ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి ! 
1. పవిత్రమయిన ఆకు
2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు.
3. శివునికి ఇష్టమయిన ఆకు.
4. బుట్టలు అల్లుకునే ఆకు.
5. అతి చిన్న ఆకు.
6. చేతికి పెట్టుకునే ఆకు.
7. భోజనానికి ఆకు.
8. వండినా ఆకారం మార్చుకోని ఆకు.
 9. శుభసంకేతం ఈ ఆకు.
10. ఆంజనేయునికి ప్రీతి ఈ ఆకు.
11. పురిటల స్నానానికి వాడే ఆకు.
12. దురదలు తెచ్ఛే ఆకు.
13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు.
14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు.
15. పువ్వులలో వినియోగించే ఆకు.
16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు.
17. కృష్ణుడు శయనించే ఆకు.
18. సామెత కు ప్రీతి ఈ ఆకు.
19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు.
20. గణేశుని ప్రీతి ఈ ఆకు.
21.కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు.
22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు.
23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు.
24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు.
25. మాసాలలో వాడే ఆకు.

Answer

ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి ! 

1. పవిత్రమయిన ఆకు …  తులసి
2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు ... పొగాకు
3. శివునికి ఇష్టమయిన ఆకు... మారేడు /Bilvam
4. బుట్టలు అల్లుకునే ఆకు... తాటి ఆకు
5. అతి చిన్న ఆకు... Chintaku/నేల వాము
6. చేతికి పెట్టుకునే ఆకు... గోరింటాకు
7. భోజనానికి ఆకు... అరిటాకు
8. వండినా ఆకారం మార్చుకోని ఆకు... Kariveapaku / biryani aku
 9. శుభసంకేతం ఈ ఆకు... మామిడాకు
10. ఆంజనేయునికి ప్రీతి ఈ ఆకు... తమలపాకు
11. పురిటల స్నానానికి వాడే ఆకు... వేపాకు
12. దురదలు తెచ్ఛే ఆకు... దురదగండేరాకు
13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు... Chikkudu / జిల్లేడాకు
14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు... కొబ్బరాకు
15. పువ్వులలో వినియోగించే ఆకు ... మరువం /damanam
16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు... వేపాకు / శమి ఆకు(జమ్మిఆకు)
17. కృష్ణుడు శయనించే ఆకు... మర్రి ఆకు
18. సామెత కు ప్రీతి ఈ ఆకు ... అరిటాకు
19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు... Chikkudu aaku
20. గణేశుని ప్రీతి ఈ ఆకు… గరిక 
21.కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు ... తుమ్మి ఆకు
22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు... అత్తిపత్తి ఆకు
23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు... తేయాకు ( టీ ఆకు)
24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు... Gorintaku /మందారాకు

25. మాసాలలో వాడే ఆకు... Biryani aku /జాపత్రి

No comments: