవ్ ప్రవల్లిక 'వాళ్ళ కంటే  ముందు  'సౌమ్య వరుణ్  'ల పెళ్ళి జరగాలి.   
చిన్నవాడికి  కూడా  అమ్మాయి  కుదిరే  ఉంది  కాబట్టి  రెండూ  ఒకే సారి  చేయడం  మంచింది 

 అది  కూడా  చక్కగా  ఇద్దరూ  ఒకరి  పెళ్ళి  ఒకరు  చూసుకునే లాగా   మధ్యలో  gap ఉండే  లా చూసుకుని.. అనుకున్నారు.. 

నిశ్చితార్థం  అయితేనే  కానీ ముహూర్తం  పెట్టుకోలేం కదా! ఆ  సంగతి  చూడండి  అని  పెద్ద  వాళ్ళు  అడగడం 
పిల్లలు ఒకరినొకరు సంప్రదించుకుని పెళ్ళి డిశంబరు  లో అయితే  OK  అనడం  అయ్యింది.  మరి  నిశ్చితార్థం  ఎలాగ.  అదవుతే  గానీ  పనులు  సాగవు  కదా... 

పండితులను  అడిగారు..  అమ్మాయికి  నిశ్చితార్థం  ముఖ్యం..  అందుకని  అమ్మాయికి  ముందు  చేసి  తాంబూలాలు  ఇచ్చి పుచ్చుకుని పెళ్ళి  పత్రికలు   రాసుకోండి. అబ్బాయికి  పెళ్ళ కి నాలుగు  రోజుల ముందు  చేసినా చాలని  చెప్పారు.. 

అలాగే  నిశ్చితార్థం ముహుర్తాలు పది రోజుల తరువాత ఇద్దరు  పిల్లలకు  4 రోజుల  తేడాతో  పెట్టించారు ..

అంతే  ఇక్కడ  కూడా  సందడి  మొదలయ్యింది... 

సౌమ్య బంధువే  కావడం అందరూ  చూసిన వారే  కావడంతో  అందరికీ  ప్రవల్లిక మీదే  ద్రుష్టి.  చూడాలని  ఆరాటం.. 

బంధువులందరికీ  ఫోన్లు చేసి పిలవడం  మొదలు  పెట్టారు.....

పాపం మళ్ళీ  సంగీత  తన  సంతోషాన్ని నొక్కి పెట్టి ఆడబడుచులింటికి బయలుదేరింది... 

ఇద్దరిళ్ళకీ వెళ్ళి పిలిచింది . వనిత,సతీష్ గురించి ఏం  అడగలేదు. అబ్బాయి  గురించి  మాత్రమే అడిగింది.. 
శ్రీధర్  ముందే  చెప్పాడు..  వినడమే  తప్ప  ఏం  అడగ కూడదని.. 

కానీ లలిత  వెంటనే  అడిగింది.... 

"సతీష్ కి చెప్పావా?  అని.. 

ఏం  చెప్పాలో  తెలీలేదు.నిజం చెప్పి  పాపను వాళ్ళ  ద్రుష్టి లో  చెడ్డదాన్ని చేయనా ? 
అది  అలా  మాట్లాడిందంటే అసలు  వీళ్ళు  నమ్ముతారా.. ఎందుకులే తనమీదే  వేసుకుంటే  సరిపోతుంది .. అనుకుని 

"లేదొదినా  చెప్పలేదు..మీరు పెళ్ళి విషయం  చెప్పాకయినా  ప్రవల్లికను  పలకరించలేదు.. నేనంటే  సరే  కనీసం  దానితో  కూడా  మాట్లాడక  పోతే  ఎలాగ .."

"అయినా  పెళ్ళి వాళ్ళకు  తెలుసుగా , వాళ్ళ నాన్న  మాతో  ఉండరని మళ్ళీ  ఇప్పుడు  కొత్తగా  చెప్పేదేం  ఉంది..  ఇన్నేళ్ళుగా  మా మంచీ  చెడ్డా పట్టించుకోని  మనిషి ఇప్పుడు  రమ్మంటే  వస్తారా?
కడుపులో  లేని  ప్రేమ  కావలించుకుంటే  మాత్రం  వస్తుందా  వద్దు లెండి "  అని  చెప్పింది.. 

లలిత  ఏం  మాట్లాడకపోయినా  ఆవిడ  మొహంలో  కోపం, బాధ  రెండూ  కనబడుతున్నాయి... 

ఏం  అయినా  అనుకోనీ  బాధపడనీ  తను  చెప్పదలుచుకున్నది  చెప్పింది  ఇన్నాళ్ళూ లేనిది  ఇప్పుడు  కొత్తగా  ఎందుకు  అసలు  ఆయన మొహమే  మరిచి పోయింది ..

తరువాత ఎవరూ ఎక్కువ  మాట్లాడుకోలేదు  కాసేపాగి సంగీత  బయలుదేరి  వచ్చింది..  నిశ్చితార్థం  ఏర్పాట్లలో  పడిపోయింది  

అనూరాధతో  కలిసి  కొంత  లక్ష్మీ  తను కలిసి కొంత  shopping చేసారు ..

ఆరోజు  అందరూ  ఖాళీగా కూచున్నప్పుడు  
లక్ష్మి  అంది " వదినా   సౌమ్య  function  లో  ప్రవల్లిక ఏ డ్రస్  వేసుకుంటుంది  చీర  కట్టుకోవాలి  కదా  "

"అవును "

"అందుకని  ఆ ఫంక్షన్  కోసం  ఒక  మంచి  latest చీర  కొందామా .."

"ఎందుకు తనకున్నాయి  కదా "

"లేదు  వదినా  రేపక్కడ  అందరూ  సౌమ్యతో పాటు, 
కాదు  కాదు సౌమ్య  కంటే  కూడా  మనమ్మాయిని  చూస్తారు .. కొత్త  చీర  తీసుకుంటే  బాగుంటుంది "

"ఓ అవునా. "

"అవునొదినా వెళదామా.. "

సరేనని  హుషారుగా  బయలుదేరారు.
Traditional గా  ఉంటూనే  Fancyగా ఉండే  చీర  కోసం  చూస్తున్నారు.. 

ఇంతలో  షాపు లోకి వస్తూ జ్యోతి కనబడింది...

అంతే  మూడాఫ్   అయిపోయిన  సంగీత సెలక్షన్  మీద  మనసు  పెట్టలేక  పోయింది ...
అద్రుష్టం జ్యోతి  ఇటు  రాలేదు..  వేరే  సెక్షన్ లోకి  వెళ్ళింది  కానీ సంగీత  ఎందుకో  తేరుకోలేక  పోయింది .. ఇంత  మంచి మూడ్ లో ఈవిడెందుకు  కనబడడం  అనుకుంది  ..

కానీ  జ్యోతి గురించి   లక్ష్మికి ఏం  చెప్పలేదు.. 
ఇంటికొచ్చి కూడా  ఎవరికి ఏంచెప్పలేదు  
గతం  గత:   అనుకుంది.. 
ఎవరి సంతోషాన్ని  పాడుచేసే  హక్కు   తనకు  లేదు..
...........................................

ఆరోజు నిశ్చితార్థం, సౌమ్య  వాళ్ళ  ఇంటికి వెళ్ళే రోజు  రానే  వచ్చింది. సింపుల్ గా ముస్తాబైనా ప్రవల్లికకు చీర అందాన్నిచ్చింది... లక్ష్మికి  తెలుసు  అక్కడ  అందరి  ద్రుష్టి   ప్రవల్లిక మీద  ఉంటుందని  అందుకే చక్కగా  రెడీ చేసింది...
 
అందరూ  కలిసి  సౌమ్య  వాళ్ళింటికి కాస్త  ముందు  గానే  వెళ్లారు..లక్ష్మి  ఊహించినట్టుగానే  అందరి  చూపూ   ప్రవల్లికపైనే.. 

పెద్ద వాళ్ళంతా  సంగీతను  ఎంతో  ఆరాధనగా  చూస్తున్నారు  సంగీతకు  అర్థంకాలేదు ..

 నిశ్చితార్థం మొదలు కాగానే వరుణ్  Skype లోకి వచ్చాడు  సరదా  సరదా  కామెంట్లతో  కార్యక్రమం  జరుగుతుంటే  సౌమ్య ప్రవల్లికను  పరిచయం చేసింది  ప్రవల్లిక తనకు  తెలీకుండానే  నమస్కారం  చేసింది 
 
ఇద్దరు మనుషులను దగ్గర  చేసేది   దూరం చేసేది  మాటే  కదూ.  వీళ్ళిద్దరి  వలన  నేను భయపడినంతగా  నా జీవితం  ఉండబోవటం  లేదు  అని  ఖచ్చితంగా  తెలుస్తున్నది.. 

ఇంతలో  ప్రణవ్  కూడా  వచ్చాడు Skype లోకి ..
వదినను ఆట పట్టిస్తూ  మాట్లాడుతుంటే  సౌమ్య  పక్కన  కూచున్న  ప్రవల్లిక వెళ్ళ బోయింది ,సౌమ్య  ఆపింది.. 

" నీకు  లేక పోయినా  ప్రణవ్ కి  చూడాలని  ఉంటుంది కదా  కూచో  " అని  నెమ్మదిగా  అంది.. 

హలో  ప్రణవ్   అమ్మాయి  బాగుంది   అని  అందరూ అంటుంటే   ఇంటిల్లిపాది  సంతోష పడి  పోయారు..
ప్రణవ్  సిగ్గుపడ్డాడు.  

కార్యక్రమం  పూర్తవగానే  పెళ్ళి కొడుకులిద్దరూ Skype  Off  చేసుకున్నారు .

భోజనాలయి  గదిలో  కూచున్నప్పుడు  కొంత  మంది  తనని  చూడడం  చాలా  ఇబ్బందిగా  feel అయ్యింది  సంగీత.. కానీ  ఏం  చేయలేదు.. 

ఇంతలో  గాయత్రి గారు ఒకావిడను మా చిన్నవదినకు  తోడికోడలు  ..అంటూ  పరిచయం  చేసింది .

"నమస్కారమండి ,నా పేరు  శైలజ  ..ఇందాకటి  నుండి  మిమ్మల్ని చూడాలని  మీతో  మాట్లాడాలని  అనుకుంటున్నాం ..కానీ  వదిన  బిజీగా  ఉంది కదా..

"అయ్యో  దాంట్లో  ఏముంది  పరిచయం  చేసుకునే  వాళ్ళం  కదా " అంది  సంగీత.. 

"మీరు  చాలా  గ్రేట్  అండి అసలు  ఒక్కరే  ఉద్యోగం చేస్తూ  అమ్మాయిని  ఎంత బాగా  పెంచారు  ఎంత  బాగా  చదివించారు..  చాలా  నెమ్మదిగా  ఉంది మీ అమ్మాయి  .."

"మాకందరికీ  కూడా నచ్చింది . మీ అమ్మాయి  కంటే  కూడా  మీరు  బాగా  నచ్చారు.."   అంటూ అందరూ తనను  ఆకాశానికి  ఎత్తేస్తుంటే కలలా  అనిపించింది

 తరువాత  తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుని ముహూర్తం  నిర్ణయంచేసుకుని  పత్రికలు  రాసుకుని అవి  కూడా ఇచ్చి పుచ్చుకున్నారు ..

  ఇంటికి  బయలుదేరి  వస్తుంటే   ప్రవల్లిక అడిగింది  ..

"ఏంటమ్మా  ఆ గదిలో  నీతో  అంత  మంది ...
ఏం మాట్లాడుకున్నారు .."

ఏం లేదు.. 

"ఈ లోకంలో  అందరూ  మనం  భయపడేంత చెడ్డవారు  కాదు  ..  మనం  మన  ఆలోచనలు  మార్చు కోవాలేమో  తల్లి.. "
"ఒక  మాట  ఒక మనిషిని  చెడ్డవారిని చేస్తుంది మంచి  వారిగా  మారుస్తుంది.. "

"అలాగే  ఒక  మాటతో  మనం  ఎదుటి  వారిని మంచి వారిగా చిత్రీకరించ వచ్చు  లేదా చెడుగా ..
అని  తెలుసుకున్నాను.. "అంతే  

 ఎవరికి ఏం  అర్థం  కాకపోయినా  అందరూ  విన్నారు 

సశేషం


బాంధవ్యం...... 57

అందరూ ఎదురు చూసిన నిశ్చితార్థం రోజు రానే వచ్చింది....బంగారు  తల్లి  ముస్తాబయ్యింది... 
అందరి  కన్నా బామ్మ  కళ్ళలో  ఆనందం  చూసి  తీరాల్సిందే.. 

"మునిమనవరాలు పెళ్ళి చూడ్డమంటే  మాటలు  కాదు .. నేను చాలా అద్రుష్టం  చేసుకున్నాను.
నా దిష్టే  తగిలేలాగా  ఉంది"  అని  పిల్లకు  దిష్టి  తీయించింది.. 

తరువాత ఆనందం అంతా  సంగీతదే..ఆగని  ఆనంద  భాష్పాలు...మనసులో సంతోష తరంగాలు ,
ఒళ్ళంతా ఉద్విగ్నతతో  వణుకుతున్నది. 

"కోరిక తీర్చుకుని వెళ్ళినట్టుగా  పెళ్ళికి, బంధానికి  విలువ నివ్వకుండా బాధ్యతల నుండి పారిపోయాడు...కన్న పేగునాది కదూ , బిడ్డకు పాలిచ్చి ఆకలి  తీర్చాను , మరి మిగతా బాధ్యతలు  కూడా  నాకే  ఇచ్చాడు ఆ భగవంతుడు".. అనుకుంది ..

నా అద్రుష్టం  ఏముంది  పిచ్చి  అద్రుష్టం ..
అంతా  అది  చేసుకున్న  పుణ్యం,  పూజ  కొద్దీ  పురుషుడంటారు..  బంగారు  పూలతో  పూజ  చేసుకుందేమో మంచి  భర్త  దొరికాడు.. 

దాని జీవితం  చల్లగా  సాగిపోతే  చాలు ..
భార్యాభర్తలు కలిసుంటే  ఎన్ని కష్టాలైనా  ఎదురుకోవచ్చు...అనుకుంటూ పెళ్ళివారి  కోసం  ఎదురు చూస్తుంటే  రానే  వచ్చారు.. 

సౌమ్య  హడావిడి చెప్పక్కరలేదు  అటువైపు  ఇటువైపు అంతా  తానై  తిరిగింది.. 

గాయత్రిగారు  కాబోయే కోడలిని చూసి  మురిసి పోయారు.. "ఎంత  బాగున్నావో   ఈ ముదురాకు  పచ్చ చీరలో.. అమ్మమ్మ  చెప్పారు  ఈ రంగులో  తెమ్మని,  బాగుందా! నీకు  నచ్చిందా " అని  అడుగుతుంటే  
ప్రవల్లిక  కళ్ళు  నీటికుండలే  అయ్యాయి.. 

 ప్రణవ్  Skype లోకి వచ్చి చూసాడు.  కానీ  కాసేపే ఉండి  వెళ్ళిపోయాడు.. చాలా  మొహమాటస్తుడు, సిగ్గరి లాగా  అనిపించాడు.. ఎవరూ  బలవంత పెట్టలేదు.. 

అనూరాధ హరి హర్రావుగారు  పీటల మీద  కూచుని  నిశ్చితార్థం జరిపించారు.. తరువాత తాంబూలాలతో పాటు  పెళ్ళి పత్రికలు కూడా  ఇచ్చి  పుచ్చుకున్నారు.. 

December  6 Th న  సౌమ్య వరుణ్  లకు,
Dec 16th న ప్రవల్లిక ప్రవీణ్  లకు వివాహం నిశ్చయమైంది. 
సరిగ్గా పదిరోజుల  తేడాతో  వారనుకున్నట్టుగా  ముహూర్తం  కూడా  కుదిరింది.. సంతోషం మూట  కట్టుకుని  పెళ్ళి వారందరూ   వెళ్ళారు...
 
ఆడపడుచులు  రాలేదనే  తప్ప  అంతా  బాగానే  జరిగింది.. 

"వారికి బాధ ఉండడం, వారు బాధపడడం అది  సహజం  నువ్వుకూడా  బాధ పడొద్దు"  అంది  అనూరాధ... 

ఇక  వినాయకుడికి పూజ  చేసుకుని వెంట వెంటనే పెళ్ళి పనులు  మొదలు  పెట్టారు ..

పత్రికలు  ప్రింటింగ్ కి  లక్ష్మీ  హర్ష  సంగీత  ప్రవల్లిక నలుగురు కలిసి  సెలెక్ట్  చేసి  ఇచ్చి వచ్చారు.. 

హరిహర్రవుగారు  వెళ్ళి బ్రహ్మగారిని  మాట్లాడి  వచ్చారు.. యాజ్ఞీకం  సరుకులన్నీ  ఆయన , అనూరాధ గారు చూసుకుంటామన్నారు..

పిలుపులు  అందరూ  కలిసి  పిలిచే  లాగా  ప్లాన్  వేసుకున్నారు ..ఇక  మిగిలింది బట్టలు.. 

టైమ్ చాలా ఉంద,ి లీజర్ గా  అన్ని చోట్లకు  వెళ్ళి  చూసి  latest వి తీసుకోవాలని లక్ష్మి  ఆరాటం  
సంగీతది కూడా  అంతే.

చిన్నప్పటి నుండి  తనకూతురు  నలుగురిలో  ప్రత్యేకంగా  ఉండాలని  వెతికి  వెతికి  బట్టలు  కొనేది 
ఒక్కోసారి  తనే  డిజైన్  చేసేది.. బట్టల  విషయంలో  ఎక్కడా కాంప్రమైజ్  అయ్యేది  కాదు.. 

ప్రతి శని ఆది వారాలు  Shopping పెట్టుకున్నారు..
నాలుగు  వారాలు చీరల కొనడంతో  అయిపోయింది
 
ఇక  పిలుపులు   మొదలయ్యాయి  ఏరియా  Wise deside చేసుకుని  పిలుపులు మొదలు  పెట్టారు ..

ప్రతి వారూ సంగీతను  పొగడడమే ,  ఎంత  కష్టపడి  పెంచావమ్మా  బిడ్డను నీ కష్టానికి  ఫలితం  దక్కింది  అంటూ.. 
ఆరోజుతో పిలుపులన్నీ పూర్తయ్యాయి ..
ఇక  ఇంట్లో  పనులు  పెట్టుకున్నారు 

ఒక  రోజు పెళ్ళి వారింటి నుండి ఫోన్ ...

 "ప్రణవ్   వరుణ్  కంటే  ముందే  వస్తున్నాడని  అతనికి  సెలవు ముందే  దొరికిందని.. 
బహుశా  28th నవంబర్  రావచ్చు .. ముందుగా  ఒకసారి  అమ్మాయిని చూపించి  నిశ్చితార్థం  పెట్టుకుందాం అన్న  గాయత్రితో  అలాగే  అన్నారు.. 

పెళ్ళివారంతా  పెళ్ళి  కొడుకుల  రాక కోసం  ఎదురు  చూస్తున్నారు..  వారితో  పాటే  మనం  కూడా చూద్దామా

సశేషం 

  బాంధవ్యం....... 58

అందరూ ఆత్రంగా  ఆరాటంగా ఎదురు  చూస్తున్న రోజు  రానే వచ్చింది... 

ఆరోజు  రాత్రి  10.30  కల్లా  ఇంటికి  చేరి  పోయాడు  ప్రణవ్..  కాబోయే  పెళ్ళికొడుకును చూసి ఇంట్లో  అందరూ మురిసి  పోయారు..

కాస్త  రిలాక్స్  కాగానే  నరసింహారావు  గారు హరిహర్రావుగారింటికి  ఫోన్  చేసి  రేపు  సాయంత్రం 4 గంటలకు అమ్మాయిని చూడడానికి  వస్తున్నట్టు  చెప్పి , ప్రణవ్ తో  మాట్లాడించారు..  

" నమస్కారం తాతయ్యగారు అంటూ అటూ  ఇటూ చూస్తూ  కుశల ప్రశ్నలయ్యాక  ఆంటీ ఉన్నారా ? అనడిగాడు.. 

"ఆంటీ కాదు  అత్తయ్య "అని  వాళ్ళమ్మగారు వెనకనుండి అనడం  వినిపించింది.. 

సారీ  తాతయ్యగారు ! అత్తయ్యతో  మాట్లాడిస్తారా  అని అడిగాడు .

 "లేదు బాబు వాళ్ళు అక్కడ  వాళ్ళింట్లో  ఉన్నారు" అని చెప్పారు... 

"బామ్మా! అమ్మమ్మ ,పిన్నీ , బాబయ్ అందరూ  బాగున్నారు కదా?  బాబు ఎలా  ఉన్నాడు"అని  అందరినీ  పేరు  పేరునా  అడిగాడు.. 

"Ok  తాతాయ్యా రేపు కలుద్దాం అయితే " అని  ఫోన్ పెట్టేసాడు... 

"తల్లి దండ్రులు  ఇంట్లో  పెద్దవారు  నేర్పిన  సంస్కారం  అది . మనం తమ కుటుంబ సభ్యులం  అనుకున్నారు  కనుకే  పిల్లాడు  రాగానే  మనతో  మాట్లాడించారు.. ఏదీ పెంపకం అంటే  " అని  బామ్మ  తెగ  మురిసిపోయింది.. 

ఈ సారి సంగీత  వాళ్ళింటికి గాయత్రి  ఫోన్ చేసింది . ప్రవల్లిక ఫోన్  ఎత్తింది  ..

"హలో  ప్రవల్లికా  ఎలా ఉన్నావమ్మా  భోంచేసారా? ..
పడుకోలేదు  కదా..!  

" లేదత్తయ్యా "అంది 
"నాకు  తెలుసుకదా  ప్రణవ్  వస్తాడని.. 
వచ్చుంటాడు అందుకే  చేసుంటారు అని  మనసులో  అనుకుంటున్నదల్లా .."
 "ప్రణవ్  వచ్చాడు  మాట్లాడతావా ? అని  అడిగింది  ఏమనాలో తెలియని  అయోమయంలో 'ఊ 'అంది  .

"హాలో "బాగున్నావా ?

"ఊ.. మీరెలా ఉన్నారు.?" 

"రేపు  కలుస్తున్నాం కదా!  నువ్వే  చూసి  చెప్పు" 

"ఫరవాలేదు మాటలొచ్చన్న  మాట." 

"ఇక్కడికి  వచ్చే ముందే  నేర్చుకున్నా తెలుసా?. 
అంటూ  అత్తయ్య  తో మాట్లాడాలి."
 "అలాగే "
సంగీత రిసీవర్  తీసుకుంది.. 

"హలో " అనగానే ,
"హలో  అత్తయ్య ! బాగున్నారా?. 
ఇందాకే   10 30 కి  వచ్చాను "

"బాగున్నాను ,మీరు  బాగున్నారా ?" 

"అయ్యో మీరు అనకండి , అంటూ "అమ్మ  మాట్లాడుతుందిట" అని  గాయత్రికి  ఇచ్చాడు 

" సంగీత గారు ! రేపు సాయంత్రం 4 గంటలకు  మేం  రావలనుకుంటున్నాం.  ఎల్లుండి  నిశ్చితార్థం  అయిపోతే  వాడికి జెట్  లాక్ తగ్గాక shopping చేసుకుంటాడు..  అన్నారు 

 అలాగే నిర్ణయించుకుని  ఫోన్  పెట్టేసారు.. 
ఎప్పుడు తెల్లవారుతుందా   ఎప్పుడెప్పుడు చూస్తామా  అని  అందరికీ ఆరాటమే ..

అనుకున్న   సమయం రానే  వచ్చింది.. 
గాయత్రిగారు ,నరసింహారావు , ప్రణవ్ వాళ్ళ అక్క, కజిన్ తో  వచ్చారు.. 

లోపలికి  వస్తున్న  ప్రణవ్ నే  అందరూ చూస్తున్నారు.  ఎవరికీ  కొత్తగా  అనిపించలేదు  కానీ గులాబీ రంగులో  మెరిసి పోతున్నాడు. 

ప్రణవ్  కాస్త  సిగ్గరేమో  అనుకున్నారు  కానీ  వస్తూనే  అందరినీ  పలకరించి  తాతయ్యకు  అమ్మమ్మకు బామ్మ కాళ్ళకు  దండం పెట్టి ,సంగీత  దగ్గరకొచ్చాడు  ..

సంగీ  తల్లి  మనసు ఉప్పొంగుతున్నది , ప్రవల్లిక కు కాబోయే భర్త అని కాదు,   తనకే కొడుకు  లాగా అనిపిస్తున్నాడు. ఎక్కడో  ఏదో  బంధం  తమ  మధ్య  ఉన్నట్టనిపిస్తున్నది .. తప్పిపోయిన కొడుకు  తిరిగి  వచ్చిన  భావన.. 

హలో అత్తయ్యా!  అని  కాళ్ళకు  దండం  పెడుతుంటే   ఒకడుగు  వెనక్కి  వేసి  లేపింది  ..
కుడి  చేయి  ముందుకు  చాచి   సంగీత  చేయి  అందుకుని  నొక్కి  వదిలేసాడు. 

ప్రవల్లికను  చూడడానికి మాత్రం  సిగ్గు పడుతున్నాడు  'హలో ' అన్నాడు అంతే.. 

 సంగీతకు  చాలా త్రుప్తిగా ఉంది. ఎవరో  పెళ్ళి  కొడుకు అన్నట్టు కాకుండా మనసుకు  దగ్గరగా  ఆత్మీయుడిగా  అనిపించాడు.. అందరికీ  నచ్చాడు..  

అబ్బాయి  మొహమాటం  గమనించిన  లక్ష్మి వాళ్ళిద్దరని తమ గదిలోకి   తీసుకెళ్ళింది..

పది నిముషాల తరువాత ఇద్దరూ ఏం  మాట్లాడుకున్నారో మరి  సంతోషంగా బయట కొచ్చారు.. 

"కాస్త  ఛేంజ్  గా ఉంటుందని తనతోకాసేపు గడపొచ్చన్నట్టుగా  అబ్బాయి  నిశ్చితార్థానికి  కావలసిన  డ్రస్  కొనడానికి  shopping  కి  బయలుదేరమన్నారు"హరిహర్రావుగారు

లక్ష్మి  హర్ష ప్రవల్లిక బయలు  దేరుతుంటే 
గాయత్రి గారు  సంగీతను  కూడా  రమ్మన్నారు.. 
అందరూ  కలిసి  వెళ్ళారు.. 

సంగీత ముందుగానే హర్షతో  చెప్పింది డబ్బు కోసం  చూడొద్దు  తనకు  నచ్చినది తీసుకోమని..

పెద్ద వాళ్ళు అందరూ సిట్టింగ్ ఏరియాలో  కూచున్నారు.  పిల్లలు  సెలెక్ట్  చేసుకుంటున్నారు  సెలక్ట్  అయ్యాక ప్రవల్లిక  వీరి  దగ్గర  కొచ్చింది... హర్ష బిల్ కట్టడానికి  వెళ్ళాడు 

ప్రణవ్  గబగబా  సంగీత  దగ్గర  కొచ్చాడు  ..
డ్రస్  చూపిస్తూ " బాగుందా  అత్తయ్యా. ఇది  నాకు  చాలా  నచ్చింది మీకెలా  ఉంది  అనడిగాడు.. 

"బాగుందమ్మ  చాలా  బాగుంది  అంటూ   matching  shoes  కూడా  కొనుక్కోకూడదూ" అంది 
"బోల్డున్నాయత్తయ్యా  "...
 "ఇప్పుడొద్దు లెండి  వాళ్ళు  అక్కడివే  కొంటారు.." అని  గాయత్రి  కూడా  అనడంతో   ఊరుకుంది .

 ఆ రాత్రి  హోటల్  లో  డిన్నర్  చేసి  ఇంటి కెళ్ళారు..

తెల్లవారి  బామ్మ  ప్రవల్లిక  తప్ప  మిగతా  వారంతా  నరసింహారావు  గారింటికి  వెళ్ళారు.. 

కార్యక్రమం  చాలా  సింపుల్  గా జరిగినా  మనసునిండా  ఆనందం  నింపుకున్నారు..  

పెళ్ళి  బట్టలకు  డబ్బులిస్తుంటే  "వద్దండి  మనం సరదాగా  అందరం  కలిసి  వెళదాం.. అని  గాయత్రి గారంటే

"అత్తయ్య  డ్రసెస్  విషయం లో  కొంచం particular అటకదా  ప్రవల్లిక చెప్పింది , ఎంత సేపు ఒకరోజులో  అయిపోతుంది  అన్నాడు.. 

" అలాగే  మీ ఇష్టం " అన్నాడు  హర్ష  ...

సంగీతకు జరగుతున్నదంతా  ఆశ్చర్యంగా ఉంది .
 కలా నిజమా  అనుకుంటూ ఇంటి కొచ్చింది ..

లక్ష్మి జరిగినవన్నీ  బామ్మకు  చెప్పింది.. 
ప్రవల్లిక కూడా  ఆశ్చర్య  పోయింది.. 

సౌమ్యకు  మెసేజ్  చేసింది  తరువాత  Phone  లో   మాట్లాడింది ..

"ఏంటో  మా ఇంట్లో  అందరికీ  మహా  ఆశ్చర్యంగా ఉంది . పరిచయం లేని మనిషి పెళ్ళి అనగానే  ఇంతలా  కలిసి పోతాడా అని "

"నిజమే! వాళ్ళంతే , అదీకాక  నేను,  అమ్మ, బావా విషయాలన్నీ అత్తయ్య తో చెప్పేసరికి మావయ్య  రోజూ  ప్రణవ్ కి క్లాస్ తీసుకోవడమే  అట "

" ప్రవల్లికతో పాటు అత్తయ్యను  కూడా  చూసుకోవలసిన బాధ్యత నీదే,  ఆవిడకు  నువ్వే కొడుకువి  ప్రవల్లిక కన్నా నీకే బాధ్యత  ఎక్కువ.."

"ఎప్పుడూ ఆవిడ మనసు  బాధ పెట్టకూడదు ..
ఆవిడ  బాధపడితే  ప్రవల్లిక  బాధ  పడుతుంది  అందుకని   ఇద్దరినీ  సంతోషంగా ఉంచాల్సిన  బాధ్యత  కూడా నీదే " అని.. 

"చాలా  Thanks  సౌమ్య... ప్రణవ్ అమ్మతో   అలా  ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది  .."

"అన్నట్టు రేపు ప్రణవ్ బట్టల Shopping కి  వెళుతున్నాం అలాగే  రేపటి  సంగతులతో  మళ్ళీ   కలుద్దాం "  అంటూ  Phone  పెట్టేసింది.. 

సశేషం

బాంధవ్యం...... 59

 ఎంత  లేదన్నా షాపింగ్  అంటే  3, 4 గంటలు  పడుతుంది  అందుకనే  పొద్దున్నే  11గంటలకు బయలుదేరాలని నిశ్చయించుకున్నారు.. 

గాయత్రి  గారుఫోన్  చేసి " మిమ్మల్ని  పికప్  చేసుకుంటా" మన్నారు.

"సరే  అయితే  భోజనానికి వచ్చేయండి మరి" అన్నది  అనూరాధ.. 

"ఆ ఫార్మాలటీస్ అవీ వద్దండీ, మీరురెడీగా  ఉంటే  బయలుదేరుదాం..  అన్నారు 

లక్ష్మి  ఆఫీస్  కి వెళతానన్నా వద్దని ఆపేశారు. 
వారు  నలుగురు వచ్చేసరికి  వీళ్ళు నలుగురు  రెడీగా  ఉండి బయలు దేరారు.. 

పిల్లల trend నాకు  తెలీదు  అన్నారు నరసింహారావు గారు... Indiaలో నాకూ తెలీదు అన్నాడు  ప్రణవ్ , 
ఇక  మిగిలింది హర్ష .. తననే  follow అయ్యారు.. 

పెళ్ళయితే  ఎలా  ఉంటాడో  తెలీదు  కాని  ప్రవల్లికతో  చాలా  మొహమాటంగా  ఉంటున్నాడు ప్రణవ్ .. 

మాల్ కి చేరుకున్నాక , మనపని  కాదు అన్నట్టు  నరసింహారావుగారు, గాయత్రి ,సంగీత  ఒక  పక్కన కూచున్నారు.. 

పిల్లలందరూ కలిసి సెలక్ట్  చేసినవి  అన్నీ  పక్కన  పెట్టారు  ఇప్పుడందులో  4 జతలు  తీయాలి  ..
ప్రణవ్ ప్రవల్లికకి  చెప్పాడు అత్తయ్యను పిలవమని.. 
సంగీత  సిగ్గుపడిపోయింది.. నిజంగానే  నేను  సెలెక్ట్  చేయాలా  అని.. 

"వెళ్ళండి  సంగీతా ! ఫరవాలేదు సెలక్షన్  తెలిసినప్పుడు  చేయడంలో తప్పులేదు.. 
ఇప్పుడే  మన  మాట  వినేది  తరువాత  పెళ్ళాం  మాట  వినక  తప్పదు  ఇచ్చిన  అవకాశం  వదులుకోకండి " అన్నారు గాయత్రి గారు  నవ్వుతూ.. 

మొహమాట పడుతూనేే  వెళ్ళింది .. కానీ  అక్కడికి   వెళ్ళాక పరిసరాలు  మరిచిపోయింది .. అన్ని Shirts ఒకసారి  చూసింది ..

పాప చీరలకు  ఈ రెండు  మాచ్  అవుతాయి,  కానీ  ఈ రెండూ వేరే  తీసుకోకూడదు అని  అంటూనే
రెండు  కలర్స్  చెప్పింది. రెండూ చూపించారు
అందులో  ఒకటి  సెలెక్ట్  చేసింది . ఇంకోటి  రిసెప్షన్  కి  కొంచెం  rich  look ఉండాలని  చెప్పి  ఒక డ్రస్ సెలెక్ట్  చేసివచ్చి  కూచుంది.. 

నరసింహారావు గారు వెళ్ళి  హర్షను కూడా సెలెక్ట్  చేసుకోమన్నారు. మేనమామకు  బట్టలు పెట్టాలికదా మీరు తీసుకోవాలి అంటూ  ఆ  పని  కూడా  కానిచ్చేసారు.. 

పక్కన  హోటల్ కెళ్ళి  కాఫీలు  తాగి ఇంటికి  బయలు దేరారు.. 

దారంతా సంగీత  ఏం మాట్లాడలేదు. 
అర్థం  అయ్యీ కానట్టుంది.. నేను  కలగనడం  లేదు  కదా అనుకుంటూ , ఆ ఆలోచనల్లో  ఉండగానే ఇల్లొచ్చింది. ఇంటికి  రాగానే  ప్రవల్లిక కు  ఫోన్ ... 

సౌమ్య చేసిందను కున్నారు.

అమ్మా !ప్రణవ్ ఫోన్  లోపలికెళ్ళనా?"  అని అడిగి ప్రవల్లిక లోపలికెళ్ళింది.. 

లక్ష్మి జరిగిన వన్నీ  ఏకరువు  పెట్టింది.. 

సంగీత  అనురాధతో  "అసలు ఎవరమ్మా అన్నది 
ఈ కాలం పిల్లలు పాడయిపోతున్నారు  పెద్ద  చిన్న  గౌరవం లేని వాళ్ళు  అని "...
"అసలు ఎంత  మర్యాద, ఎంత  సంస్కారం  .
నిజంగా నేను సెలెక్ట్  చేసినవి  నచ్చాయో  లేదో  తెలీదు కానీ  వాటిని  accept చేసి  నాకు  సంతోషాన్నిచ్చాడు చూడు అది ఈ జన్మకు  చాలు ".
  
"మన వల్ల  ఒకరికి ఆనందం కలుగుతున్నది మన  మాటల  వల్ల  ఒకరికి  సంతోషం కలుగు తున్నది  అంటే అది మనం తప్పకుండా  చేయాలి  కదమ్మా.." అంది 

"  అలా అనుకోవడానికి కూడా మంచి  సంస్కారం కావాలి. అది ముందు వారి కుటుంబం  నుండి  వస్తుంది, ఒక కుటుంబ పెద్దలను చూసే ఎవరైనా  పిల్లను  ఇవ్వాలి , పిల్లను  తెచ్చుకోవాలి.. 

"వాళ్ళు  నిన్ను , నన్ను చూసి కాదు  బామ్మను  చూసి  మన  అమ్మాయిని  చేసుకుంటున్నారు.. 
అలాగే  బామ్మ కూడా   వాళ్ళ  పెద్ద  వాళ్ళను  చూసాకే  సంత్రుప్తి  పడింది  ..

"ఎందుకో  తెలుసా ! పెద్దవారున్న  ఇల్లు చక్కని  మేడ  లాంటిది... ఎంత  మంది వచ్చినా  ఇంకా  చోటు  ఉంటుంది ఏ తుఫానొచ్చినా  వరదలొచ్చినా  చెక్కు చెదరకుండా ఉంటుంది  .."

"అదే  పెద్దలు  లేని  ఇల్లు  రెల్లు గడ్డి తో చేసిన  పొదరిల్లు. చిన్న తాకిడికే  అల్లాడుతుంది. 
 గాలి వాన వస్తే  కూలిపోతుంది... పెద్దల పెంపకంలో  పెరగని  పిల్లలకీ  పెరిగిన  పిల్లలలకు  చాలా  తేడా  ఉంటుంది  .."

" పెద్దల పెంపకం అంటే, ప్రణవ్ వాళ్ళ  అమ్మదగ్గర  కాదు.. ప్రణవ్ వాళ్ళ బామ్మ  వాళ్ళ అమ్మమ్మగారి  దగ్గర పెరగడం ,కలిసి  ఉండడం.."
"అప్పుడే  సంస్కృతి,సాంప్రదాయాలు  అలా ఒక  తరం  నుండి  ఇంకో  తరానికి  బదిలీ  అవుతాయి  లేదంటే  తల్లులకు కూడా తెలీని పరిస్థితి. వాళ్ళకే తెలీనప్పుడు ఇంక  కోడళ్ళకేం  నేర్పిస్తారు. "

"అలాంటప్పుడు , కోడలు అన్నీ  తెలిసిన  ఇంటి నుండి  వచ్చినప్పుడు  కొంత మంది  అత్తగారి  బలహీనతలు  చూసి  గేలిచేసి  ఆడుకోవచ్చు, 
లేదా  అత్తగారికి  చేదోడు, వాదోడుగా ఉండి ఇంటిని  స్వర్గం చేసి తమ ఇంటి పేరును ,పరువును  నలగురిలో  నిలబెడతారు.. "

"అందుకనే  కోడలు తెచ్చుకునే  ముందరే  అత్తగారు  అన్నీ తెలుసుకుని ఉండాలి. సంప్రదాయం పాటించే  ఇంటి నుండి  కోడలు వస్తే  వాటిని  ముందు  గౌరవించాలి అంతే కానీ  మాఇంట్లో లేవు  అని  తీసి పారేయకూడదు .."

"అలాగే  తెలియని ఇంటి నుండి వస్తే  నెమ్మదిగా  చెప్పి  చేయించుకోవాలని మీ బామ్మ   హర్ష  పెళ్ళి  చేద్దాం  అనుకున్నప్పుడు  నాకు చెప్పిన  మాటలు.."

" దేవుడి దయవల్ల గాయత్రి గారు చాలా మంచివారు. వారి అమ్మగారు , అత్తగారు ఇద్దరూ  మంచి  సంస్కారం  ఉన్నవారు  అందుకే  ప్రణవ్ చక్కని  సంస్కారం తో  ఉన్నాడు."

"చూసావా మీ అందరి ముందూ  మాట్లాడకుండా   
ఇప్పుడు  మాట్లాడుతున్నాడు, అదే సంస్కారం ,
 ఒకరు  చెబితే  రాదు,  మనసులోంచి  రావాలి  పెంపకంతో  రావాలి  అంతే .ఇంక  నిశ్చింతగా ఉండు" అని అనూరాధ సంగీతను సమాధాన  పరిచింది..

ఇక  అందరూ  పెళ్ళి పనుల్లో  బిజీ  అయ్యారు.. 
వరుణ్  కూడా  వచ్చాడు.. రెండు రోజులలోకి వచ్చంది  సౌమ్య  పెళ్ళి.. 

ఆరోజు  సౌమ్యని పెళ్ళికూతురిని  చేసారు.. 
సౌమ్య  బతిమాలి  సంగీతను అడిగి ప్రవల్లికను  తనదగ్గరే  ఉంచుకుంది..

 పెళ్ళిలో  అందరి  ద్రుష్టి  కాబోయే పెళ్ళికూతురు ప్రవల్లిక మీదే  ..  ప్రవల్లిక అందరి ద్రుష్టినీ  ఆకర్షించింది.. 

అప్పగింతలయ్యి  సౌమ్య  వెళ్ళిపోతుంటే ఏడుస్తున్న  ప్రవల్లికను  చూసి  రేపు  నువ్వు కూడా అక్కడికేగా  అని  మేల  మాడారు.. 

ఇక  రేపటి  నుండి  ప్రవల్లిక  పెళ్ళి  ఏర్పాట్లు  చూసుకోవాలి.. 

సశేషం

బాంధవ్యం....... 60

పెళ్ళి  పనులు  మొదలయ్యాయి  

యాజ్ఞీకం సామాను  తేవడానికి  హర్ష   హరిహర్రావుగారు  బయలుదేరారు...

  పెళ్ళి కూతురు బుట్ట , మూసి వాయనాల  చేటల కోసం  అనూరాధ , సంగీత  బయలు దేరారు.. 

 వెళ్ళే  ముందు  బామ్మ  ఖచ్చితంగా  చెప్పారు 

" ప్లాస్టిక్  రాహువు,  ఇనుము శనీశ్వరుడు  అందుకని ఎటువంటి  డిజైన్లు,హంగు , ఆర్భాటాలు  లేకుండా వెదురు  బుట్ట మాత్రమే  తీసుకు  రండి  అలాగే  చేటలు  కూడా  జతలు తెండి  మంచివి  చూసి  వాడుకునే లాగా  .."

" ఇంక తలంబ్రాలంటే బియ్యం మాత్రమే ,  కావాలంటే  ముత్యాలు  తెచ్చి  కలపండి కానీ పిచ్చి  పిచ్చి  పూసలన్నీ  వద్దు అని  చెప్పింది.. "

అలాగే  అంటూ  వెళ్ళారు వాళ్ళు.. 

"అమ్మా  లక్ష్మీ..  ఈ మూడు  రోజులు పాపకు  పెరుగు , పసుపు కాస్త  బియ్యం పిండి  కలిపి  ముఖానికి  రాసి  నలుగు  పెడితే  మంచి  రంగొస్తుంది ... అంతే  కానీ, అందం  మెరుగు  పెట్టే  దుకాణానికి  వెళ్ళక్కరలేదు  అంటూ  అందరికీ  పనులు  పురమాయించేసారు..."

బయట నుండి రావలసిన వస్తువులతో  పాటు  బంధువులు కూడా వచ్చేసారు .సంగీత వాళ్ళ పిన్ని బాబాయ్  పిల్లలు  మేనమామలు  హరిహర్రావుగారి  తమ్ముడు  చెల్లెలు వాళ్ళ పిల్లలు  అందరితో  ఇల్లు  సందడిగా  మారింది... 

మంచి రోజు చూసి  ఇంటి  ముందు  పందిరి  వేసి  పందిరి  గాటకు  పూజ  చేసారు  తెల్లవారి   పెళ్ళి  కూతురిని  చేస్తున్నారు.. 

సాయంకాలం  హర్ష తో  బాటు  వాళ్ళ  బాబాయ్  కొడుకు  వెళ్ళి  పూలజడ  పూలు  తెస్తూ  గాజులబ్బాయికి  చెప్పి  వచ్చారు... 

తెల్లవారి పొద్దున్న  8.40 కి  ముహుర్తం  ప్రణవ్ ని పెళ్ళి కొడుకును  చేసామని ఫోన్  రాగానే  ఇక్కడ  ప్రవల్లికను  పెళ్ళికూతురిని  చేసారు ..

ప్రవల్లికు అందరూ బొట్టు పెట్టి  గాజులు  వేస్తున్నారు  ముందుగా  సంగీతను వేయమంటే  వద్దని  అనూరాధ తో  వేయించింది.. తరవాత  అందరూ  తలా రెండు గాజులు పెళ్ళి కూతురికి వేసి  ఆశీర్వదించారు.. 

ఆ కార్యక్రమం  అయిన  వెంటనే  అంకురార్పణ మొదలు  పెట్టారు... 
అబ్బాయి  వాళ్ళింట్లో  స్నాతకం  మొదలయ్యింది..  సంగీత మేనత్త  మనవడు  ప్రవల్లికకు  తమ్ముడు  వరసయిన  అబ్బాయిని వాళ్ళ అమ్మ ,నాన్నతో పాటు పంపించారు.. 

"బామ్మా ! కాస్త జరుగుతారా అన్న  ఫోటోగ్రాఫర్  ని  బాబూ ఇక్కడ  అంటే అన్నారు కానీ  పెళ్ళిలో  మటుకు  అనకండి, మధ్యలో రాకండి.. 
 వాళ్ళను  హాయిగా  పెళ్ళి  చేసుకోనివ్వండి.. 
ముహూర్తం  అయ్యే  దాకా  మీకు  ఏ భంగిమ  కనబడితే  ఆభంగిమతో ఫోటో  తీసుకోండి.."

 "ముహుర్తం  అయ్యాక  మీఇష్టం  తెలిసిందా?"  అని భోజనాల ఏర్పాట్లు  చూడడానికి  వెళ్ళింది..

భోజనాలవ్వడం పూర్తవగానే, హాల్ కి  వెళ్ళే ఏర్పాట్లలో  మునిగి  పోయారు  

" హరీ ! చిన్నవాణ్ణి ,  అనూరాధవాళ్ళ  తమ్ముడిని   ఇద్దరిని  ముందు హాల్ కి  పంపించి   ఏర్పాట్లు  చూడమంటే  బాగుంటుందేమో పెళ్ళివారు  వచ్చేసరికి  వారికేలోటు లేకుండా అన్నీ  బాగుండాలి "
  
అలగే అమ్మా! పంపిస్తాను అంటూ వెళ్ళాడు.. 

ఇంట్లోంచి బయలుదేరే ముందు సంగీత ప్రవల్లికను  దగ్గరకు  తీసుకుని  కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
   "మా అమ్మాయిగా వెళుతున్నావు మళ్ళీ సారి  వచ్చినప్పుడు  ఇంటిపేరు మార్చుకుని ఇంకో  ఇంటి కోడలివై  వస్తావు  కదూ " అని.. 

"అమ్మా ! మరీ ఎమోషనల్  అయిపోతున్నావు  నాకూ  ఏడుపొస్తుంది" ...అన్న  ప్రవల్లిక తో  

" వద్దు వద్దు  పద "అంది  

"వదినా ! మీరు కాసేపు ఉండి రిలాక్స్ అవ్వండి, తరవాత రండి " అని  లక్ష్మి  ప్రవల్లికను  తీసుకెళ్ళింది  

అందరూ  వెళ్ళిపోయారు  హాల్ కి ,
 బామ్మా , సంగీత , ఇద్దరు పనివాళ్ళు  మిగిలారు 
 ఏదో ఒక కారొచ్చే దాకా  ఇంట్లో  ఉండాలి ..

సంగీతను  గమనించిన  బామ్మ

 "ఏంటీ!  ఏడిచావా ?" అనడిగింది 

 "లేదు బాగానే ఉన్నాను" అంది.

"చూడు తల్లీ ! మీ అమ్మ దగ్గర కంటే , నువ్వు  నా దగ్గర , నా చేతుల్లోనే ఎక్కువ ఉండే  దానివి."

 " ఈచేతులతో  పెంచాను  , రోజూ నేనే అన్నం  పెట్టేదాన్ని. పెద్దదాన్ననే  ఒకే  ఒక  కారణంతో  
నా బాధను  ఎవరితో  పంచుకోలేదు.
నేను డీలా పడితే  అందరూ ధైర్యం  కోల్పోతారని.."

" కానీ, రోజూ ఏడుస్తూ దేవుడికి  దండం  పెట్టుకున్నాను . నీ జీవితం  బాగు చేయమని.. 
నీ వయసు  పిల్లలంతా వాళ్ళ మొగుళ్ళతో  తిరుగుతుంటే  నాకెంత  బాధగా ఉండేదో "

" నేను ఏడిస్తే హరి, అనూరాధ కూడా  బాధ పడతారని ఊరుకునే  దానిని.. 
కానీ నాకిప్పుడు బాధలేదు  పైగా గర్వంగా  ఉంది"

" ఎన్ని కష్టాలున్నా ! ఒక్కరోజు  కూడా  బయట పడకుండా , కన్నీరు పెట్టకుండా , నీ జీవితాన్ని  నువ్వు  మలుచుకున్నావు,  నీకూతురిని పెంచుకున్నావు. తోడులేకపోయినా  పదిమందికి  తోడయ్యావు.. గర్వంగా  తలెత్తుకుని  నిలబడు.. "

"కంటనీరు అస్సలు పెట్టొద్దు. ప్రవల్లిక జీవితం చాలా  బాగుంటుంది దాని  కోసం  ఏడవకు .."

"ఇక ప్రవల్లిక తండ్రి మాటా ... ప్రవల్లిక దాని తండ్రిని   అదే మరిచిపోయింది . అన్నీ మరిచి ఆనందంతో కొత్త  జీవితంలోకి  అడుగుపెట్టబోతుంది .."

" ఇక నీ సంగతా ,  ప్రతి ఆడపిల్లకు  మూడుముళ్ళ బంధం వేసిన వాడే  ప్రియబాంధవుడు ,సఖుడు.
కానీ మీ మధ్య బంధమే తప్ప  బాధవ్యం  లేదు  కదమ్మా..  ఇంక  ఎందుకు బాధ పడడం .."

" పెళ్ళిపందిట్లో నీ కంటనీరు, నీ బాధ, దానికి మంచివి కావమ్మా! ఆనందంగా ఉండు.. దాన్ని  సంతోషంగా అత్తవారింటికి పంపించు.. "

" నీకు  మేమంతా తోడుగా ఉంటాము. నీకు అల్లుడి రూపంలో  కొడుకు వస్తున్నాడు . నువ్వు  కూడా  కొత్త  బంధాలను  ఆస్వాదించు.."

" అమ్మా ! కారొచ్చింది" అన్న పనమ్మాయి  మాటతో 

 "పద వెళదాం.  చక్కగా సంతోషంగా, సంబరంగా పాపపెళ్ళి చేద్దాం.. 

అంటూ హాల్ కి  బయలు  దేరదీసింది..
 
సశేషం

బాంధవ్యం  ......... 61

వీళ్ళు  హాల్  కి  చేరేటప్పటికి అందరూ  కాఫీలు  సేవిస్తున్నారు.. బామ్మ  సంగీత  కూడా  వారితో  కలిసారు.. 

పెళ్ళి  వారు  ఇంకో  గంటలో వస్తారట కాఫీలు  తాగి  ఏర్పాట్లు  చూస్తున్నారు.. పాపం  ప్రవల్లికకు  సౌమ్య  లేని  లోటు  బాగా తెలుస్తున్నది.. 

దూరంగా  ఉన్నా కూడా  తనే  updates ఇస్తున్నది. 
"ఏం  చీర  కట్టుకున్నావు ... నీకు  మాచింగ్  అని  ఆంటీ  చెప్పిన  డ్రెస్సే  వేసుకున్నాడు ప్రణవ్.. "

"భలే  నాకూ  వరుణ్  కి ఎంత  ఆశ్చర్యం  వేసిందో  తెలుసా  .. మనుషుల  ఎదురుగుండా  మాత్రమే  కాదు  లేనప్పుడు కూడా  వారిని  గౌరవించడం  ఎంత  మంచి  సంస్కారం  కదా...You are lucky.." అని msg పెట్టింది.. 

పెళ్ళి  వారు రానే  వచ్చారు...ఎదురు సన్నాహాలు  వరపూజ  అయ్యింది.. ఎవరెన్ని  చెప్పినా  బామ్మ  వినలేదు  పెళ్ళి కూతురుని  గది దాటి  రానివ్వలేదు..
వాళ్ళ  వాళ్ళంతా  పెళ్ళి కూతురిని  అక్కడికే  వచ్చి చూసారు. .  నవ్వులతో సరదాలతో  భోజనాలు కానిచ్చారు ..

" తెల్లవారి  పొద్దున్నే  ముహూర్తం పడుకోమ్మా !" అని  అనూరాధ  ప్రవల్లికను  పడుకోబెట్టింది...

ఎప్పటిలాగే  తెల్లవారినా  సంగీతకు  మాత్రం  చాలా  ప్రత్యేకంగా  అనిపిస్తున్నది..పుట్టినందుకు , కన్నందుకు  రెండు బాధ్యతలను  తీర్చుకో బోతున్నది.. 

ప్రవల్లిక పెళ్ళి తన  జీవిత కల ..
అది  నెరవేరబోతుంది. అమ్మతో కల్యాణం బొట్టు,పారాణి  పెట్టించింది.. 

అనూరాధ , హరిహర్రావుగారు   అబ్బాయికి  వరపూజ  చేసి  ఉత్తర జంధ్యం వేస్తున్నారు ..ఇక  కన్యాదానం  చేయాలేమో ..

 గౌరీ పూజ  చేస్తున్న  ప్రవల్లిక పక్కన  కూచుని  లలితా  పారాయణం  చేస్తుంది  సంగీత.. 
పందిట్లోకి  వెళ్ళి  ఎవరినీ  పలకరించాలనిపించలేదు. కదలకుండా పక్కనే కూచుని తన  కూతురు  జీవితాన్ని  చల్లగా  చూడమని ఆ తల్లిని  మనసులోనే వేడుకుంటున్నది. చూసేవారికి  విచిత్రంగా అనిపించినా అది ఆ తల్లి  మనసుపడే  ఆరాటం  అంతే.. 
ఇంతలో బామ్మ  వచ్చింది  "పాపా  జీలకర్ర  బెల్లం  తలమీద  పెట్టి తెర  తీయగానే  అబ్బాయి  కళ్ళలోకే  చూడు ఫోటో  అబ్బాయిని  కాదు..ముహుర్తం  ముఖ్యం ,అబ్బాయిని  చూడడం ముఖ్యం....తెలిసిందా ?" 

"అబ్బాయిక్కూడా అదే  చెప్పా !" 'అవును  బామ్మా!  అమ్మమ్మ  చెప్పింది " అన్నాడు.. సరే  మరి  పందిట్లోకి వెళతా" అని బయటకు వెళ్ళింది.

ఇరువేపులా  బ్రహ్మ గార్లు  వచ్చి  మహా  సంకల్పం  చెబుతున్నారు.. 

మనిషి  వదిలేసి  పోయినా  ఫలానా వారి   ముని  మనవరాలు , మనవరాలు  కూతురు అని చెప్పక  తప్పని పరిస్థితి..  విడాకులు  తీసుకున్నంత  మాత్రాన  ఈ వంశ పరంపరనుండి  వేరుచేయగలరా?. 

అంతేనా  మాతా  మహుల  పేరు  కూడా  వస్తుంది పెళ్ళంటే  రెండు  కుటుంబాల కలయిక .  ఇది తన  పెళ్ళిలో  కూడా ఇలాగే  అనుకుంది ..

 ముత్తాత  పేరు తెలీదుగా  ఎలా అని  ఆలోచిస్తున్నది  అడగనే అడిగారు వాళ్ళు.పురుషోత్తమరావుగారు  అంటూ  వనిత చెప్పింది.. 
"గబ గబా వనిత  దగ్గరకెళ్ళింది వదినా మీరెప్పుడొచ్చారూ ?"అంటూ 
"నేను , మీ అన్నయ్య  వచ్చాం .ఎందుకో  రాకుండా  ఉండలేక  పోయాం "అన్నది  వనిత  .

"చాలా  సంతోషం  వదినా .". అంటూ పందిట్లోకి తీసుకు వెళుతున్న ప్రవల్లిక  వెనకాలే  బయలుదేరారు.

పెళ్ళి కూతురు కూచున్న బుట్టను హర్ష వాళ్ళతో బాటు  శ్రీధర్  కూడా పట్టుకుని  పందిట్లోకి  నడిచాడు.. 
కన్యా  దానం, ముహూర్తం  అయిపోయాయి .
లక్ష్మీ   హర్ష వాళ్ళు  మధుపర్కం  బట్టలు  పెట్టారు. 
సంగీత  వనిత  ఇద్దరూ  కలిసి  లోపలికి తీసుకొచ్చారు .
గోచీ పోసి  మధు పర్కం కట్టాలి .బామ్మకు తప్ప  ఎవరూ  అంత  బాగా  కట్టరు. బామ్మ నేను  కట్టను  అన్నారు ఎలాగా అని  అనుకుంటున్నారు ఇక్కడ .

ఇంతలో అమ్మాయికి మధుపర్కం  కట్టారా అంటూ అబ్బాయి  వాళ్ళ బామ్మ వచ్చారు .  మధుపర్కం  కట్టి  బుగ్గ మీద  ముద్దు పెట్టుకున్నారు ఎంత  ముద్దొస్తున్నావు అమ్మ  అంటూ... 

పెద్ద  ముత్తైదువలంతా  జ్యోతులు పెట్టిన  పళ్ళాలు  పట్టుకుంటే  మిగతావారు  తలంబ్రాల  బియ్యం పళ్ళాలతో వారి మధ్యలో ప్రవల్లిక పందిట్లోకి నడుస్తుంటే కన్నుల పండుగగా  ఉంది  చూసే వారికి..  

ఒక తంతు తరువాత  ఒకటి అన్ని  కార్యక్రమాలు  పూర్తయ్యాయి.. తలంబ్రాలతో  తెల్లచీర పచ్చగా మారింది  
సదస్యం ,నాగవెల్లి తరువాత నల్లపూసలతో,
కాళ్ళకు మట్టెలతో కన్నెపిల్లకు నిండుదనం  వచ్చింది.. 
తన దిష్టి తగులుతుందేమో  అనుకొని చూపు మరల్చుకుంది సంగీత.. 
కన్యాదానం తరవాత  బాధ్యత  అంతా  అబ్బాయి  వారిదే  .అందుకని  సంగీత  వచ్చిన  వారందరినీ  పలకరించడానికి   వెళ్ళింది  ..తను  భయపడినట్టు  ఏం  జరగటం  లేదు.. 
అందరూ  తనను  అభినందిస్తున్నారు.
కొంత మంది  మొహం  మీదే  పొగిడేస్తున్నారు.
మగ  పెళ్ళివాళ్ళయితే  ఆవిడ చాలా  strong Personality అట అంటూ సంగీతను  admiring  గా చూసారు..  
అందరిని  పలకరిస్తూ  భోజనాలు చేసి  వెళ్ళే వాళ్ళను  పంపిస్తూ  ఒక అనిర్వచనీయమైన ఆనందం  చవి చూసింది.. 

 అందరూ  వెళ్ళిపోయాక  ఫోటోల కార్యక్రమం  మొదలయ్యింది.. సంగీత వెళ్ళి ప్రవల్లిక  పక్కన  నించో  బోతుంటే ప్రణవ్ " అత్తయ్యా! నా పక్కన  నించోండి  అంటూ  చెయ్యి  పట్టుకుని  తనపక్కన  నించో  పెట్టుకుని  ఫోటో  దిగాడు.. "

పెళ్ళి  తంతు ముగిసి అప్ప గింతలు కార్యక్రమం  దగ్గర  కొచ్చింది..  చిత్రంగా  అందరి కన్నా  ఎక్కువగా  హరిహర్రావుగారు  ఏడిచారు..  

నరసింహారావుగారి చేతుల్లో  పెడుతూ, "తండ్రయినా  మావగారయినా మీరే ...
సుకుమారంగా  పెరిగింది అనను  కానీ  మనసు సున్నితమైనది. తప్పు  చేసినా చక్కదిద్దండి " అంటూ  కళ్ళు  తుడుచుకున్నారు. 
మగ పెళ్ళి వారితో  సహా అందరి  కళ్ళూ చెమర్చాయి.బామ్మ ఎవరూ  చూడకుండా  కళ్ళొత్తుకుంది..
...........
అందరి ముద్దులగుమ్మ  పెళ్ళి అయ్యి అత్తవారింటికి  వెళ్ళింది  ఇల్లంతా  చిన్నబోయింది...

  నేను ఈ రోజునుండి  ఒంటరిగా ఉండడానికి  అలవాటు  పడాలి  అనుకంటూ  బామ్మ  దగ్గర  పడుకుంది  సంగీత.... 

సశేషం.. 

బాంధవ్యం.....  62

పెళ్ళి  వాళ్ళింట్లో   గ్రుహప్రవేశం  జరిగింది.. 

" ఆనందంగా నిన్ను మా కుటుంబంలోకి  ఆహ్వానిస్తున్నాం తల్లీ ! అని  గాయత్రిగారు  ప్రవల్లికను  అక్కున  చేర్చుకున్నారు.. 

ప్రవల్లికతో  వెళ్ళిన  సంగీతా వాళ్ళ పిన్ని  మంజుల లక్ష్మీ ,హర్ష కొత్త జంటకు బట్టలు  పెట్టారు. బాబు  ఉండలేడని  హర్ష  లక్ష్మీ  వెనక్కి  వచ్చారు.. 

సౌమ్య ,పిన్ని , ప్రవల్లిక  ఒక గదిలో  ఆ రాత్రంతా  కబుర్లతో  కాలక్షేపం  చేసారు  ..
తెల్లవారి  భక్తి గా  రెండు  జంటలూ మళ్ళీ  వ్రతం చేసుకున్నారు..... అమ్మమ్మ  తాతయ్య   వరుణ్  వాళ్ళను కూడా   చేసుకోమన్నారు.. 

చూసే వారికి  కన్నుల  పండుగగా ఉన్నారు  వాళ్ళు... 
 ఇల్లంటేే  ఇది , ఆప్యాయతలంటే  ఇవి,  మనుషులంటే వీళ్ళు ,కుటుంబం అంటే  ఇలా ఉండాలి  అన్నరీతిలో  ఉన్న  వారికి  ఏదిష్టి  తగలకూడదని అనూరాధ  పదే  పదే  మనసులో  అనుకుంది.. 
 ఆడ  పెళ్ళివారు అని  నిర్లక్ష్యం  చేయకుండా   ప్రత్యేకంగా  అన్ని  మర్యాదలతో  కొత్త  జంటను మధ్యలో  కూచో  బెట్టి వారికి వడ్డన  చేసారు. 

భోజనాలయ్యాక  సాయంత్రం పెళ్ళికొడుకును  పెళ్ళి  కూతురిని  తీసుకుని  అందరూ  హరిహర్రావుగారింటికి వచ్చారు.. 

తెల్లవారి పొద్దున  అందరూ  కలిసి  గుడికెళ్ళారు.  ఇంటికొచ్చే సరికి బామ్మ  కమ్మగా  వంట  చేసి  ఉంచింది..  అందరూ  కలిసి  భోంచేసారు.. పిల్లలు  కబుర్లు చెప్పుకుంటున్నారు.. 

అనూరాధ,  బామ్మ  వంటింట్లో   నెమ్మదిగా  మాట్లాడుకుంటున్నారు ఏదైనా  snacks 
వాళ్ళకిద్దామని  వంటింట్లోకొచ్చిన  సంగీతకు  వీళ్ళ  మీటింగ్ కి నవ్వొచ్చింది .. 

అమ్మ ఎంత తెలివిగలదయినా , చదువుకున్నదయినా  బామ్మ  ముందు  ఒక్క మాట మాట్లాడడం,  ఎదురు చెప్పడం  తనకు  తెలీదు .తాము  చూడలేదు .   
నాన్న  ఏంచెప్పినా  కాదనక  చేస్తూ  అడిగి నప్పుడు  మాత్రమే   తన  అభిప్రాయం  చెబుతూ  ఒద్దికగా   ఉండడమే   తాము  చూసారు.. 
తరువాత  లక్ష్మి  వచ్చాక    సందడి  సందడి . తన  మనసులో  ఉన్నది  చెప్పడం  రెండు  తరాల వారిని గౌరవిస్తూ అనుసరించడం  అవసరమైనప్పుడు  తన  అభిప్రాయంతో  ఏకీభవింప చేసుకోవడం  ఇదొక  మార్పు  అయినా ఇద్దరూ  సంతోషంగా   ఉన్నారు.. 
అనుకుంటూ " ఏంటమ్మా !మాట్లాడుకుంటున్నారు" అనడిగింది .
"రాత్రి  గర్భాదానం కదే బ్రాహ్మడు  9.30  కు  వస్తాడు 
ఈ లోపల భోజనాలవ్వాలి. వాళ్ళింటినుండి  గాయత్రి గారు  నరసింహారావు రావుగారు  మాత్రమే  వస్తారట  భోజన  ఏర్పాట్లు  చూడాలి ."

"అమ్మా,  నాన్న  వాళ్ళ  గది  ఏర్పాటు  చేద్దామా  అని మాట్లాడుకుంటున్నాం.." అంది బామ్మ 

ఒక్కసారి  తన  మొదటి  రాత్రి గుర్తొచ్చింది.. "ఇక్కడెందుకమ్మ  ఇంత  మందిలో  ఆ ఇంట్లో  ఏర్పాటు  చేద్దాం. "
"అదేంటే  పెళ్ళి పనులన్నీ  ఇక్కడ  జరిగితే   ఈ కార్యక్రమం  కూడా  ఇక్కడే  జరగాలి .."
"అదేం  లేదు ఈ రోజుల్లో  హోటల్  లో కూడా  చేస్తున్నారు  అంత  కంటే  తక్కువేం కాదు"  అని  మొత్తానికి  ఒప్పించింది ...

హర్షను  బజారుకు  పంపింది. లక్ష్మీ  తను కలిసి   ఆయింటి  కెళ్ళి సర్దారు . హర్ష  తీసుకొచ్చిన  పూలు, పూల దండలతో  గదిని  అలంకరించారు..

"వదినా !మీరు ఇక్కడే  ఉండండి , ఇప్పుడే  వస్తానని ఆ ఇంటినుండి  స్వీట్స్  పట్టుకొచ్చింది లక్ష్మి  అన్నీ   సర్దాక  ఒక  సారి త్రుప్తిగా చూసి వెళ్ళిపోయారు..
 
రాత్రి  8.30  కల్లా గాయత్రీ గారు  వాళ్ళు  వచ్చారు.. 
భోజనాలవ్వగానే  బ్రాహ్మణుడు  రానే వచ్చాడు 
జరగాల్సిన తంతు  జరిపించాక  ఇంట్లో  ఉన్న  దంపతులకు  పిల్లలతో  దంపత్తాంబూలాలు ఇప్పించాడు.. 

తరువాత  బ్రాహ్మణుడు , గాయత్రీ దంపతులు  కూడా  వెళ్ళాక  .. హర్ష , లక్ష్మీ కలిసి  కొత్తదంపతులను   ఆయింటికి తీసుకెళ్ళి  దింపి  వచ్చారు ..

వాళ్ళు  ఇంటికి  వచ్చేటప్పటికి సంగీత  దిగులుగా కూచుంది.. ఏంటక్కా అన్నాడు  హర్ష   ఏం  లేదు  అని "లక్ష్మి ఇలారా ! అని పిలిచి అంతా  బాగానే ఉంది కదా  వాళ్ళకు అంది .."
"బాగుంది  వదినా ! మీరేం దిగులు పెట్టుకోకండి. 
Be Happy ..  వాళ్ళు  కూడా  happy నే "అంటూ  వెళ్ళింది.. 

పడుకున్న  సంగీతకు నిద్ర పట్టలేదు  తన  మొదటి రాత్రి  గుర్తొచ్చింది  తన  వివాహ జీవితం గుర్తొచ్చింది.  
"భగవంతుడు నాతో  ఆడుకున్నాడా ? నా జీవితంతోనా?.. "
"కేవలం నేనొక  బిడ్డకు  తల్లిని  కావడానికేనా  నా  పెళ్ళి  జరిపించాడు.. వీరిద్దరినీ  కలపడానికేనా  నేనున్నది.  ఈ జీవితానికి అర్థం  పరమార్ధం ఇదేనేమో. పిల్లలిద్దరూ  చల్లగా  ఉంటే చాలు .." అనుకుంటూ  పడుకుంది ..
...................................
ప్రణవ్  ప్రవల్లిక ఇద్దరూ  గదిలోకి  అడుగు  పెట్టి ఆశ్చర్య పోయారు... సినిమాలో  లాగా కాకపోయినా  చక్కగా  అలంకరించి  ఉంది  గది  .
"మా రూమేనా ఇంత  మార్చేసారు"  అని  పైకే  అంది  ప్రవల్లిక..
" కదా! ఇదంతా అవసరమా " అన్నాడు  ప్రణవ్ 
అలా మాట్లాడుతూనే ఇద్దరూ  చనువుగా కబుర్లు  చెప్పుకోవడంలో   మునిగి  పోయారు.. 
 ఉన్నట్టుండి ప్రవల్లిక ప్రణవ్  చెయ్యి  తన  చేతిలోకి తీసుకుంది .
"మా  నాన్న  గురించి చెప్పాలి నీకు , మా అమ్మ తన తప్పేమీ  లేకుండానే జీవితంలో  ఇంత శిక్ష  అనుభవించింది " అంటూ  ఏదో   చెప్పబోయింది..

" ప్రవల్లికా! నేను నిన్ను  అడిగానా .. నాకు  తెలుసుకోవాలని కూడా  లేదు.. ఎందుకంటే  అమ్మ  ఒకటే  చెప్పింది . అంత మంచి  కుటుంబంలోని  ఆవిడ  కావాలని  కాపురం  పాడుచేసుకోదు ఏదో  తగిన కారణం  లేకపోతే తప్ప, అది  కూడా  ఒక  ఆడపిల్ల తల్లి  అయి  ఉండి కూడా " 
 "పెద్దమ్మ  అయితే  నిన్ను  ఒకటే  పొగడడం. ఎంత  బుద్ధిమంతురాలో  అని.." 
"అమ్మ  నిన్ను  చూసాక  చెప్పిన విషయం . అందరిలో  పెరిగిన  అమ్మాయి , కష్టం , సుఖం  కూడా తెలిసిన  అమ్మాయి,  చాలా  సంస్కారవంతురాలు  పెద్దలంటే  గౌరవం  ఉన్న  అమ్మాయి  అది  చాలు  మనకు   అని "
  "అంతే  నిజంగానే ఆ టాపిక్ మనకొద్దు.  ఇంకెప్పుడూ మన మధ్య  తీసుకురాకు " అన్నాడు.. 

"అలాగే  నా మీద  ఏమైనా  expectations  పెట్టుకున్నావా ?" అని  అడిగాడు.. 

" నన్ను నిద్రలో లేపి అడిగినా అమ్మ  గురించే  మాట్లాడుతాను.   నేను  కొడుకునయితే  అమ్మను ఎలా  చూసుకుంటానో  పెళ్ళయ్యాక  కూడా  అలాగే  చూసుకోవాలని , నాతోనే ఉంచుకోవాలని జీవనపోరాటంలో అలసిపోయిన  అమ్మను  
సేద తీర్చాలని అంతే..."
 "అలాగే చూసుకుందాం...అత్తయ్య  నాక్కూడా  అమ్మే..  
అత్తయ్యను చూడక ముందు  వేరు,  చూసాక  నేను  ఫుల్  ఫిదా  తెలుసా ? అసలు  అత్తయ్య  మనసులో  అంత  బాధతో  ఉన్నారని ఎవరైనా  చెబితే  కానీ  తెలీదు.. "
 " తన మనసులో  సుడిగుండాలు దాచుకుని  నిన్ను  అంత బాగా చూసుకోవడమే కాదు,  మీ అందరికీ కూడా తన  బాధ  తెలీనీకుండా   ఉంటున్నారు  emotions  దాచుకోవడం అంటే  మాటలు  కాదు.అది  చాలు  అత్తయ్య  ది గ్రేట్ అనడానికి.  "

"నువ్వు అమ్మను ఎలా చూసుకోవాలనుకున్నావో  అలాగే   చూసుకుందాం" అన్నాడు.. 

ఇంత కన్నా  కావలసిందేముంది  ఒక ఆడపిల్లకి.
ప్రతి  భార్యకి  భర్తను  మించిన  స్నేహితుడు  లేడు  కదా ...  భర్తతో  ఏ సంకోచం లేకుండా ప్రతి  విషాయాన్ని చెప్పుకోగలిగే  అవకాశం ఉన్న  ప్రతి ఆడపిల్ల  అద్రుష్ట వంతురాలే  I am very Lucky  అనుకుంటూ  హాయిగా  నిశ్చింతగా  ప్రణవ్  గుండె  చప్పుడు  వింటూ  నిద్రపోయింది... 

తెల్లవారి  అందరితో   సరదాగా  మాట్లాడుతూ  కలిసిపోయి ఆ  ఇంట్లో ఒకసభ్యుడయిపోయాడు ప్రణవ్ .. 
లక్ష్మి  అయితే  "నేను ఇంటికి  వచ్చినప్పుడు నాకు  ఒకటే  కోరిక  ప్రవల్లిక పెళ్ళి  grand గా  చేయాలని .  ఆ కోరిక  తీరింది I am very  Happy  For  that" అంటూ ప్రణవ్  భుజం  మీద  చేత్తో తట్టి  ప్రవల్లికను దగ్గరకు  తీసుకుంది.. 

ప్రణవ్ సంగీత  పక్కన కూచుని "అత్తయ్యా!
Pass port  చేయించి  రెడీగా  పెట్టుకోండి 
ప్రవల్లిక  Leave complete అయ్యాక వచ్చి  job  రిజైన్ చేసి 3 months తరవాత వచ్చేటప్పుడు మీరుకూడా వద్దురు గానీ " అని  చెప్పాడు  
"నేనెందుకు  బాబు?"
"ఎందుకేంటి ? కొడుకు  దగ్గర కొన్నాళ్ళు ఉండరా?"
"అలాగే  వస్తుందిలే  ప్రణవ్ , మరి నువ్వు ప్రవల్లికను జాగ్రత్తగా  చూసుకుంటావా ?"అన్న హరిహర్రావుగారితో ..
 "ప్రవల్లికకు కూడా చెప్పారా తాతయ్యా నన్ను  బాగా  చూసుకోమని "అని సీరియస్ గా అంటున్న ప్రణవ్ ని  ఆశ్చర్యంగా  చూస్తున్న  హరిహర్రావుని నవ్వుతూ చూస్తూ 
" అత్తయ్య  బాధ్యత  నాది , మీ అమ్మాయిని  చాలా  బాగా  చూసుకుంటాను " అని  అంటుంటే అందరి  కళ్ళు  చెమర్చాయి .
బామ్మ  దగ్గరగా వచ్చి  ముద్దు  పెట్టుకుంది  " బంగారు  తండ్రివమ్మా  నువ్వు  అంది.. "
  ఆ సాయంత్రం అందరి  దగ్గరా సెలవు  తీసుకుని   బయలు దేరారు ఇద్దరూ . 

ఇంక  వారం  రోజులలో  బయలు  దేరి  వెళతారు 
పిల్లలు  packing హడావిడిలో  ఉన్నారు   పెద్ద  వాళ్ళు దిగులుతో  ఉన్నారు.. 

ఒక రోజు  లలితకు  ఫోన్  చేసింది  సంగీత  
"వదినా ! ఒకరోజు  పిల్లలను  తీసుకురావాలను కుంటున్నాను  మీరు  చూడలేదు  కదా అందుకని" అంది. 
"హడావిడిగా  ఉంటారేమో  వద్దులే  సంగీతా
 మా మనసు కూడా ఏం బాగా  లేదు  సతీష్  ఎంత  చెప్పినా  వినకుండా  old-age home లో  జాయిన్  అయ్యాడు."
"జ్యోతి  చెప్పిన  మాటలతో నీ మీద  ఒక అభిప్రాయానికి వచ్చాడు..  అది  మార్చలేక పోతున్నాము .  అంతే అది  బాబు  దురద్రుష్టం.  ఈ సారి  వచ్చినప్పుడు  చూస్తాంలే" అని చెప్పింది. 
ఇంక  ఏం  మాట్లాడలేదు  సంగీత  ఫోన్  పెట్టేసింది.. 
ఆ చాప్టర్  అక్కడికి  క్లోజ్  ..
తరువాత  తెలిసింది  హరీష్  జ్యోతిని  చాలా  మాటలన్నాడని " నీ వల్లే  నా తమ్ముడి జీవితం  ఇలాగయ్యింది.  ఈ పాపం  అంతా  నీదే  అని "
........
ఆ రోజే పిల్లల ప్రయాణం  అత్తవారింటి నుండే బయలు దేరింది ప్రవల్లిక. బామ్మతో సహా అందరూ  Air Port కి వెళ్ళారు  ఫార్మాలిటీస్  పూర్తి  చేసుకుని  నించున్నారు  అందరూ 
ప్రవల్లిక అనూరాధ  చేయి పట్టుకుని  "అమ్మ  జాగ్రత్త అమ్మమ్మా.. మావయ్యా , అత్తా !అమ్మను  జాగ్రత్తగా  చూసుకుంటారు కదూ  "అంది 

 "అమ్మా ! వెళ్ళొస్తా దిగులొద్దు ,మళ్ళీ  వస్తానుగా అప్పుడు  నాతో  వచ్చేద్దువుగాని .."
 "బామ్మా ఆరోగ్యం జాగ్రత్త!రోజూ మాట్లాడుతుంటాంలే"
"తాతయ్యా! వెళ్ళొస్తా.... Thanku .... Thanku for  every thing... అని  అంటున్న ప్రవల్లిక తల మీద  చేయి  పెట్టారు.. 
ప్రణవ్ మాత్రం .."లక్ష్మి  పిన్నీ  వాళ్ళంతా  జాగ్రత్త  మీరే  చూసుకోవాలి .."
అని  అందరినీ  పేరు  పేరున  పలకరించి  అమ్మ  నాన్నకు  చెప్పి లోపలికి  వెళ్ళారు..
 వారు  కనబడినంత  సేపు  అందరూ  చూసి వెనక్కు  వచ్చారు.. 

రెక్కలొచ్చిన పక్షులు  ఎగిరిపోయాయి.. 👫

💞బంధాలతో  ముడిపడిన  బాంధవ్యం మాత్రం అలాగే  ఉంది💞

🌹సమాప్తం🌹

( PS...  బతకడం  వేరు  జీవించడం  వేరు  ..
సంగీత  ఇన్నాళ్ళూ  ప్రవల్లికను చూస్తూ బతికింది
 ప్రతి  చిన్న  చర్య  కొత్తగా  వింతగా  అనిపిస్తున్నది.. 
అందుకే ఇకమీదట ప్రణవ్ ప్రవల్లికతో కలిసి జీవిస్తుంది  అనే నిశ్చింతతో  ఉంది)

No comments: